2యోహాను పత్రిక క్రైస్తవ ప్రేమలో తీవ్రత కలిగి ఉండమనీ (వ.5), వంచకుల విషయంలో మెలకువ కలిగి ఉండమనీ (వ.7-8) ‘‘ఏర్పరచబడిన అమ్మగారికి’’ (లేక ఒక సహవాసాన్నో, లేక ఆ సహవాసం సమావేశం అవుతున్న ఇంటి యజమాని అయిన ఒక స్త్రీనో ఉద్దేశించి) సలహా ఇస్తూ రాయబడిరది. రచయిత ఆ సంఘాన్ని త్వరలో దర్శించడానికి ప్రణాళిక వేసుకున్నాడు (వ.12).
Read More
గ్రంథ రచనా కాలం నాటి పరిస్థితులు
రచయిత: ‘‘పెద్ద’’ (వ.1) అనేది అపొస్తలుడైన యోహాను తన జీవితం చివరిదశలో తనకు తాను అన్వయించుకున్న బిరుదు (అపొస్తలుడైన పేతురు కూడా అతణ్ణి అదే విధంగా పిలిచాడు, 1పేతురు 5:1). ఆదిసంఘం 1యోహాను పత్రికను రాసిన రచయిత యోహానే అని సూచించినంతగా మరే ఇతర వ్యక్తినీ సూచించలేదు. 1,2 యోహాను పత్రికల మధ్య ఉన్న అనేక పోలికలను బట్టి యోహానే ఈ రెండవ పత్రికను కూడా రాశాడని అందరూ అంగీకరించారు.
నేపథ్యం: 2యోహాను పత్రిక మొదటి శతాబ్దంలోని చివరి రెండు దశాబ్దాల కాలంలో రాసి ఉండవచ్చు. ఈ కాలంలో యోహాను ఎఫెసు ప్రాంతాల్లోని సంఘాలకు కాపరిగా నాయకత్వం అందించాడు. 2యోహాను పత్రిక రాసిన కచ్చితమైన తేదీని నిర్ణయించడానికి మనకేమీ ఆధారాలు లేవు గానీ అది సుమారుగా 1యోహాను పత్రిక రాయబడిన కాలంలోనో లేక దాని తరవాత కొద్దికాలానికో రాసి ఉం టారనుకోవడం సమంజసంగా ఉంటుంది. ఇది అక్కడి విశ్వాసులపై యోహానుకున్న ఆప్యాయతను, వారి క్షేమం పట్ల అతని లోతైన శ్రద్ధనూ వ్యక్తపరుస్తున్న ఒక వ్యక్తిగతమైన లేఖ అని దీని రచనాశైలి వెల్లడి చేస్తున్నది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యెరూషలేము విషయంలో కన్నీరు విడిచిన యేసులాగా (లూకా 19:41), ‘‘సంఘములన్నిటి గురించిన చింత’’ వలన తాను అనుభవించే ‘‘అనుదిన భారము’’ (2కొరింథీ 11:28) గురించి రాసిన పౌలులాగా యోహాను కూడా ఈ సంఘం గురించిన చింత కలిగి ఉన్నాడు. ఒకరిపట్ల ఒకరు దేవుని ప్రేమను కనపరచడం వారు నిర్లక్ష్యం చేస్తారా? కపట బోధకుల వలలో చిక్కుకుంటారా? 2యోహాను పత్రిక తన పాఠకులను క్రీస్తును వెంబడిరచడంలో తమ నిబద్ధతను కొనసాగించేలా సహాయపడేటట్లు రాయబడిరది. ఈ పత్రికను ఏకంగా కలిపి ఉంచే ఆరు కీలకమైన పదాలను యోహాను ఉపయోగించాడు. ‘‘సత్యము’’ (ఐదుసార్లు), ‘‘ప్రేమ’’ (నాలుగు సార్లు), ‘‘ఆజ్ఞ’’ (నాలుగుసార్లు), ‘‘నడుచుట’’ (మూడుసార్లు), ‘‘బోధ’’ (మూడుసార్లు), ‘‘పిల్లలు’’ (మూడుసార్లు) అనే పదాలను పదేపదే వాడాడు. యోహాను సందేశం బహు స్పష్టంగా ఉంది. అతడు తన పిల్లలకు (1) సత్యములో నడుచుకోమనీ, (2) దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలనీ, (3) ఒకరినొకరు ప్రేమించుకోవాలనీ, (4) క్రీస్తు బోధలను కాపాడుకోవాలనీ హెచ్చరించాడు. తద్వారా వారు క్రీస్తు విరోధి చేతిలో మోసానికి గురికాకుండా ఉంటారని అతడు చెప్పాడు. వారు దేవునిచేత ఎన్నుకొనబడినవారనే సత్యాన్ని ప్రారంభంలో, చివరిలో (వ.1,13) పేర్కొనడం ద్వారా విశ్వాససమాజం కలిగి ఉన్న ఆధ్యాత్మిక భద్రతను యోహాను రూఢపిరిచాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
క్రైస్తవ సంఘాలు దారితప్పిపోవడం చాలా తేలిక. పరస్పర ప్రేమానురాగాలు అనే అత్యంత మౌలికమైన క్రైస్తవ దృక్పథం, కార్యాచరణల ప్రాధాన్యత గురించి 2యోహాను పత్రిక పాఠకులకు గుర్తు చేస్తుంది. దానితోపాటు మరొక అత్యంత కీలక ప్రాధాన్యత సత్యమైన క్రైస్తవ బోధలో స్థిరంగా నిలిచి ఉండడం గురించి ఈ పత్రిక నొక్కి వక్కాణించింది. ‘‘పూర్ణఫలము పొందడానికి’’ (వ.8) శ్రద్ధ గలిగిన పాఠకులు నిశ్చయంగా సరైన అడుగులు వేసేటట్లు, నిలిచియుండుటను గూర్చి ఈ పత్రిక నొక్కి వక్కాణిస్తుంది.
గ్రంథ నిర్మాణం
పాఠకులను కార్యాచరణకు పురికొల్పే ఉపదేశకరమైన సంభాషణకు రెండవ యోహాను పత్రిక ఒక శ్రేష్ఠమైన ఉదాహరణ. కొత్త నిబంధనలోని పత్రికల్లో కనిపించే సాధారణ విధానం, అంటే ఒక ప్రారంభం, ప్రధానాంశం, ముగింపు అనే విషయాలు ఈ పత్రికలో కూడా కనిపిస్తాయి. ఈ చిన్న ఉత్తరంలో కేవలం రెండు ఆజ్ఞలు మాత్రం ఉన్నాయి: ‘‘మీరు… జాగ్రత్తగా చూచుకొనుడి’’ (వ.8), దుర్బోధను మీ మధ్య నాటడానికి వచ్చినవానిని ‘‘చేర్చుకొనవద్దు’’ (వ,10) అనే ఆజ్ఞ. వ.5 లో ‘‘ఒకరినొకరము ప్రేమించుకొనవలెను’’ అని గుర్తు చేయడం చూస్తాం. ఇది ‘‘ఆజ్ఞ’’ (వ.4-6 లో నాలుగుసార్లు వాడబడిరది) అనే మాటకు దగ్గరగా ఉన్నది కాబట్టి దీనిని తప్పనిసరిగా చేయాలి అనే ప్రోద్బలం దీనిలో కనిపిస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”