సాధారణ పత్రికలలో ఒకటైన 2పేతురు ఆచరణీయమైన క్రైస్తవ జీవితం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. అందుకోసం అబద్ధ బోధకులకూ, వారి బోధలు నైతిక జీవితంపై చూపే ప్రభావానికీ వ్యతిరేకంగా హెచ్చరించడానికి పేతురు ఈ పత్రికను రాశాడు. అబద్ధ బోధలను ఎదుర్కొంటూనే దేవుని నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని నొక్కి చెబుతూ ఈ దుర్నీతితో నిండిన లోకంలో క్రైస్తవ సుగుణాలను కలిగి జీవించాలని పాఠకులను ఈ పత్రిక ప్రోత్సహిస్తుంది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: 2పేతురు గ్రంథకర్త తనను తాను అపొస్తలుడైన పేతురుగా స్పష్టంగా వెల్లడిపరచుకున్నాడు (1:1). అతడు తనను ‘‘సీమోను పేతురు’’ అని పిలుచుకున్నాడు (1:1). ఇది సాధారణంగా అతనిగూర్చి వాడబడిన పేరు కాదు (కేవలం అపొ.కా.15:14 లో వాడబడిరది). దీని ఉచ్ఛారణ హెబ్రీ జాతికి సంబంధించిందిగా ఉండడం వలన అది అతని ఉత్తరానికి ప్రామాణికతను కలిగించింది. హెబ్రీ జాతికి చెందినవాడుగా పేతురు అలవాటు ప్రకారం తన అసలు పేరునే ఉపయోగించాడు.
పేతురు తనను తాను ‘‘యేసు క్రీస్తు అపొస్తలుడుగా, దాసుడుగా’’ గుర్తించుకుంటున్నాడు. క్రీస్తు ఆధిపత్యానికి లోబడిన దాసునిగా ఆయనకు సమర్పించుకొన్న ఒక సేవకునిగా, నేరుగా దైవికమైన నియామకం పొంది ప్రభువైన యేసుకు ఒక అధికార ప్రతినిధిగా తనను తాను పరిగణించుకున్నాడు.
ఈ ఉత్తరంలో పేతురు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రస్తావనలు అనేకం కనిపిస్తాయి. తన మరణం సమీపించిందని (1:14) అతడు ప్రస్తావించాడు. యేసు రూపాంతరానికి తాను ప్రత్యక్షసాక్షినని వర్ణించుకున్నాడు (1:16-18), ఆ సంఘటనలో ఆకాశం నుండి వినవచ్చిన మాటలను కూడా పేర్కొన్నాడు (1:17), ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్న పాఠకులకు తాను ఇంతకు ముందు కూడా రాశానని సూచించాడు (వారిని ‘‘ప్రియ స్నేహితుల’’ని సంబోధించాడు, 3:1), పౌలును ‘‘మన ప్రియ సహోదరుడు’’ (3:15) అని పిలిచాడు. రచయిత పౌలుకు సన్నిహితుడని ఇది సూచిస్తుంది. ఈ విషయాలన్నీ ఈ పత్రిక రచయితగా పేతురును రూఢపిరుస్తున్నాయి.
ఏదేమైనా అనేకమంది సమకాలీన పండితులు ఈ పత్రికను పేతురు రాయలేదని తోసిపుచ్చారు. వారి వాదనలకు ఉదాహరణలు (1) వేరొక వ్యక్తి తన రచనకు ప్రామాణికతను అపాదించుకోవడం కోసం పేతురు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రస్తావనలను అ.పొస్తలుని పేరుతో ప్రస్తావించడం ఒక సాహితీ విధానం. (2) 1పేతురు పత్రికలోని గ్రీకు భాషాశైలి 2పేతురు పత్రికకు భిన్నంగా ఉంది, (3) పౌలు పత్రికల గురించిన ప్రస్తావన (3:15-16) పేతురు జీవితకాలం తరువాతి కాలానికి సంబంధించింది, (4) 2పేతురు పత్రిక యూదా పత్రికపై ఆధారపడి వ్రాయబడిరది. ఇదే నిజమైతే పేతురు యొక్క గ్రంథకర్తత్వం సమస్యాత్మకమే అని చెప్పాలి.
ఈ అభ్యంతరాలకు స్పందనగా మనం (1) అపొస్తలుల మారు పేరుతో వేరొకరు రచనలు చేయడాన్ని ఆదిమ సంఘం నకిలీ పత్రికతో సమానంగా భావించి దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. (2) పేతురు తన మొదటి పత్రిక రాసేటప్పుడు ఎవరి సహాయమైనా తీసుకుని (1పేతురు 5:12), 2పేతురు పత్రికను మాత్రం స్వయంగా రాసి ఉంటాడు. దానివలన అతని గ్రీకు భాషాశైలిలో వ్యత్యాసాలు కనిపించాయి, (3) పౌలు రాసిన పత్రికలన్నిటినీ గాక, పేతురు తన కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని రచనలను గూర్చి మాత్రమే ప్రస్తావించి ఉంటాడు, (4) యూదా పత్రిక నుండి కొన్ని విషయాలను పేతురు తీసుకొని ఉండవచ్చు, లేక ఈ ఇద్దరూ ఒకే మూలం నుండి తమ సమాచారాన్ని పొంది ఉండవచ్చు. ఈ రుజువులన్నీ 2పేతురు పత్రిక యొక్క ప్రామాణికతను రూఢపిరుస్తున్నాయి.
నేపథ్యం: 1పేతురు పత్రికకు భిన్నంగా 2పేతురు తన పాఠకులెవరో, అది ఎక్కడికి పంపబడిరదో వెల్లడిరచలేదు. అపొస్తలుడు తన పాఠకులకు తాను రాసిన రెండవ ఉత్తరం అని మాత్రం ప్రస్తావించాడు (3:1). ఈ ముందటి ఉత్తరం 1పేతురు పత్రిక అయితే 2పేతురు పత్రిక కూడా అదే పాఠకులను (‘‘పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారి’’కి; 1పేతురు 1:1) ఉద్దేశించి రాసి ఉంటాడు. ఒకవేళ ఆ ముందటి ఉత్తరం అని చెప్పింది ఇప్పుడు మనకు తెలియని వేరొక రచన గురించి అయితే 2పేతురు పత్రిక ఎవరికి, ఎక్కడికి రాసి ఉంటాడో చెప్పడం కష్టం అవుతుంది.
2పేతురు పత్రికను అతడు రోమ్ నుండి రాసి ఉంటాడు. పేతురు తన జీవిత చరమాంకాన్ని రోమ్లోనే గడిపినట్టు ఆదిమ సంఘ సంప్రదాయం తెలియజేస్తున్నది. తన మరణం సమీపించింది (1:14) అని పేర్కొనడం వలన ఈ ఉత్తరం సరిగ్గా అతని మరణానికి ముందు రాసి ఉండాలి. సంప్రదాయం ప్రకారం పేతురు క్రీ.శ.67 లో నీరో చక్రవర్తి పాలనలో (క్రీ.శ. 54-68) హతసాక్షి అయ్యాడని తెలుస్తున్నది.
యూదా పత్రికతో 2పేతురు పత్రిక సాహితీశైలికి సంబంధించిన పోలిక చర్చించదగినది. ఈ విషయంపై ఒకరు నిర్ణయించి చెప్పేది మరొక పత్రిక గ్రంథకర్తత్వం పైనా, రచనాకాలం పైనా తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. అంశం విషయంలో రెండు పత్రికల్లోను కొట్టొచ్చినట్టు సామ్యాలు కనిపిస్తాయి. దీనిని బట్టి చూస్తే 2పేతురు తన పత్రిక అంశములను యూదా పత్రిక నుండి సంగ్రహించి, ఆ పత్రిక క్రీ.శ.65-80 మధ్య రాసి ఉంటే 2పేతురు పత్రిక రచయిత అపొస్తలుడైన పేతురు అయ్యే అవకాశం లేదు. అదే 2పేతురులోని అంశములను యూదా సంగ్రహించి ఉంటే వీటి గ్రంథకర్తత్వానికీ, రచనా కాలానికీ ఏ సమస్యా ఉండదు. యూదా 2.పేతురు పత్రిక నుండి సంగ్రహించి ఉంటాడు, లేక ఈ రెండు పత్రికలకూ మూలాధారం ఒక్కటే అయి ఉంటుంది.
తాను కొద్దికాలంలో చనిపోతున్నాడనగా పేతురు తన రెండవ పత్రికను రాశాడు (1:13-14). దీనిలో ప్రస్తావించకపోయినా బహుశా అతడు చెరసాలలో ఉండి దీనిని రాసి ఉంటాడు. క్రీస్తు యొ.క్క రక్షణ కార్యాన్నీ, ఆయన రెండవ రాకడనూ తిరస్కరించే అబద్ధ బోధకుల వల్ల ప్ర.మాదాన్ని ఎదుర్కొంటున్న క్రైస్తవ స్నేహితులకు దీనిని రాశాడు. యేసు జీవితానికి ఒక ప్రత్య.క్ష సాక్షిగా (1:16-18) పేతురు తన పాఠకులను క్రీస్తు రాకడ యొక్క నిశ్చయతను గురించి రూఢపి.రచడానికి, వారు మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవలసిన కొన్ని సత్యాలను వారికి గుర్తు చేయడాని.కీ పేతురు ప్రయత్నించాడు (3:1-2).
గ్రంథ సందేశం, ఉద్దేశం
తమ నకిలీ సిద్ధాంతాలు, విచ్చలవిడి జీవితాలు గల అబద్ధ బోధకుల గురించి పేతురు విశ్వాసులను హెచ్చరించాడు. పాపభూయిష్ఠమైన జీవిత విధానంలో పడిపోయే శోధన పేతురును ఎంతగా కలవరపెట్టిందంటే అ.తని మొదటి ఉత్తరం రాసిన వెంటనే వారికి ఈ రెండవ ఉత్తరం కూడా రాశాడు. క్రీస్తు రాకడను .త్రోసిపుచ్చడం గురించీ, దానివలన కలిగే తీర్పును గురించీ కూడా పేతురు హెచ్చరించాడు. క్రైస్తవ విశ్వాసం గూర్చిన జ్ఞానం, దాని ఆచరణలో ఎదగడానికి ప్రతి విధమైన ప్రయత్నమూ చేయాల.ని అతడు తన పాఠకులను కోరుతున్నాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
పేతురు తన పత్రికను పాత నిబంధనతో అనేక రీతులుగా అనుసంధానిస్తూ యద్ధార్థమైన క్రైస్తవులుగా జీవించాలని తన పాఠకులను సవాలు చేశాడు. యేసు మొదటిసారి తన రెండవ రాకడ గురించి మాట్లాడినప్పుడు పేతురు ఆయనతో ఉన్నాడు (మత్తయి 24-25 అధ్యా.). తన పాఠకులకు రెండవ రాకడ గురించిన నమ్మకాన్ని కలిగిస్తూ దానిని గురించి నొక్కి చెప్పాడు.
పేతురు తన ఈ చిన్న ఉత్తరంలో దేవుని వాక్యానికి అతి విశిష్టమైన స్థానాన్ని ఇచ్చాడు. తన పత్రిక అధ్యా.1 లో జ్ఞానం గురించీ (వ.3,5-6,8,12,20-21) దాని దైవిక మూలాల గురించీ, అధ్యా.2 లో దాని చారిత్రాత్మికతను గురించీ (2:4-8) నొక్కి చెప్పడం ద్వారా, అధ్యా.3 లో పౌలు రాసిన పత్రికలు ‘‘ఇతర లేఖనాల’’తో సమానమని సూచించడం ద్వారా (3:15-16) అతడు ఈ పని చేశాడు. మన విశ్వాసాన్ని నడిపించడానికి, దానిని సంరక్షించడానికి లేఖనాల ప్రాముఖ్యతను అతడు నొక్కి చెప్పాడు.
గ్రంథ నిర్మాణం
2పేతురు గ్రంథం సాధారణంగా ఒక ఉత్తరంలో ఉండాల్సిన విధంగా అభివాదం, ప్రధానాంశం, వీడ్కోలు కలిగి ఉంది. అయితే దీనిలో కృతజ్ఞతలు చెప్పడం కనిపించదు. దీని శైలి ఏదో ఒక లాంఛనప్రాయమైన సిద్ధాంత గ్రంథంగా కాక దాని పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాసిన ఒక కాపరి ఉత్తరంలాగా ఉంటుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”