కొత్త నిబంధనలోని అతి చిన్న పుస్తకమైన 3 యోహాను పత్రిక ఒక ఉత్తరంలాగా ఉన్నప్పటికీ అది ఒక వ్యాపార లావాదేవీ సంభాషణలాగా కనిపిస్తుంది. దీనిలోని ‘‘పెద్ద’’ బహూశ తన అజమాయిషీ కింద పనిచేసే గాయు అనే ఒక కాపరిని ప్రోత్సహించడానికి రాశాడు. నాయకత్వం కోసం వెంపర్లాడే దెయొత్రెఫె అనే వ్యక్తి గురించిన హెచ్చరిక తప్పిస్తే ఈ ఉత్తరంలో ఎక్కువగా సానుకూల సలహాలే కనిపిస్తాయి. దేవుని సత్యం, ప్రేమ, మంచితనం అనేవి దీనిలోని ప్రాముఖ్యమైన అంశాలు.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: 1, 2 యోహాను పత్రికలు రాసిన వ్యక్తే దీనినీ రాశాడు (అక్కడి పరిచయాలు చూడండి)
నేపథ్యం: 2యోహాను పత్రికలో ఉన్నదే. (అక్కడి పరిచయం చూడండి). 2, 3 యోహాను పత్రికలను తరచుగా ‘‘కవల పత్రికలు’’ అని పిలుస్తారు. అయితే వాటికి కర్త ఒక్కడే అనే దృక్పథంలో చూడాలి తప్ప అవి రెండూ ఒకేలా ఉన్నాయనే దృష్టితో చూడకూడదు.
ఈ రెంటి మధ్య మనం గమనించదగిన కొన్ని సమాంతర అంశాలు కనిపిస్తాయి. రెండు పత్రికల్లోనూ రచయిత తనను తాను ‘‘పెద్ద’’ అని సంభోధించుకున్నాడు పాఠకులు తాను ‘‘సత్యమును బట్టి’’ ప్రేమించిన వ్యక్తులు (2యోహాను 1, 3యోహాను 1). యోహాను తన గొప్ప సంతోషానికి కారణం తన పాఠకులే అని భావించాడు. (2యోహాను 4, 3యోహాను 3). వారు ‘‘సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు’’ (2యోహాను 4, 3యోహాను 3). వారి గురించి ఆ పెద్ద మంచి సమాచారం విన్నాడు (2యోహాను 4, 3యోహాను 3,5). ఈ రెండు ఉత్తరాల్లోనూ ఒక హెచ్చరిక ఉంది (2యోహాను 8, 3 యోహాను 9-10), ఆ పెద్ద ఈ ఉత్తర గ్రహీతలను ముఖాముఖిగా చూడాలని కోరుకున్నాడు (2యోహాను 12, 3యోహాను 14). చివరిగా రెండు పత్రికల్లోనూ ఇతరులు పంపిన శుభాకాంక్షలను చూడవచ్చు (2యోహాను 13, 3యోహాను 14).
గ్రంథ సందేశం, ఉద్దేశం
3 యోహాను ఒక వ్యక్తిగతమైన పత్రిక. అది ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగింది (1) ఈ ఉత్తరం అందుకున్న గాయు, (2) సంఘంలో సమస్యలు సృష్టిస్తున్న దియొత్రెఫె అనే వ్యక్తి, (3) బహుశా ఈ ఉత్తరం మోసుకొచ్చిన దేమేత్రి అనే వ్యక్తి. దియొత్రెఫె అనే వ్యక్తి చూపే చెడ్డ మాదిరిని అనుసరించవద్దని గాయును హెచ్చరించడమే దీని ఉద్దేశం. దానికి బదులుగా గాయు ఆయా ఊర్లు తిరుగుతూ సువార్తను బోధించే బోధకులు, మిషనరీలకు సహకరిస్తున్న అతని మంచి పనిని కొనసాగించాలి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
అపొస్తలిక బోధతో నిండిన ఈ ఉత్తరం ప్రేమ, సత్యం, నమ్మకత్వం, సంఘం, సాక్ష్యం అనే కొన్ని క్రైస్తవ నమ్మకాలను నొక్కి చెబుతుంది. అపొస్తలిక విశ్వాసం దైవ కేంద్రికంగా ఉన్నదని కూడా ఇది సాక్ష్యమిస్తున్నది (వ.7,11). యేసు, ఆత్మ అనే పదాలు ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు (వ.12 లో కనిపించే ‘‘సత్యమువలనను’’ అనే మాట యేసును సూచిస్తున్నది, యోహాను 14:6, 1యోహాను 5:20). అయితే ఈ పత్రికలో ‘‘సత్యం’’ అయిన ‘‘దేవుడు’’ అనే ప్రస్తావనలోనే యేసు, పరిశుద్ధాత్మ అనేవారు ఇమిడి ఉన్నారనేది ఈ రచయిత ఉద్దేశం అనడంలో ఏమాత్రం సంశయం లేదు (3యోహాను 1,3,4,8,12).
గ్రంథ నిర్మాణం
ఈ ఉత్తరం కూడా అన్ని పత్రికల్లాగానే ఒక పరిచయం (వ.1-4), ఒక ఆకారం (వ.5-12), ఒక ముగింపు (వ.13,14) అనే విధానాన్నే పాటించింది. వ.1-4 లు శుభాకాంక్షల్లాగా స్పష్టంగా పనిచేసినప్పటికీ ఈ పుస్తకం దీనిలోని నలుగురు వ్యక్తుల చుట్టూ పరిభ్రమించింది అని కూడా చెప్పవచ్చు. వ.1-8 లలో గాయు గురించిన వివిధ రకాల ప్రశంసలు చూస్తాం. వ.9-10లు దెయొత్రెఫె కనపరిచే అహంకారపు, దుష్టమైన ధోరణిని ఖండిస్తున్నాయి. వ.11-12 లు భక్తిపరుడైన దేమేత్రిని ప్రశంసిస్తున్నాయి. వ.13-14 ల ముగింపు పెద్ద హృదయం ఎలాంటిదో తెలుపుతున్నాయి. 3యోహాను పత్రిక సారాంశం అంతా నలుగురు వ్యక్తులు, వారి పేరు ప్రతిష్టలలో (వారి ప్రవర్తనలో నుండి వెలువడిన) కనిపిస్తుంది. యోహాను మళ్ళీ మళ్ళీ పలికిన ‘‘ప్రేమించు ప్రియుడు’’ (వ.1,2,5,11), ‘‘సత్యమును బట్టి’’ లేక ‘‘సత్యమును’’ (వ.1,3,4,8,12) వంటి కొన్ని కీలకమైన పదాల కూర్పుతో ఈ ఉత్తరాన్ని నిర్మించాడు. మొదటి శతాబ్దంలో సంఘంలో చెలరేగిన వ్యక్తిత్వపు కలహాలు, వాటి పరిష్కారానికి పెద్ద అయిన యోహాను అనుసరించిన వ్యూహం గురించి ఈ ఉత్తరం మనకు మంచి అవగాహనను కల్పిస్తున్నది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”