ఎస్తేరు ఒక ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్లో దేవుని గురించిన ప్రస్తావన లేని ఒకే ఒక్క గ్రంథం ఎస్తేరు. అయితే ఈ గ్రంథంలో మొర్దెకై దైవికమైన సహాయం గురించి చెప్పిన మాటల్లో సూచనప్రాయంగా కనిపించే దేవుని ప్రత్యక్షత నుండి చూడవచ్చు (4:14). ఒక్కోసారి ఇది కేవలం ఒక లౌకికమైన రచనలాగా కనిపిస్తుంది కాబట్టి చారిత్రాత్మికంగా సమాజమందిరా(సునగోగు)ల్లో, క్రైస్తవ సంఘంలో దీని ప్రామాణికతను గురించి ప్రశ్నలు లేవనెత్తింది. ఎస్తేరు గ్రంథం కొన్ని ప్రత్యేకమైన చారిత్రాత్మిక సంభవాలతో గట్టిగా ముడిపడి ఉంది. అదే సమయంలో అది ఒక సాహితీ ఖండం, ఒక గొప్ప కథగా పిలవబడడానికి అవసరమైన అన్ని రకాల సాహితీ విలువలతో కూడిన వృత్తాంతం. ఈ గ్రంథం ఉద్దేశాలు, గమ్యం స్పష్టంగా దీనిలో చెప్పబడక పోయినప్పటికీ ఈ కథను మొత్తంగా చూసినప్పుడు వాటిని మనం గమనించవచ్చు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: పా.ని.లోని చాలా గ్రంథాలకు వలె ఈ గ్రంథ రచయిత గురించి కూడా మనకు తెలియదు. యూదా తాల్ముడ్లో మహా సమాజమందిరం (సునగోగు) సభ్యులు ఈ గ్రంథాన్ని రాశారని చెప్పబడిరది. అయితే ఒక పారశీక రాజును 190 సార్లు ప్రస్తావించి, దేవుని గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించని ఈ గ్రంథాన్ని సునగోగులోని మత మేథావుల సమూహం రాసిందంటే నమ్మశక్యం కాదు. యూదులు, క్రైస్తవులు అయిన ప్రాచీన రచయితలు అనేకమంది మొర్దెకై ఈ గ్రంథాన్ని రాసి ఉంటాడని సూచించారు.
నేపథ్యం: క్రీ.పూ. 486 నుండి 465 వరకు పారశీక (పర్షియా) రాజైన అహష్వేరోషు పరిపాలించిన కాలంలో జరిగిన సంఘటనల్లో జరిగిన ఈ నేపథ్యం. 20 శతాబ్దం మధ్యకాలం నాటి పండితులు దీని రచనా కాలాన్ని బాగా ముందుకి, అంటే క్రీ.పూ. రెండవ శతాబ్దం వరకు జరిపారు. అయితే ప్రస్తుతం ఎక్కువమంది పండితులు ఇది అంతకంటే చాలా ముందుగానే వ్రాయబడిరదని భావిస్తున్నారు. 1947 లో లభించిన మృతసముద్రపు చుట్టలు ఎస్తేరు గ్రంథంలోని హెబ్రీ భాష క్రీ.పూ. మొదటి శతాబ్దపు భాషకు చాలా భిన్నంగా ఉన్నదని రూఢపిరిచాయి. అదే విధంగా ఎస్తేరు గ్రంథంలోని మాటల్లో గ్రీకు పదాలు కనిపించవు. దీనివలన అది ఆ ప్రాంతానికి గ్రీకు భాషను రాజభాషగా ప్రకటించిన మహా అలెగ్జాండరు దండయాత్ర (సుమారు క్రీ.పూ. 333) కంటే ముందే రాయబడిరదని తెలుస్తున్నది. ఈ గ్రంథం క్రీ.పూ. 4 వ శతాబ్దంలో రాసి ఉంటారని చెప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక చారిత్రాత్మిక వృత్తాంతం అని చెప్పడానికి దీనిలో అనేక సూచనలు కనిపిస్తాయి. ఆ కారణం చేత దీని రచనలో కనిపించే అనేక చారిత్రాత్మిక వైరుధ్యాలు వ్యాఖ్యానకర్తలకు దీని చారిత్రాత్మికతను అంగీకరించడానికి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టాయి. ఈ కథలోని కొన్ని ప్రధాన పాత్రల (ఎస్తేరు, హామాను, మొర్దెకై) నిర్ధారణ విషయంలో బైబిలేతర ఆధారాలు ఏవీ లేకపోవడం విచారకరం. అయితే ఈ కింది కొన్ని అంశాలను పరిగణించాల్సి ఉంటుంది.
మొదటిగా అహష్వేరోషు పరిపాలన గురించి పారశీక దేశాని(పర్షియా)కి సంబంధించినంత వరకు ఉనికిలో ఉన్న దస్తావేజులు లభించలేదు. కాబట్టి అతని పరిపాలనలోని ఇతర చారిత్రాత్మిక వ్యక్తుల గురించి అంతగా సమాచారం లభించలేదు. దానికి తోడు, గ్రీకు చరిత్రకారులు, ముఖ్యంగా హెరోడోటస్ తమ చరిత్ర గ్రంథాలను ప్రత్యేకంగా అది గ్రీకులకు సంబంధించినంత వరకే రాశారు గాని పర్షియా రాజ్య సంస్థాన చరిత్రకారులుగా రాయలేదు. ఆ విధంగా వారి సమాచారం పాక్షికంగా ఉండి, అనేక ప్రధాన వ్యక్తులను అసలు ప్రస్తావించి ఉండకపోవచ్చు. రెండవది, లి4 కాదు. మూడవది, ఈ పాత్రల గురించి బైబిలేతర నిర్ధారణ లేకపోయినప్పటికీ పర్షియా చరిత్రలో వారు ప్రస్తావించిన సందర్భాల వర్ణన అత్యంత ఖచ్చితమైనదని విమర్శకులు సైతం అంగీకరించారు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఎస్తేరు గ్రంథంలోని ప్రధాన సందేశం యూదులందరికీ పూరీము పండుగ జరుపుకోడానికి ఒక పిలుపుగా ఉంది. ఈ గ్రంథం యొక్క ఉద్దేశాలను రెండు రకాలుగా చూడవచ్చు: పర్షియా చరిత్రలో ఈ గ్రంథం ఎవరికోసం రాయబడిరదో వారికి చెందిన ఉద్దేశాలు, ఆ పాఠకులను అధిగమించి ఈ గ్రంథం యొక్క మరింత విశాలమైన, వేదాంతపరమైన ఉద్దేశాలు.
నిరీక్షణ: పర్షియా సామ్రాజ్యమంతటా చెదరి ఉన్న యూదా ప్రజలకు ఎస్తేరు గ్రంథంలోని చరిత్ర ఒక ప్రోత్సాహాన్ని, నిరీక్షణను అందించింది. యూదా ప్రజలు ఒక అన్య రాజ్యంలో ఏ విధంగా తమ ఉనికిని నిలబెట్టుకున్నారో, ఏ విధంగా వర్థిల్లారో అనేదానికి ఒక మాదిరిగా ఈ గ్రంథం నిలిచింది. యూదా జాతి ప్రజలు ఉన్నతమైన బాధ్యతాయుతమైన పదవులను ఏవిధంగా సమర్ధవంతంగా నిర్వహిస్తూ అదే సమయంలో తమ జాతి గుర్తింపును, ఇశ్రాయేలు దేవునిపట్ల తమ నిబద్ధతనూ నిలబెట్టుకున్నారో అది తెలియజేసింది. యూదు నాయకులు ఏ విధంగా తమ అన్య రాజులకు, తమ పొరుగువారికి ఆశీర్వాదకరంగా నిలబడగలరో వెల్లడిపరచింది. తన ప్రజలను వారు తమ పితరుల దేశానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ, అది ఐగుప్తు అయినా, ఇశ్రాయేలు అయినా, లేక పర్షియా అయినా సరే వారిని విమోచించడానికి ఇశ్రాయేలు దేవుడు సమర్ధుడని ఈ గ్రంథం నిరూపించింది.
దైవికమైన సమకూర్పు: ఈ గ్రంథంలో దేవుని గురించిన ప్రస్తావన లేకపోవడం కేవలం కాకతాళీయం అనుకోడానికి వీలులేదు. పైకి కనిపించకపోయినా స్పష్టంగా తెలుస్తూ ఉన్న దేవుని విడుదల, విమోచనా కార్యం గురించి అది పాఠకుణ్ణి ఆలోచింపజేస్తుంది. అన్యదేశంలోని యూదులు తమ మధ్య దేవుని సన్నిధికి సంబంధించిన బాహాటమైన రుజువులు ఏమీ కనిపించకపోవడాన్ని బట్టి ఆయన అసలు తమ మధ్య లేడనే ఆలోచనతో శోధింపబడే అవకాశం ఉంది కాబట్టి ఇది సమంజసంగానే ఉంది. యూదుల పరవాసంలో అన్యరాజ్యంలో జరిగిన సంఘటనలు సైతం దేవుని సమకూర్పును ప్రతిబింబిస్తున్నాయని వివరించడం ద్వారా ఎస్తేరు గ్రంథం ఆ దురభిప్రాయానికి పరిష్కారం చూపింది.
అనూహ్యమైన దేవుని సాధనాలు: ఈ గ్రంథంలో దేవుని సమకూర్పు అనే మర్మంలో ఒక భాగం ఏమిటంటే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోడానికి ఆయన వాడుకున్న ప్రతికూల వ్యక్తులు. హదస్సా (ఎస్తేరు) అనే ఒక యూదు అనాధ బాలిక ప్రపంచ చరిత్రలోనే అతి గొప్ప సామ్రాజ్యానికి రాణి అవుతుందని ఎవరు ఊహించగలరు? అటువంటి నిస్సహాయురాలైన యౌవన స్త్రీ ద్వారా అంత శక్తివంతమైన విమోచనను దేవుడు కాక ఇంకెవరు ప్రసాదించగలరు?
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
దేవుని గురించిన ప్రస్తావన ఏ మాత్రం లేకుండానే ఎస్తేరు గ్రంథంలో దేవుని సమకూర్పు అంతర్లీనంగా కనబడుతుంది. వారి ఎదురుగా సమూల నాశనం కనిపిస్తున్న సమయంలో సహితం దేవుడు యూదులకు ఒక శాశ్వతమైన పరిపాలకుణ్ణి అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానం సజీవంగా నిలిచే ఉంది. పరవాసంలో సహితం అనేకమంది యూదులు తమ దేవునిపట్ల నమ్మకంగా నిలిచి ఉన్నారని ఎస్తేరు గ్రంథం కనపరిచింది. యూదులు ఎక్కడెక్కడ నివాసం ఏర్పరచుకున్నారో అక్కడ వారు నిర్మించుకున్న సునగోగుల ద్వారా దేవుని ప్రజలు తమ గుర్తింపును నిలబెట్టుకున్నారు. ఆ తరువాతి కాలంలో రోమా సామ్రాజ్యం అంతటా అపొస్తలులు సందర్శించిన ఆయా పట్టణాల్లో సువార్త ప్రకటనకు ఈ సునగోగులు అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించాయి (ఉదా. అపొ.కా.9:20; 17:1-2; 18:19; 19:8).
గ్రంథ నిర్మాణం
చెర అనంతర కాలం నాటి ప్రజలకు అలవాటైన, దినవృత్తాంతములు, ఎజ్రా-నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో కనిపించే హెబ్రీ భాషా శైలి దీనిలో కనిపిస్తుంది. ఎజ్రా-నెహెమ్యా గ్రంథాల వలె ఎస్తేరు గ్రంథంలోని వ్యాకరణం, పదజాలంపై అరామిక్ భాష ప్రభావంతో బాటు అనేక పారశీక(పర్షియన్) పదాలు కనిపిస్తాయి.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”