చాలా ప్రవచన గ్రంథాల్లో అనేక రాజ్యాలకు విరోధంగా ప్రవచనాలు ఉన్నాయి, కాని ఓబద్యా గ్రంథం ఒక్క ఎదోము దేశం మీద మాత్రమే దృష్టి సారించింది. ఓబద్యా క్లుప్త సందేశం సమీపిస్తున్న యెహోవా దినం గూర్చి, ఇశ్రాయేలీయులు ఎదోము దేశాన్ని స్వాధీనం చేసుకుంటారనే వాగ్దానం గురించీ కేంద్రీకృతం అయి ఉంది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ పుస్తకాన్ని ఓబద్యాయే రచించి ఉంటాడని భావించవచ్చు (వ.1), కాని అతని గురించి ఇంకేమీ తెలియదు. అతని పేరు హెబ్రీ భాషలో సాధారణమైన పేరు. ‘‘యెహోవా సేవకుడు’’ అనే అర్థం గలిగిన ఈ పేరు పాత నిబంధనలో కనీసం 12 మందికి ఉంది.
నేపథ్యం: ఓబద్యా రాసిన కాలం గూర్చి వాదోపవాదాలున్నాయి. యెరూషలేము ఆక్రమణ, అది దోచుకోబడడం ఎప్పుడు జరిగింది అనే దానిపై ఆధారపడి (వ.11-14), క్రీ.పూ. 10 నుండి 15 శతాబ్ధం మధ్యకాలంలో అనేక తేదీలు సూచించబడ్డాయి. వాటిలో రెండు ప్రముఖమైనవి, యూదా రాజైన యెహోరాము (క్రీ.పూ. 848-841) పాలనా కాలం లేక బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసిన కొద్దికాలం తరవాత (క్రీ.పూ. 587/586). ముందు చెప్పిన కాలం (క్రీ.పూ. 845), ఫిలిష్తీయులు, అరబ్బులు యూదాను కొల్లగొట్టినపుడు (2దిన 21:16-17), బహుశా వారితోపాటు ఎదోమీయులు తిరుగుబాటు చేసిన కాలం (2రాజులు 8:20). ఎదోమీయులు ఫిలిష్తీయులు, అరబ్బులతో కలసి అలా చేశారనే స్పష్టమైన సూచన వాక్యంలో లేకపోవడం వలన, ఇశ్రాయేలు, యూదాలు చెదరగొట్టబడిన కాలంకంటే తర్వాత (ఇశ్రాయేలు క్రీ.పూ. 722; యూదా క్రీ.పూ. 605-586) రెండవ కాలం (క్రీ.పూ. ఆరవ లేక ఐదవ శతాబ్దం మధ్యకాలం) ఓబద్యా 20 వచనంతో సరిపోలుతుంది (చెరలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులు, యెరూషలేము వాసులు తిరిగి సమకూర్చబడడం). ఇశ్రాయేలీయులు (క్రీ.పూ.722 నాటికి) యూదా ప్రజలు (క్రీ.పూ. 605-586) చెదరిపోయిన కాలం అనే సూచనకంటే ఇది మెరుగైన సూచన.
యెరూషలేము పతనంలో ఎదోమీయుల పాత్రను పేర్కొనడం కూడా ఈ చెర తర్వాతి ఆలోచనను సమర్థిస్తుంది (ఓబద్యా 10-14, మిగిలిన క్రీ.పూ. 6వ శతాబ్దపు ప్రవచన గ్రంధాలలో ఉన్నట్లుగా, యెరూషలేము పతనం గురించి అతిశయించడం (విలాప 4:21; యెహె 35:15లను, విలాప 2:15-17 తో పోల్చండి). ఇది యెహోవా న్యాయం తీర్చుతాడనే వాగ్దానఫలంగా ఉంటుంది (‘‘నీవు చేసినట్లుగానే నీకు చేస్తాను’’ వారి తలలమీదికి, ఓబద్యా 15).
సందేశం, ఉద్దేశం
ఎదోము అహంకారపు నిర్లిప్తతపై తీర్పు: భౌగోళికమైన భద్రత (వ.3-5), దౌత్యపరమైన ఒప్పందాలు (వ.7), ప్రసిద్ధిచెందిన తన జ్ఞానుల ఆలోచనలను (వ.8; యిర్మీయా 49:7) బట్టి గర్వించి, ఇశ్రాయేలు దేవునిలో విశ్వాసముంచలేదు కాబట్టి ఎదోముపై దేవుని తీర్పు ప్రకటించబడిరది. ఎదోము తన స్వంత మానవ అవగాహనపై ఆధారపడడం ద్వారా (ఓబద్యా 3,8), తన మిత్రదేశాల మానవసహాయం మీద నమ్మకముంచడం ద్వారా (వ.7) రెండు విధాలుగా మోసపోయింది. కాబట్టి దేవుడు వారిని ఎతైన శిఖరాలు, పర్వతాల గుహల నుండి దించివేస్తాడు. యూదా దేశం అనే తమ సహోదరుడైన యాకోబు పతనాన్ని బట్టి గర్వంగా అతిశయించి, గంతులేసినందుకు ఎదోమీయులను ఆయన సిగ్గుతో కప్పేస్తాడు (వ.10-14).
యెహోవా దినం: యెహోవా ఉగ్రతతో నిండిన అంధకారం, వేదన గురించి మాట్లాడుతూ (యెషయా 13:6; యోవేలు 1:15; 2:1-3, 10-11,31, ; జెఫన్యా 1:7-18, 2:2, మలాకీ 4:1-3,5) యెహోవా దినం సమీపంగా ఉన్నదని ఓబద్యా చెప్పాడు (యెషయా 13:6; యోవేలు 1:15; 2:1; జెఫన్యా 1:7-14). చారిత్రాత్మక దేశమైన ఎదోము, ఇశ్రాయేలు ఆగర్భశత్రువు అనడానికి సాదృశ్యమైన ‘‘ఎదోము’’ మీద ప్రతీకార న్యాయం తీర్చి (వారి తలల మీదికి తిరిగి వచ్చేలా చేయడం, ఓబద్యా 15), అదే సమయంలో ఇశ్రాయేలు దేశానికి రక్షణ (లేక పునరుద్ధరణ, యోవేలు 2:30-32; జెఫన్యా 2:1-10; 3:8-16) తెచ్చే రెండు స్వభావాలున్న యెహోవా దినం గురించి అతడు నొక్కి చెప్పాడు. పా.ని.లో క్రీ.శ. 70 కల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన జాతిగా చారిత్రాత్మకమైన ఎదోము నిలిచింది (ఓబద్యా 3,10,18 నోట్సు చూడండి). ఈ చారిత్రక ఎదోము, ఇశ్రాయేలీయుల అంత్యకాల శత్రువులకు సూచనగా మిగిలిపోయింది (వ.15-16; యెషయా 63:1-6; యెహె 35; 36:2,5 – సకల జాతులకూ వ్యతిరేకంగా యెహోవా దినం అనే సందర్భం).
ఇశ్రాయేలు తన భూమిని తిరిగి స్వాధీనపరచుకోవడం (వ.17-21): రెండవసారి జయించడం అనే భావనలో ‘‘వెళ్ళగొట్టడం ద్వారా స్వాధీనం చేసుకోవడం’’ అనే అర్థమిచ్చే హెబ్రీ పదం ఐదుసార్లు ఉపయోగించాడు: ఇందులో నాలుగుసార్లు వాగ్దానదేశ నివాసులైన (వ.19-20) ఇశ్రాయేలీయులు (ఉత్తర, దక్షిణ రాజ్యాలు కలిపి) పోగొట్టుకోవడం (వ.17), ఒక్కసారి అదే మూలపదాన్ని (వ.17) వారిని నెట్టివేసిన శత్రువులను (‘‘ఏశావు’’ తో సహా) సూచిస్తుంది. కనాను స్వాధీనాన్ని జ్ఞాపకం చేసే ఈ హెబ్రీ పదం, వాగ్దాన దేశాన్ని జయించడానికి ద్వితీయోపదేశకాండంలో (ద్వితీ 1:8,21,39; 4:5,14,26), యెహోషువలో (యెహో 24:8) లో కూడా దేవుడిచ్చిన సూచనగా తరచు ఉపయోగించారు. కాబట్టి యిర్మీయా 49:2లో ఉన్నట్లు (అంత్యదినాల్లో రెండవసారి అమ్మోను స్వాధీనం), రెండవ దండయాత్ర అనే భావన (ఓబద్యా 20లో ‘‘కనానీయులు’’ అనే పదం ఉపయోగించడాన్ని గమనించండి), ఇశ్రాయేలీయులు ‘‘ఎదోము’’, ఇతర శత్రువుల సరిహద్దులైన (వ.17-20) పర్వతదేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో కనిపిస్తుంది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
హింసిస్తున్న రోమా సామ్రాజ్య పతనాన్నిగూర్చి ప్రకటించిన ప్రకటన గ్రంథంలాగా, ఓబద్యా గ్రంథం కూడా, దేవుని నైతిక పాలన ఆయన న్యాయచిత్తం చివరికి విజయం పొందుతుందనే నిరీక్షణ మీద విశ్వాసం నిలిపింది. ఇది దేవుడు తన సింహాసనంపై ఉన్నాడని, తనవారి కోసం ఆయన శ్రద్ధవహిస్తాడని చెప్పే కాపరి సందేశాన్ని బాధింపబడుతున్న హృదయాలకు అందిస్తుంది.
నిర్మాణం
ఎదోముపై వెంటనే రానున్న యెహోవా తీర్పును తెలియజేస్తూ (వ.2-9), యుద్ధం గూర్చిన దేవోక్తిలా కనిపించే ఓబద్యా గ్రంథం యెహోవానుండి వచ్చిన ప్రవచనాత్మకమైన ‘‘దర్శనం’’ అని వాక్యం చెబుతోంది (వ.1). ‘‘అన్యదేశాలకు విరోధమైన దేవోక్తి’’ అనే ఉపభాగానికి చెందిన ప్రవచనం లాగా (యెషయా 13-23; యిర్మీయా 46-51; యెహె 25-32; ఆమోసు 1-2; జెఫన్యా 2:4-15) విదేశీ శక్తులమీద తీర్పు ప్రకటించడానికి ఒక నమూనాగా (ముఖ్యంగా ఎదోము మీద; విలాప 4:21-22 కూడా చూడండి) యూదాకు విడుదల ఇవ్వడం గురించి ప్రకటిస్తుంది (ఓబద్యా 17-20; యిర్మీయా 46:25-28; నహూము 1:1-15; జెఫన్యా 3:14-20). అయినప్పటికీ ఇది ప్రత్యేకంగా ఇశ్రాయేలుకు కూడా అని కాకుండా, నహూము, యోనా గ్రంథాల్లాగా కేవలం ఒక అన్యరాజ్యంపై తీర్పు ప్రకటించడం మీద దృష్టి పెడుతూ ఉంది.
పా.ని. లోని ఈ అతి చిన్న పుస్తకంలో అనేక భాగాలున్నాయి. మొదటిది తమ అహంకార పూరితమైన నిర్లిప్తతతో, తాము దైవజోక్యం నుండి మినహాయించబడ్డాం (వ.1-9) తమను తాము మోసం చేసుకుంటున్న (వ.3), ఎదోము మీదికి రాబోయే నిర్దిష్టమైన తీర్పును ప్రకటించిన ఒక యుద్ధ ప్రవచనం (వ.3). ఎదోము మీదికి రాబోయే తీర్పు కారణానికి మరింత వివరణ (వ.10-14). అంటే సహోదరుని పట్ల నిబద్ధత లేకపోవడం (వ.10-11), దేవుని ప్రజలైన యూదా వారిమీదికి వచ్చిన విపత్తును చూసి సంబరం చేసుకోవడం (వ.12-13), యూదా వినాశనంలో దాని శత్రువులకు సహకరించడం (వ.10-11,13-14). ఆ తరువాత అది యెహోవా దినం మీద దృష్టి సారించింది (వ.15-21). దానిలో చారిత్రాత్మక దేశమైన ఎదోము మీదికి రానున్న తీర్పు (వ.15-16), దానివెంట ఇశ్రాయేలు అంత్యకాలపు శత్రువుల ప్రతినిధిగా ‘‘ఎదోము’’ మీదికి వచ్చే చివరి తీర్పు (వ.16), తత్ఫలితంగా యూదా, ఇశ్రాయేలుకు కలిగే విడుదల (వ.17-21).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”