మార్కు సువార్త యేసు చేసిన క్రియలను లేక కార్యాలను నొక్కి చెబుతుంది. యేసు స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, అద్భుతాలు చేస్తూ, బోధిస్తూ ఒకచోటి నుండి మరొకచోటికి త్వరత్వరగా కదలిపోతున్నాడు. మార్కు సువార్తలో అన్నీ ‘‘వెంటనే’’ జరిగిపోతుంటాయి. ఒక సంఘటన పూర్తి అవుతూనే, వేరొకటి ఆరంభం అయిపోతుంది. యేసు యెరూషలేములో ప్రవేశించగానే ఈ వేగం నెమ్మదిస్తుంది (11:1). తరువాతి సంఘటనలు రోజువారీగా వివరించబడుతూ, ఆయన చివరి రోజు సంఘటనలు గంట గంటకూ వివరించ బడ్డాయి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: మార్కు సువార్త ఎవరు రాశారో మనకు చెప్పబడలేదు. ఆది సంఘ చరిత్రకారుడైన యుసిబియస్ క్రీ.శ. 326లో రాస్తూ, ఆదిసంఘ పితరుడైన పాపియాస్ మాటలను ప్రస్తావించాడు. పాపియాస్ మాటలలో ‘‘పెద్ద’’ (అంటే బహుశా యోహాను కావచ్చు) చెబుతూ, పేతురు ప్రసంగాలలో యేసు చేసిన కార్యాలు, చెప్పిన విషయాలను మార్కు గ్రంథస్థం చేశాడనీ, కాని అవి సరైన క్రమంలో లేవు అనీ చెప్పాడు. ఆ విధంగా, మొదటి శతాబ్దంలోనే ఈ సువార్తను రచించింది మార్కు అని భావించారు. ఈ సువార్తను రాసిన వ్యక్తి మరియ అనే విధవరాలి కుమారుడైన యోహాను అనబడిన మార్కు. ఈ మరియ ఇంటిలోనే యెరూషలేములోని సంఘం అప్పుడప్పుడూ సమావేశమయ్యేది (అపొ.కా.12:12-17). బహుశా ఈ ఇంటిలోనే యేసు తన శిష్యులతో కలసి చివరి భోజనం చేశాడు. మార్కు బర్నబాకు సమీపజ్ఞాతి (వరసకు సహోదరుడు లేక మేనల్లుడు కావచ్చు, కొలస్సీ 4:10). పౌలు బర్నబాలు యెరూషలేములో కరవు వచ్చినపుడు అంతియొకయ నుండి తెచ్చిన కానుకలు ఇచ్చి వెళుతుండగా, మార్కు కూడా వారితో వెళ్ళాడు (అపొ.కా.12:25). ఆ తరువాత పౌలు, బర్నబాల మొదటి సువార్త ప్రకటనా యాత్రలో వారికి సహకారిగా కొంతదూరం వరకు మార్కు వారితో ఉన్నాడు (అపొ.కా.13:5). కాని పెర్గము వద్ద మార్కు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు (అపొ.కా.13:13). చిన్నాసియాలోని సంఘాలకు అపొస్తలుడైన పేతురు పత్రికలు రాసినపుడు, అతడు మార్కును ‘‘నా కుమారుడు’’ అని సంబోధించాడు (1పేతురు 5:13). పౌలు తన మరణానికి ముందు తిమోతికి రాస్తూ, ‘‘మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు’’ అని రాశాడు (2తిమోతి 4:11). పౌలు హతసాక్షియైన తరువాత మార్కు ఐగుప్తుకు వెళ్ళిపోయాడనీ, అక్కడ సంఘాలను స్థాపించి, అలెగ్జాండ్రియాలో సేవచేశాడనీ యుసిబియస్ రచనలలో సూచించబడిరది.
నేపథ్యం: ఆది సంఘపితరులు చెప్పినదాన్ని బట్టి, పేతురు హతసాక్షి కావడానికి కొంచెం ముందు లేక అతని మరణానంతరం మార్కు రోమాలో తన సువార్తను రాశాడు. రోమాలోనే మార్కు సువార్త రాయబడిరది అని స్థిరపరచడానికి మార్కు 15:21లో ఒక సంగతి కనిపిస్తుంది. అక్కడ యేసు సిలువను కురేనీయుడైన సీమోనుచేత మోయించారని మార్కు రాశాడు. ఈ సీమోను అలెక్సంద్రుకు, రూఫుకు తండ్రి. అప్పటికే రోమాలో అలెక్సంద్రు, రూఫు అనేవారు రోమాలోని విశ్వాసులకు తెలిసినవారని చెప్పబడ్డారు. ముఖ్యంగా రోమాలోని అన్యజనులకోసం మార్కు సువార్తను రాశాడు కాబట్టి, అతడు యూదుల ఆచారాలను వివరించాడు, అరామిక్ భాషలోని మాటలను గ్రీకులోనికి అనువదించాడు, గ్రీకు మాటలకు బదులుగా వాటి సమానార్థకాలైన లాటిన్ పదాలను వాడి, పాత నిబంధనను చాలా అరుదుగా పేర్కొన్నాడు. మార్కు సువార్త అన్నిటికంటే మొదట రాసిన సువార్త అనీ, మత్తయి, లూకా సువార్తలకు ఇది ఒక ఆధారంగా పనిచేసిందనీ అత్యధికంగా బైబిల్ పండితులు అంగీకరించారు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
మార్కు సువార్త యేసును గూర్చిన వృత్తాంతం. తన మొదటి వచనంలోనే మార్కు ఈ అంశాన్ని పేర్కొన్నాడు: ‘‘దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము’’. తన సువార్తలో యేసు దేవుని కుమారుడు అనే విషయాన్ని ఎక్కువగా నొక్కి వక్కాణించాడు. 1:11లో యేసు బాప్తిస్మ సమయంలో దేవుడు దాన్ని ప్రకటించాడు. 3:11; 5:7లో దయ్యములు, అపవిత్రాత్మలు దానిని గుర్తించి, అంగీకరించాయి. 9:7లో రూపాంతర కొండవద్ద యేసు మరలా దాన్ని స్థిరపరచాడు. 12:1-12లో యేసు దానిగూర్చి ఉపమానరీతిగా బోధించాడు, 13:32లో దాన్ని సూచించాడు, 14:61-62 నేరుగా చెప్పాడు. చివరిగా 15:39లో ఏ యోగ్యత లేని రోమీయుడైన శతాధిపతి కూడా దాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆ విధంగా, ప్రజలు మారుమనస్సు పొంది, దేవుని కుమారుడు, మెస్సీయjైున యేసు క్రీస్తు సువార్తయందు విశ్వాసముంచాలని పిలుపునివ్వడమే మార్కు ఉద్దేశం (1:1,15).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
యేసు కాలంలో మెస్సీయను గూర్చిన అనేక ఆలోచనలు ఉండేవి. అనేకమంది వ్యక్తులు తామే మెస్సీయలమని కూడా చెప్పుకునేవారు. మెస్సీయ అనే ఆలోచనను విశదపరచి, ఆ పదాన్ని మరలా నిర్వచించడమే మార్కు చేసిన ముఖ్యమైన పని. 8:29లో కైసరయదైన ఫిలిప్పీవద్ద పేతురుకు ప్రత్యక్షపరచబడిన దాన్నిబట్టి అతడు ఒప్పుకున్నది ఒక మలుపుగా చెప్పవచ్చు. అక్కడినుండి మెస్సీయను గూర్చిన దైవతలంపులో ఆయన తృణీకరించబడడం, శ్రమపొందడం, మరణించి, పునరుత్థానుడు కావడం (8:31) అనేవి ఉన్నాయని యేసు చెప్పడం ఆరంభించాడు. యేసులోని మానవకోణాన్ని కూడా మార్కు మనకు చూపించాడు. నిజానికి మిగిలిన సువార్త రచయితలకంటే ఎక్కువగా యేసు మానవత్వాన్ని, ఆయన భావోద్వేగాలను మార్కు నొక్కి చెప్పాడు. అలా యేసులోని మానవత్వం, దైవత్వాన్ని గూర్చిన బలమైన చిత్రాలను మార్కు మనకు వెల్లడిపరిచాడు.
గ్రంథ నిర్మాణం
మార్కు సువార్త ఉపోద్ఘాతంతో ఆరంభమై (1:1-13), మూడు ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తుంది. అందులో మొదటిది (1:14-8:21) యేసు గలిలయలో చేసిన పరిచర్యను చెబుతుంది. అక్కడ యేసు స్వస్థత కార్యాలుచేసి, దయ్యములను వెళ్ళగొట్టి, అద్భుతాలను జరిగించాడు. రెండవ భాగం (8:22-10:52) మధ్యంతరమైనది. యేసు యెరూషలేముకు తన ప్రయాణాన్ని ఆరంభిస్తాడు. చివరి భాగం (11:1-16:8)లో యెరూషలేములోని వారంరోజులు ఉన్నాయి. యేసు పట్టణంలో ప్రవేశించింది మొదలు, ఆయనకు మతనాయకులతో పొసగకపోవడం వల్ల, వారు ఆయనను త్వరగా మరణానికి అప్పగించారు. ఒక క్లుప్త అనుబంధంలో (16:9-20), యేసు ప్రత్యక్షమైన కొన్ని సంఘటనలు, ఆయన తన శిష్యులకు గొప్ప ఆజ్ఞన్నివ్వడం, ఆరోహణం కావడం రాసి సువార్తకు జోడిరచారు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”