కొత్త నిబంధనలోని సుదీర్ఘమైన గ్రంథం లూకా సువార్త. యేసు క్రీస్తు జీవితం, ఆయన పరిచర్యల మీద దృష్టి పెట్టి లూకా రాసిన ఈ సువార్త, రెండు భాగాల చరిత్రలో ఒకటి. రెండవ భాగం అపొస్తలుల కార్యములు. ఇవి రెండూ ‘‘మహా ఘనతవహించిన థెయొఫిలా’’కు అంకితం చేయబడ్డాయి (లూకా 1:1; అపొ.కా.1:1).
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: మూడవ సువార్త రచయిత పేరు చెప్పబడలేదు. అయితే దాని రచయిత లూకా అని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలలో అధిక భాగాన్ని అపొస్తలుల కార్యములు గ్రంథంలో కనుగొనవచ్చు. ఇది తనకు తాను లూకా సువార్తకు అనుబంధంగా రాసినదిగా గుర్తించుకుంటుంది (అపొ.కా.1:1-3). అపొస్తలుల కార్యములు గ్రంథంలోని ‘‘మేము’’ (అపొ.కా.16:10-17; 20:5-15; 21:1-18; 27:1-37; 28:1-16) అని ఉన్న భాగాలు, ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించబడ్డాయి. అపొ.కా. గ్రంథంలో అధికశాతం ప్రథమపురుష, బహువచనంలో రాయబడిరది (‘‘వారు’’), కాని అపొస్తలుడైన పౌలు పరిచర్యలోని కొన్ని భాగాలు, హఠాత్తుగా ఉత్తమ పురుష బహువచనంలో రాశారు (‘‘మేము’’). అంటే అక్కడ నమోదు చేసిన సంఘటనలలో రచయిత కూడా అపొస్తలుడైన పౌలుతో కలిసి ఉన్నాడని ఇది సూచిస్తుంది. లూకా సువార్తలో ‘‘మేము’’ అనే భాగాలు లేకపోవడం వలన, తాను యేసు జీవితాన్ని కళ్ళారా చూచిన సాక్షులను ఉపయోగించుకున్నానని రచయిత చెప్పడంతో సరిపోలుతుంది (1:2). అంటే రచయిత తాను కళ్ళారా చూడలేదని చెబుతున్నాడని సూచిస్తుంది. పౌలుతో పనిచేసిన ప్రసిద్ధవ్యక్తుల్లో, ఈ సువార్త గ్రంథకర్త కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నవాడు వైద్యుడైన లూకా (కొలస్సీ 4:14; ఫిలే 24). అంతేకాక, ఇది జస్టిన్ మార్టిర్, మురటోరియన్ కేనన్, తెర్తుల్లియన్ వంటి ఆది క్రైస్తవ రచయితలందరూ ఏకీభవించి ఇచ్చే సాక్ష్యం. ‘‘సున్నతిపొందిన’’ సహపనివారలలో (అంటే యూదులైనవారు, కొలస్సీ 4:11) లూకా పేరు లేకపోవడం వలన, అతడు తప్పకుండా అన్యుడై ఉంటాడు. ఇది లూకా సువార్తలో అన్యులను గురించి అనుకూలంగా నొక్కి చెప్పడాన్ని వివరిస్తుంది (6:17; 7:1-10). లూకా సువార్తలో వైద్యపరమైన విషయాలు కూడా ఆసక్తికరంగా వివరించబడ్డాయి (ఉదా., 4:38; 14:2).
నేపథ్యం: లూకా తన సువార్తను మత్తయి, మార్కు సువార్తల తర్వాత రాశాడని సాధారణంగా నమ్ముతారు. మత్తయి, మార్కులు తమ సువార్తలను క్రీ.శ.60 లేక 70లలో రాశారని చెప్పడం వలన, లూకా సువార్త క్రీ.శ. 70 లేక 80లలో రాయబడిరదని చెప్పవలసి వస్తుంది. లూకా మూడవ సువార్తను, అలాగే అపొస్తలుల కార్యములు గ్రంథాన్ని (అపొ.కా. 1:1-3) రాశాడు కాబట్టి, ఈ రెండూ ఒకే కాలంలో రాశాడనడం సరిjైునదే. అపొస్తలుల కార్యములు గ్రంథం చివరిలోని సంఘటనలు సుమారు క్రీ.శ. 62-63 మధ్యలో జరిగాయి. ఆ సమయం కంటే ముందుగా అపొస్తలుల కార్యములు గ్రంథ రచన జరిగి ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ క్రీ.శ. 60ల ఆరంభంలో అపొస్తలుల కార్యముల గ్రంథం పౌలు రెండు సంవత్సరాల చెరకాలంలో (అపొ.కా. 28:30) రోమా నుండి రాసివుంటే, మూడవ సువార్త ఆ చెరకాలంకన్నా ముందే రాసివుండాలి. మరొక అవకాశం ఏమిటంటే, కైసరయలో పౌలు రెండు సంవత్సరాలు చెరసాలలో ఉన్న సమయం కావచ్చు (అపొ.కా.24:27). ఆ ప్రాంతంనుండి లూకా ప్రయాణం చేసి, యేసు జీవితం, పరిచర్యను కళ్ళారా చూసి సజీవులుగా ఉన్న సాక్షులైనవారితో నేరుగా మాట్లాడడానికి వెళ్ళివుంటాడు. మూడవ సువార్త ‘‘ఘనత వహించిన థెయొఫిలా’’ను సంబోధిస్తుంది (లూకా 1:1). ఇతనికే అపొస్తలుల కార్యములు గ్రంథంకూడా అంకితం చేయబడిరదనే విషయం తప్ప (అపొ.కా.1:1) ఇతని గురించి మనకు ఇంకేమీ తెలియదు. థెయొఫిలా అనే గ్రీకు పేరుకు ‘‘దేవుని ప్రేమించువాడు’’ లేక ‘‘దేవుని స్నేహితుడు’’ అని అర్థం. అందువల్ల అతడు అన్యుడు, బహుశా గ్రేకీయుడైయుంటాడని సూచిస్తుంది. అతడు కొత్తవిశ్వాసిjైు, ఈ మధ్యనే యేసును గురించి, క్రైస్తవ విశ్వాసాన్ని గురించి బోధనొంది వుంటాడు (లూకా 1:4). ‘‘ఘనత వహించిన’’ అనే మాట, అతడు ఉన్నత వర్గానికి చెందినవాడనీ, ఆర్థికంగా స్థితిమంతుడై ఉంటాడనీ సూచిస్తుంది. అతడు ఏదో ఒక ప్రభుత్వ అధికారం, పదవితో కూడిన ఉద్యోగస్తుడై వుండవచ్చని కూడా అది కనపరుస్తుంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
లూకా సువార్త జాగ్రత్తగా పరిశోధించి (1:3), యేసు క్రీస్తు జీవితం, ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి ఎంపికచేసిన సంఘటనల ద్వారా తెలియపరచేదిగా, క్రైస్తవుల విశ్వాసాన్ని ధృఢపరచడానికి తీర్చిదిద్దబడిరది (1:3-4). అదే సమయంలో అవిశ్వాసుల (ముఖ్యంగా గ్రీకు నేపథ్యం నుండి వచ్చినవారి) అపార్థాలను సవాలు చేసేదిగా ఉంది. ఇది యేసును చక్కని సమతుల్యంతో, ఆయన దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని నైపుణ్యంతో నొక్కిచెప్పేలా చిత్రీకరించబడిరది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
లూకా సువార్తలోని సుమారు 60 శాతం సమాచారం వేరెక్కడా కనిపించదు. ఆ విధంగా, మూడవ సువార్త బైబిల్లో లేకపోతే పాఠకులకు చాలా విషయాలు తెలిసివుండేవి కావు. గమనించదగిన నిర్దిష్టమైన పెద్ద భాగాలలో ఇవి కొన్ని: (1) లూకా 1-2 అధ్యాయాలలోని అధికభాగం, బాప్తిస్మమిచ్చే యోహాను, యేసు జననాలను గురించినవి, (2) యేసు బాల్యం, ఆయన పరిచర్య కంటే ముందున్న కాలంగూర్చి చెప్పే లేఖనాలు కేవలం లూకాలోనే ఉన్నాయి (2:40-52), (3) మత్తయి 1:1-17లోని వంశావళికి పూర్తిగా భిన్నమైన యేసు వంశావళి (3:23-38), (4) యేసు యెరూషలేముకు ప్రయాణం చేసిన ‘‘ప్రయాణాల’’ వివరాలు ఇందులోనే అధికం (లూకా 9:51-19:44), (5) మత్తయి 24-25; మార్కు 13లోని దేవాలయ నాశనాన్ని గూర్చి చెప్పిన ఒలీవల కొండ ప్రసంగంలోని చాలా భిన్నమైన విషయాలు (21:5-38), (6) పునరుత్థానం తర్వాత యేసు ప్రత్యక్షతలలోని సందర్భాలలో తాజా సమాచారంలో, ఎమ్మాయి దారి సంఘటన, గొప్ప ఆదేశాన్ని గూర్చిన భిన్నమైన వ్యాఖ్య, యేసు పరలోకానికి ఆరోహణుడయ్యే దృశ్యాల వర్ణన కేవలం లూకా లోనే కనిపిస్తాయి (లూకా 24:13-53).
గ్రంథ నిర్మాణం
యేసు జీవితంలో ‘‘నెరవేరిన కార్యములను’’ (1:2-4) ‘‘వరుసగా’’ రచించడం అనేది లూకా చూపిన వైవిధ్యం. అయితే, అనేక సందర్భాలలో అది ఖచ్చితమైన కాలక్రమంలో లేకపోవచ్చు (ఆయాచోట్ల నోట్సులో ఇది వివరించాం). సాధారణంగా, క్రీస్తు బహిరంగ పరిచర్యకు నడిపించిన కీలకమైన సంఘటనల తర్వాత (1:5-4:13), ఆయన ఆరంభ పరిచర్య గలిలయలోను, దాని చుట్టూ (4:14-9:50) ఉన్నట్లుగా పుస్తకం చూపుతుంది. ఆయన యెరూషలేము ప్రయాణానికి నడిపించిన పరిచర్యకు సంబంధించిన వివరణ పొడిగింపుతో కొనసాగించి (9:51-19:44), శ్రమవారంలోని పతాక సన్నివేశాలను, తరువాత యెరూషలేములోను, దాని చుట్టుపక్కల పునరుత్థానుడైన ప్రభువు ప్రత్యక్షతలను రాశాడు (19:45-24:53).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”