స్థానిక సంఘంలోని కొందరు వ్యక్తులు సహవాసాన్ని విడిచిపోయిన (2:19) నేపథ్యాన్ని పురస్కరించుకొని 1యోహాను పత్రిక రాయబడిరది. బహుశా సంఘ సిద్ధాంతం, నైతిక నియమాలు, భక్తి, మొదలైన విషయాల్లో వారి అభిప్రాయాలు విభేధించడం వల్ల ఈ విధంగా జరిగి ఉండవచ్చు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి యోహాను ఈ పత్రిక రాశాడని కొంతవరకు చెప్పవచ్చు. కొన్ని కీలకమైన వేదాంతపరమైన సత్యాలను, మరి ముఖ్యంగా క్రీస్తు సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించి, వాటిని మరింత సవిస్తరంగా వివరించాడు. ప్రేమ ప్రాశస్త్యాన్ని వివరించి, మన నమ్మకం, క్రియలు ఒకదానితో ఒకటి సరితూగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం క్రైస్తవ జీవితానికి పునాది అనీ, దీనిలోనుండే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ప్రారంభమవుతుందనీ చెప్పాడు. నిజమైన విశ్వాసం, ఆదర్శవంతమైన నీతి, దేవుని పట్లా, ప్రజలపట్లా లోతైన ప్రేమల గురించి రచయిత తన పాఠకులకు బోధిస్తూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండగా, పత్రికలోని అధిక భాగం ఈ మూడిరటిలో ఒకటి లేక ఎక్కువ అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.
Read More
గ్రంథ రచనా కాలం నాటి పరిస్థితులు
రచయిత: ప్రాచీన రాతప్రతులు అన్నీ 1యోహాను పత్రిక రచయితగా యోహాను పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. అతడు జెబెదయి కుమారుడు, నాలుగవ సువార్త రచయిత, ‘‘ప్రభువు ప్రేమించిన శిష్యుడు’’ అని పిలవబడిన యోహానుగా మనం అర్థం చేసుకోవాలి. 1,2,3 యోహాను పత్రికల శైలి, పదజాలం, యోహాను సువార్తకు చాలా దగ్గరగా ఉండడం వలన వాటన్నిటికీ రచయిత ఒక్కడే అని రూఢగాి తెలుస్తున్నది. కొంతమంది సమకాలీన పండితులు ‘‘పెద్ద jైున యోహాను’’ (2యోహాను 1, 3యోహాను 1 చూడండి) అని పిలవబడే మరొకరు ఈ ఉత్తరాలను రాసి ఉంటాడని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఈ పత్రికలు (బహుశా ప్రకటన గ్రంథం కూడా) ‘‘యోహానుకు సంబంధించిన వర్గం’’ నుండి ఉద్భవించి ఉండవచ్చని వాదించారు. అయితే వీటన్నిటిలో శిష్యుడైన యోహానే వీటి రచయిత అన్న అభిప్రాయం శ్రేష్ఠమైందిగా కనిపిస్తుంది.
నేపథ్యం: 2వ శతాబ్దపు ఆధారాలను బట్టి సుమారు క్రీ.శ.70వ సంవత్సరం, అంటే రోమీయులు యెరూషలేమును, దేవాలయాన్ని నాశనం చేసిన సంవత్సరంలో యోహాను తాను ఒక సంఘపెద్దగా ఉన్న యెరూషలేము నుండి ఎఫెసుకు తరలివెళ్ళాడు. ఆ ప్రాంతంలో అతడు తన కాపరి పరిచర్యను కొనసాగిస్తూ రమారమి క్రీ.శ. 100 వరకు జీవించాడు. కొ.ని. లో అతని పేరు మీద ఉన్న మూడు పత్రికలను అతడు ఎఫెసు ప్రాంతంనుండే రాసి ఉంటాడు. మొదటి శతాబ్దం చివరి పాతిక సంవత్సరాల్లో ఏ సమయంలోనైనా ఈ పత్రికలు రాయబడి ఉంటాయి.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యోహాను తన ఉద్దేశాలను వెల్లడిరచే నాలుగు ప్రకటనలు చేశాడు. మొదటిగా, తన పాఠకుల సహవాస సంతోషాలను ప్రోత్సహించడానికి. ‘‘మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము’’ (1:4).
రెండవది, తన పాఠకులు పాపంలోకి లాగే గుంటలను తప్పించుకోవాలనీ, వారు తొట్రిల్లిన సమయంలో క్షమాపణను కనుగొనాలనీ ఈ పత్రికను రాశాడు. ‘‘నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను’’ (2:1).
మూడవది, అబద్ధ బోధకులనుండి విశ్వాసులను కాపాడడానికి రాశాడు. ‘‘మిమ్మును మోసపరచువారిని బట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను’’ (2:26).
చివరిగా, వారు నిత్యజీవము కలిగి ఉన్నారని వారు తెలుసుకోవాలని రాశాడు. ‘‘దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను’’ (5:13). ఈ చివరి ఉద్దేశవాక్యము మిగిలిన మూడిరటినీ నడిపిస్తూ వాటిని ఒక సమైక్య అంశంగా చేస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే సంఘంలో అప్పటికే కొంతమందిని కబళించిన నాశనకరమైన విశ్వాసాలు, ప్రవర్తన నుండి తప్పించుకుని నిజమైన అపొస్తలిక క్రైస్తవ్యంలో స్థిరపడేలా క్రైస్తవులకు సహాయం చేయడానికి 1యోహాను పత్రిక వ్రాయబడిది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
(1) యేసు క్రీస్తునందు విశ్వాసం, (2) దేవుని ఆజ్ఞలకు విధేయతా పూర్వకమైన స్పందన, (3) దేవుని పట్లా, ఇతరుల పట్లా హృదయపూర్వకమైన ప్రేమ అనే రక్షణార్థకమైన దేవుని జ్ఞానానికి సంబంధించిన మూడు ముఖ్య అంతర్భాగాలను 1యోహాను పత్రిక విశదీకరించింది. తనను అనుసరించేవారు తమ సంఘ జీవితంలో, లేక దేవుడు వారిని ఎక్కడికి వెళ్ళి సేవచేయమని చెప్తాడో అక్కడ ఆచరణాత్మకంగా తనను ఘనపరచాలని ఏ విధంగా యేసు ఎదురుచూస్తాడో ఈ పత్రిక మనకు వెల్లడిస్తుంది.
గ్రంథ నిర్మాణం
1యోహాను పత్రిక తర్కపరంగా గానీ, విధానపరంగా గానీ, లేక నిర్దిష్టమైన రీతిలో గానీ దాని అంశాలను ప్రతిపాదించి వాటిని వృద్ధిపరిచే ప్రయత్నం చేయలేదని చాలామంది అంగీకరించారు. ఈ కారణంచేత దీనిని ఏ విధంగా శ్రేష్టమైన రీతిలో విభజించాలి అనే విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. యోహాను రాసిన మూడు పత్రికల్లో ఒక ఉత్తరానికి ఉండవలసిన లక్షణాలు దీనిలో అతి తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో దీనిని రాసినవారి గురించీ, ఎవరికి పంపబడిరదో వారి గురించీ వివరాలు ప్రస్తావించబడలేదు. ఇది ఒక క్రమానుగతమైన రచన కాదు. ఇది కొన్నిసార్లు ఒక అంశాన్ని తీసుకొని దాని గురించిన స్థిరమైన అభిప్రాయాలు వెల్లడిరచి, దానికి సంబంధించిన లేక దానిని వ్యతిరేకించే అంశాల వైపుకు సాగుతుంది, ఆ వెంటనే తిరిగి అంతకు ముందటి అంశాలకు మళ్ళుతుంది, లేక పూర్తిగా వేరైన ఒక కొత్త అంశాన్ని లేవనెత్తుతుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”