Old Testament

Deuteronomy

పంచకాండాల్లో ఒకటైన ఈ గ్రంథానికి ‘‘ద్వితీయోపదేశము’’ అనే పేరు సెప్టువజింట్‌ (పాత నిబంధనకు గ్రీకు భాషాంతరం) నుండి వచ్చింది. దీని అర్థం ‘‘రెండవసారి చెప్పబడిన ఆజ్ఞల ఉపదేశం’’ లేదా ‘‘ఆజ్ఞల పునరుక్తి’’. ఈ పదం వాస్తవానికి 17:18 లోని ‘‘ప్రతి’’ లేక నకలు అనే పదానికి తప్పు అనువాదం. అయినా నిర్గమకాండము లేవీయకాండము, సంఖ్యాకాండములలో ఉన్న ఆజ్ఞల ఉపదేశం మళ్లీ ఈ గ్రంథంలో పునరుక్తం కావడాన్ని బట్టి ఈ గ్రంథానికి ఈ పేరు సరిగానే ఉంది.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Numbers

సంఖ్యాకాండము (ఇంగ్లీష్‌లో “నంబర్స్‌”) అనే పేరును సెప్టువజింట్‌ లోని “అరిత్మొయ్‌” అనే పేరు నుండి తీసుకున్నారు. దీనికి ఆధారం 1-26 అధ్యాయాల్లో రెండుసార్లు జరిగిన సైన్యగణన. “అరణ్య మందలి” అనే అర్థాన్నిచ్చే బెమిద్బార్‌ అనే హెబ్రీ పేరు ఈ గ్రంథంలోని అధిక భాగపు భౌగోళిక నేపథ్యాన్ని వర్ణిస్తుంది: సీనాయి అరణ్య ప్రదేశంనుండి మోయాబు మైదానాల వరకు, యొర్దాను ఆవల నుండి యెరికో వరకు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Leviticus

“లేవీయులకు సంబంధించినది” అని అర్థమిచ్చే ఈ పుస్తకం పేరు సెప్టువజింట్‌ (పాత నిబంధనకు గ్రీకు అనువాదం) నుండి వచ్చింది. పంచకాండాలలో మూడవదైన ఈ పుస్తకం ప్రధానంగా యాజకుల విధులు, ప్రత్యక్షగుడారంలో సేవల గురించి తెలియజేస్తుంది. అయితే దీనిలో ఇతర కట్టడలు కూడా ఉన్నాయి. లేవీయకాండము మనకు ఆరాధనా నియమాలు, ఆచార సంబంధిత శుద్ధీకరణ కట్టడలు, నైతిక విధులు, పరిశుద్ధ దినాల గురించిన నియమాలు తెలియజేస్తుంది. 
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Exodus

దీని ఇంగ్లీషు శీర్షిక “నిర్గమము” అని అర్థమిచ్చే గ్రీకు మాట నుండి అనువదించబడిరది. అది దేవుని ప్రజలు ఐగుప్తును విడిచి వెళ్ళిన ప్రధాన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ పెట్టిన పేరు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని విమోచించి వారిని ఒక నిబంధనా జనాంగంగా, తనను సేవిస్తూ తనకు ప్రతినిధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్న ఒక రాజ్యంగా చేసిన వృత్తాంతాన్ని గ్రంథస్థం చేయడాన్ని బట్టి నిర్గమకాండాన్ని పాత నిబంధన అంతటికీ కేంద్ర బిందువైన గ్రంథంగా పరిగణించవచ్చు. ఇశ్రాయేలీయుల బానిసత్వం, అణచివేత, మోషే సిద్ధపాటు, అతని పిలుపు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు, ఫరో ప్రాతినిధ్యం వహిస్తున్న ఐగుప్తు దేవతలకు మధ్య జరిగిన పోరాటం, ఇశ్రాయేలీయుల నిర్గమనం, యెహోవాతో ఒక నిబంధనలో వారు ఒక రాజ్యంగా ఏర్పడడం, వారి తిరుగుబాటు, వారు ఆయన కోసం నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ద్వారా తమ మధ్య సంబంధం కొనసాగడానికి యెహోవా చేసిన ఏర్పాటు, వీటన్నిటి గురించీ నిర్గమకాండం వర్ణించింది. 
Read More

TSB Video