దానియేలు అనే పేరుకు ‘‘దేవుని న్యాయాధిపతి’’ లేదా ‘‘దేవుడు న్యాయం తీరుస్తాడు’’ అని అర్థం. దానియేలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బబులోను చెరలో నివసించిన ప్రవక్త. యూదులు చెరలో ఉన్న కాలంలో అక్కడ జరిగిన ముఖ్య సంఘటనల గురించి దానియేలు ప్రవక్త వివరించడంతోబాటు, దేవుడతనికి చూపించిన దర్శనాల్ని కూడా తెలియజేస్తున్నాడు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: దానియేలు గ్రంథాన్ని రచించింది చారిత్రక వ్యక్తిjైున దానియేలు కాదనీ, క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఎవరో ఒక యూదు రచయిత అనీ ఈ గ్రంథాన్ని విమర్శాత్మక కోణంనుండి దృష్టించే పరిశీలన సూచిస్తున్నది. ఈ గ్రంథంలో మాదిరిగా జరగబోయే సంఘటనలను ఖచ్చితంగా ముందుగానే తెలియజేయటం సాధ్యపడదని భావించే ప్రకృతి సంబంధమైన దృక్పథం మీద ఈ అభిప్రాయం ప్రధానంగా ఆధారపడి ఉంది. మరొక వైపు, పారంపర్య దృక్పథం దానియేలు స్వయంగా ఈ గ్రంథాన్ని బబులోను చెర ముగిసిన (క్రీ. పూ. ఆరవ శతాబ్దం) తర్వాత కొద్దికాలం లోపుననే రాసి ఉండవచ్చని ఉద్ఘాటిస్తుంది. రుజువులు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. దేవుడు తనకు కనపర్చిన దర్శనాల్ని రాస్తున్నానని దానియేలు గ్రంథంలోనే స్వయంగా తెలియజేశాడు (8:2; 9:2,20; 12:5). కొన్ని వాక్యభాగాల్లో దానియేలు తన పేరును తానే ప్రస్తావించుకోవడం, అతడే గ్రంథకర్త అనే అభిప్రాయాన్ని కొట్టివేయడం లేదు. ఏమైనా, గ్రంథకర్తలు తమను తాము ఈ రీతిగా సూచించుకోవడం సర్వసాధారణమే. ఉదాహరణకు మోషే కూడా పంచకాండములలో ఇలాగే చేశాడు.
అంతే కాక, దేవుడు సైతం తన నామాన్ని తానే ప్రస్తావించుకుంటూ మాట్లాడాడు (నిర్గమ 20:2,7). ప్రవక్తయైన యెహెజ్కేలు దానియేలు గురించి పలుసార్లు ప్రస్తావించాడు (యెహె 14:14,20; 28:3), ఇది గ్రంథకర్తగా ప్రవక్త ప్రాముఖ్యతకు తగిన గుర్తింపు. చివరిగా, యేసు క్రీస్తు కూడా ఈ గ్రంథాన్ని దానియేలు ప్రవక్తకే ఆపాదించాడు (మత్తయి 24:15; మార్కు 13:14).
గ్రంథ నేపథ్యం: దానియేలు గ్రంథానికి చారిత్రక నేపథ్యం బబులోను చెర. నెబుకద్నెజరు రాజు యూదాను తొలిసారి ముట్టడిరచి (క్రీ.పూ.605), యూదాలోని ప్రముఖులతోబాటు దానియేలును అతని స్నేహితుల్ని బబులోను చెరలోకి తీసుకొనిపోవడంతో గ్రంథం ప్రారంభమవుతుంది. నెబుకద్నెజరు క్రీ.పూ.597లో యూదా మీద మళ్లీ దాడిచేసి, పదివేల మందిని బబులోనుకు బందీలుగా తీసుకొని వెళ్లాడు. క్రీ.పూ.586లో అతను మరొకసారి యెరూషలేమును ముట్టడిరచాడు, ఈసారి అతను పట్టణాన్ని, పవిత్రదేవాలయాన్ని పడగొట్టి, యూదా ప్రజల్ని బబులోను చెరలోకి తీసుకొని వెళ్లాడు. తొలివిడతగా దానియేలుతో సహా యూదా ప్రజలు బందీలుగా బబులోనులో ప్రవేశించిన సంవత్సరం క్రీ.పూ.605లో అతని పరిచర్య ప్రారంభమై, బబులోను చెర కాలమంతా కొనసాగి (క్రీ.పూ.539లో చెర సమాప్తి), బబులోనును కూలద్రోసిన మాదీయ-పారసీక రాజైన కోరెషు రాజ్యపాలనలో మూడవ సంవత్సరంలో ముగిసింది (దాని 1:21; 10:1 చూడండి).
గ్రంథరచన ఎప్పుడు జరిగింది? విమర్శనాత్మక దృక్పథం ప్రకారం ఈ గ్రంథరచన క్రీ.పూ.165లో మక్కాబీయుల కాలంలో జరిగింది. ఇందుకు ప్రధానకారణం ప్రవచనాలు ఖండితంగా అదే కాలానికి సంబంధించి ఉండడం. అయితే, ఈ గ్రంథరచన క్రీ.పూ. ఆరవ శతాబ్దం చివర్లో బబులోను చెర ముగిసిన వెంటనే ఈ గ్రంథరచన జరిగి ఉండవచ్చని పారంపర్య దృక్పథం నిశ్చితంగా చెబుతున్నది. ఈ గ్రంథంలో దానియేలు జీవితంలోని వాస్తవ సంఘటనలు, నిబంధనల మధ్య కాలంలో జరగబోయే సంఘటనల గురించి మానవజ్ఞానానికి అతీతంగా దేవుడు తెలియజేసిన ప్రవచనాత్మక దర్శనాలు, ఇంకా రాబోయే కాలంలో నెరవేరవలసిన ప్రవచనాలు వున్నాయి. వ్రాతప్రతి ఆధారాలు క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోనే ఈ గ్రంథరచన జరిగిందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.
దానియేలు గ్రంథంలోని కొన్ని భాగాలను మృతసముద్రపు ప్రతుల్లో కనుగొనడం జరిగింది. రెండవ శతాబ్దానికి పూర్వమే వ్రాయబడిన ఇతర రచనల సంగ్రహమే ఈ ప్రతులు, వీటిలో కొన్నిటిని బైబిల్లో చేర్చడం జరిగింది. దానియేలు గ్రంథంలో అరామిక్ (సిరియా భాష)లో ఉన్న కొన్ని వాక్యభాగాలు వీటి రచనాకాలం క్రీ.పూ. ఆరవ శతాబ్దం నుండి అయిదవ శతాబ్దం మధ్య కాలం అయ్యుండవచ్చని భాషాధ్యయనపరంగా రుజువు చేస్తున్నాయి, ఎందుకంటే ఇవి ఎజ్రా గ్రంథంలోని అరామిక్ భాషతోను, ఎలిఫాంటైన్ పెపైరీ అనే ప్రాచీన వ్రాతప్రతి తోను, ఆ కాలంనాటి లౌకిక రచనలతోను సామ్యం కలిగి ఉన్నాయి. చారిత్రక రుజువులు సైతం ఈ రచనాకాలాన్నే సమర్థిస్తున్నాయి. ఉదాహరణకు, బెల్షస్సరు మరొక రాజుతోబాటు (నబొనిడస్) సహపరిపాలకుడుగా ఉన్నాడనే ప్రామాణికమైన వర్ణన దానియేలు గ్రంథంలో ఉంది. ఈ వాస్తవం గురించి ఆధునిక కాలం వరకు యే ఇతర చోట్ల తెలియలేదు. సారాంశమేమిటంటే, ఈ గ్రంథ రచనాకాలం తదుపరి కాలం నాటిదనే అభిప్రాయానికి కారణం దైవావేశప్రేరితమైన ప్రవచనాలను ప్రతిఘటించాలనే పూర్వభావన మాత్రమే గానీ వాస్తవిక రుజువు కాదు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
దానియేలు గ్రంథంలోని అంశం: అన్యజనుల కాలంలో దేవుని ప్రజల నిరీక్షణ. ‘‘అన్యజనముల కాలములు’’ అనే పదబంధాన్ని యేసు ఉపయోగించాడు (లూకా 21:24). ఇది బబులోను చెరకాలం మొదలు యేసు మళ్లీ వచ్చేవరకు మధ్య ఉన్న కాలం. ఈ కాలంలో దేవుని ప్రజలు దైవభక్తిలేని ప్రపంచాధిపత్యం క్రింద జీవిస్తారు.
దానియేలు గ్రంథం అన్ని కాలాల్లోను ‘‘మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలు’’ చుండు వాడనే నిరీక్షణను ప్రోత్సహిస్తుంది (5:21). అన్యజనుల కాలంలో ఇశ్రాయేలు సర్వోన్నతుడైన దేవునిపట్ల విశ్వసనీయత కలిగి ఉండాలని హెచ్చరించడమే దానియేలు గ్రంథ ఉద్దేశం. దైవభక్తితో కూడిన విశ్వాసం, దేవుని అంతిమ విజయాల గురించిన ప్రవచనాలకు సంబంధించిన ఉదాహరణల్ని వివరంగా చెప్పడం ద్వారా దానియేలు ఈ ఉద్దేశాన్ని పరిపూర్తి చేశాడు.
బైబిల్ గ్రంథంలో దీని పాత్ర
దానియేలు గ్రంథం భవిష్యసంఘటనల్ని ముందుగానే తెలియజేసే ప్రవచనాల్ని ఎదురుప్రశ్నకు తావు లేకుండా ధృవీకరిస్తుంది. అంత్యకాలాలకు సంబంధించిన ప్రవచనాల్ని, మరి ముఖ్యంగా కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకొనడానికి ఇది పునాదిగా ఉంది. అయితే, అన్నిటికంటె ముఖ్యమైన విషయం, భూమ్మీద దుష్టరాజ్యాల పరిపాలన కొనసాగుతున్న చెడురోజుల్లో సైతం భూమ్మీద ఉన్న సర్వ రాజ్యాలపైన యెహోవా ఆధిపత్యం ఉంటుందని దానియేలు గ్రంథం నొక్కి వక్కాణిస్తుంది. గ్రంథంలోని రెండు ముఖ్యమైన పదాలు ‘‘రాజు’’ (183 సార్లు), ‘‘రాజ్యము’’ (55 సార్లు) ఉపయోగించబడ్డాయి. అన్నిటిని మించి, దానియేలు గ్రంథం ఇశ్రాయేలు దేవుడు సార్వభౌముడైన విశ్వాధిపతి అనీ, ‘‘ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి’’ అని బోధిస్తుంది (4:34).
గ్రంథ నిర్మాణం
ప్రస్తుత కాలానికి, భవిష్యకాలానికి ప్రబోధాత్మకంగా ఉండడం కోసం చారిత్రక సంఘటనల్ని ఉద్ఘాటించడం ఉద్దేశంగా గల దానియేలు గ్రంథం వాస్తవ సంఘటనల కథన రచనాశైలిలో వ్రాయబడిరది. ఈ కథనంలో చరిత్ర, ప్రవచనం, భవిష్యత్తును గూర్చిన దర్శనాలు వున్నాయి. దేవుడు దర్శనాల ద్వారా, సంకేతాల ద్వారా అంత్యకాలంలోని అంతిమ విజయానికి సంబంధించిన ప్రత్యక్షతల్ని తెలియజేసేదే భవిష్యదర్శన సాహిత్యం. దానియేలు గ్రంథంలో భవిష్యత్తును గూర్చిన అంశాలున్నప్పటికీ, అది భవిష్య దర్శన గ్రంథం కాదు గానీ, భవిష్యత్తును గూర్చిన దర్శనాలు కలిగియున్న కథనం మాత్రమేనని చెప్పవచ్చు.
దానియేలు గ్రంథంలో చరిత్ర (1-6 అధ్యా.), ప్రవచనం (7-12 అధ్యా.) ఉండడం బట్టి కొందరు ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నారు. ఏదేమైనా, గ్రంథ నిర్మాణాన్ని అందులో ఉపయోగించిన రెండు భాషల్నిబట్టి చూడడం మేలైన విధానం: 1:1-2:3 (హెబ్రీ); 2:4-7:28 (అరామిక్ భాష); 8:1-12:13 (హెబ్రీ). హెబ్రీ భాషలో ఉన్న భాగాలు ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు సంబంధించినది. ఇశ్రాయేలు జాతీయభాష హెబ్రీ కాబట్టి ఇది యుక్తమైనదే. అప్పటి కాలంలో సిరియా భాష (అరామిక్) భిన్నరాజ్యాల మధ్య వ్యావహారిక భాషగా ఉండడం వలన దానియేలు గ్రంథంలో అన్యరాజ్యాలన్నిటిపై దేవుని సర్వాధిపత్యాన్ని తెలియజేసే కథనం సిరియా భాషలో (అరామిక్) ఉండడం యుక్తమైనదిగా కనబడుతుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”