సాధారణ పత్రికల్లో ఒకటైన యూదా పత్రిక అతి చిన్నది. కొద్దికాలం క్రితం వరకూ పండితులు కొత్త నిబంధనలోని ఇతర గ్రంథాలన్నిటికంటే దీనిని ఎక్కువగా నిర్లక్ష్యం చేశారు. విశ్వాసానికి ప్రమాదకరంగా మారిన తప్పుడు బోధలను బలంగా ఎదిరించి క్రైస్తవ సత్యాన్ని కాపాడడానికి యూదా ప్రయత్నించాడు. ఈ పత్రిక సందేశం ఏ కాలానికైనా వర్తిస్తుంది. ఎందుకంటే విశ్వాసులు తమ శక్తి అంతటితో సువార్తను కాపాడుకోవలసిన అవసరం ఉంది. పత్రిక సందేశానికి సంబంధించినంత వరకు దీనికీ 2పేతురు పత్రికకూ స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి. 2పేతురు పత్రిక కూడా సంఘంలోకి చొరబడుతున్న కపట బోధకుల విషయంలో కఠినంగా వ్యవహరించింది
Read More
గ్రంథ రచనా కాలం నాటి పరిస్థితులు
రచయిత: యూదా తనను తాను ‘‘యేసు క్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడును’’ (వ.1) అని పిలుచుకున్నాడు. ఇక్కడ పేర్కొన్న యాకోబు జెబెదయి కుమారుడు కాదు. అతడు చాలా ముందుగానే హతసాక్షిగా చనిపోయాడు (అపొ.కా.12:1-2) కాబట్టి అతన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు. యూదా పేర్కొన్న యాకోబు యెరూషలేము సంఘంలో ప్రసిద్ధిగాంచిన నాయకుడుగా అందరికీ సుపరిచితుడే (అపొ.కా.15:13-21Ñ గలతీ 2:9). ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ యాకోబు యేసు సహోదరుడు (మార్కు 6:3). యూదా యాకోబుకు సహోదరుడైతే యేసుకు కూడా సహోదరుడే. కాని యూదా తనను యేసు సహోదరుణ్ణి అని కాకుండా క్రీస్తు దాసుణ్ణి అని పిలుచుకోవడం ద్వారా తనను తాను తగ్గించుకున్నాడు.
నేపథ్యం: యూదా ఈ పత్రికను ‘‘తండ్రిjైున దేవునియందు ప్రేమింపబడి, యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి’’ (వ.1) రాశాడు. సాధారణంగా ఈ పిలుపును ప్రతిచోటా ఉన్న విశ్వాసులందరికీ వర్తింపజేయవచ్చు. అయితే యూదా మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన గుంపు ప్రజలున్నారు, ఎందుకంటే అతడు వారిని ‘‘ప్రియులారా’’ (వ.3,17,20) అని సంబోధిస్తూ వారిని ప్రభావితం చేసిన పరిస్థితిని గురించి మాట్లాడాడు. దీనిలో హెబ్రీ చరిత్ర గురించిన అనేక ప్రస్తావనలు ఉండడం చేత అతని పాఠకులు బహుశా యూదా క్రైస్తవులై ఉంటారు. దీనికి మించి ఈ పత్రిక ఎవరికి రాయబడిరదో మనకు సమాచారం లేదు. యూదా పత్రిక రాసిన తేదీని నిర్దిష్టంగా నిర్ణయించడం కష్టం. యేసు సహోదరుడైన యూదా ఈ పత్రికను రాసి ఉంటే అది అతని జీవితకాలంలోనే జరిగి ఉంటుంది. ఈ పత్రికకు ఏ తేదీని నిర్ణయించాలన్నా ఆనాటి కపట బోధలు బాగా ప్రబలిన తర్వాతే అయి ఉండాలి. క్రీ.శ. 65-80 మధ్యలో దీని రచన జరిగి ఉండొచ్చని చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఈ కాలాన్ని దాటిన తరవాత ఈ పత్రిక రాశాడనడానికి ఈ పత్రికలో ఏ విధమైన ఆధారాలూ లేవు. యూదా జీవితకాలంలోనే ఇది రాసి ఉంటే ఈ ఉత్తరంలో చెప్పిన కపట బోధ రెండవ శతాబ్దం నాటి జ్ఞోస్తికత్వం ూR అని చెప్పడానికి అవకాశం లేదు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
వాస్తవానికి యూదా తన స్నేహితులకు రక్షణ గురించి ఒక ఉత్తరం రాయాలని పూనుకున్నాడు. అయితే సంఘంలోకి చొరబడిన కపట బోధకుల గురించి తెలుసుకున్న తరవాత అతడు తన ఆలోచన మార్చుకొన్నాడు (వ.3-4). దానికి బదులుగా కపట బోధకుల ప్రభావాన్ని ఎదిరించడానికి విశ్వాసం నిమిత్తం పోరాడాలని తన పాఠకులకు పిలుపునిచ్చాడు (వ.3). వారందరూ ఒకే రక్షణలో పాలిభాగస్తులు అని వారికి గుర్తు చేస్తూ విశ్వాసం నిమిత్తమై పోరాటంలో మెలకువ కలిగి ఉండాల్సిన విషయంలో వారిని హెచ్చరించాడు. ఆ చొరబడినవారు సంఘంలో సమస్యలు సృష్టిస్తున్న కారణం చేత వారు తమ విశ్వాసం నిమిత్తం పోరాడవలసి ఉంది. వ.4 లో వారి శత్రువులెవరో తన పాఠకులకు పరిచయం చేస్తూ వారి దుర్గుణాలు తెలియజేసి వారిపై తీర్పును ప్రకటించాడు. వ.4 లో చెప్పినదానికి రుజువులు వ.5-16 లో కనిపిస్తాయి. గతంలో అమలు జరిగిన దేవుని తీర్పుల గురించిన మూడు ఉదాహరణలు వ.5-7లో వివరించబడ్డాయి. ఈ వ్యతిరేకుల జీవనశైలిని బట్టి వారిపైకి తీర్పు వచ్చిందని అతడు వ. 8-10లో చెప్పాడు.
వ.11 లో గతంలో తప్పిపోయిన కయీను, బిలాము, కోరహు అనే ముగ్గురు వ్యక్తులతో ఈ కపట బోధకుల్ని పోల్చాడు. వారి స్వభావమే వారిని ఈ అపకీర్తి పాలైన వ్యక్తుల వర్గంలో చేర్చడానికి కారణమైందని వ. 12-13 వివరిస్తున్నాయి. భక్తిహీనులపై తీర్పును (వ.14-15) ప్రకటించిన హనోకు ప్రవచనం గురించి పేర్కొంటూ యూదా ఈ భాగాన్ని ముగించాడు. యూదా తీర్పును ఎదుర్కోబోయే (వ.16) వారితో ఈ విరోధుల జీవితాలను సంబంధపరచాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
సాధారణంగా యూదా పత్రికను దాని సంక్షిప్తతను బట్టి అంతగా పట్టించుకోరు. అదే విధంగా మనం ఎదురుచూడని విధంగా దీనిలో కనిపించే హనోకు, మోషేల గురించిన అప్రమాణిక గ్రంథాల ప్రస్తావనల కారణంగా కూడా ఈ గ్రంథం నిర్లక్ష్యానికి గురైంది. కొంతమందైతే సూత్రబద్ధమైనది అని నిర్థారించబడిన అధికారిక లేఖనాల్లో చేర్చబడిన ఈ గ్రంథం ఏ విధంగా దైవావేశపూరితం కాని, బైబిలేతర రచనలను పేర్కొనగలదు అని ప్రశ్నించారు. అంతేకాక యూదా నొక్కి వక్కాణించినట్టు సంఘాన్ని చెరపడానికి సంఘంలో చొరబడిన దుర్మార్గులను దేవుడు శిక్షిస్త్తాడు అనే విషయం నేటి సమాజంలోని అనేకులకు ఒక పరాయి విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రజలకు ఇక్కడ చెప్పిన తీర్పు లేక శిక్షలతో కూడిన సందేశం అసహనంతో కూడిరదిగా, ప్రేమలేనిదిగా, కొత్త నిబంధనలో ప్రకటించబడిన ప్రేమ సందేశానికి విరుద్ధంగా కనిపిస్తుంది.
ఏదేమైనా, దేవుని నిలకడైన కృప గురించి బైబిల్లోని అత్యంత రమ్యమైన ప్రకటనల్లో కొన్ని యూదా పత్రికలో కనిపిస్తాయి (వ.1,24-25). మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం నుండి తప్పిపోయిన కపట బోధకులతో పోల్చి చూసినప్పుడు అవి మరింత ప్రకాశమానంగా కనిపిస్తాయి.
తీర్పు గురించిన సందేశం నేటి ప్రజలకు బాగా వర్తిస్తుంది. వక్రబోధకు, విచ్చలవిడి లైంగిక జీవితాలకు తీవ్రమైన పరిణామా లుంటాయని యూదా పత్రిక హెచ్చరిస్తున్నది. క్రైస్తవ సంఘ జీవనంలో అత్యంత క్లిష్టమైన సమయంలో విశ్వాసులు దేవుని ప్రేమనుండి దూరం కాకుండా తమకు అప్పగించబడిన విశ్వాసం (వ.3) నిమిత్తం పోరాడాలని హెచ్చరించడానికే యూదా పత్రిక రాయబడిరది.
2పేతురు పత్రికతో యూదా పత్రికకు ఉన్న సంబంధం చర్చనీయాంశమైంది. దీని విషయంలో మనం తీసుకునే నిర్ణయం ఆ రెండు లేఖల గ్రంథకర్తృత్వం గురించీ, రాసినకాలం గురించీ ఉన్న నమ్మకాలను తప్పక ప్రభావితం చేస్తుంది. రెండిరటిలో కనిపించే విషయంలో ప్రస్ఫుటమైన ఏకత్వం కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే, 2పేతురు యూదా పత్రికను వాడుకొని ఉండి, యూదా పత్రిక క్రీ.శ.65 క్రీ.శ.80 మధ్య రాసి ఉంటే 2పేతురు పత్రికను రాసింది అపొస్తలుడైన పేతురు కావడానికి ఆస్కారమే ఉండదు. అయితే 2పేతురు పత్రికనే యూదా వాడుకొని ఉంటే అలాంటి సమస్య తలెత్తదు. అది 2పేతురు పత్రిక పేతురు జీవితకాలంలోనే రాయబడిరదని రూఢపిరుస్తుంది. యూదా 2పేతురు పత్రికను ఆధారం చేసికొని తన పత్రికను రాశాడనీ లేక ఇద్దరూ ఒకే మూలాన్ని ఆధారం చేసికొని తమ పత్రికలను రాశారనీ భావించడం దీనికి సరైన పరిష్కారం.
గ్రంథ నిర్మాణం
యూదా పత్రిక ఒక ప్రభావవంతమైన, సూటిjైున రచన. యూదా శ్రేష్ఠమైన గ్రీకుభాష వాడడమే కాక దానిలోని అలంకారాలను సమర్ధవంతంగా ఉపయోగించాడనీ పండితులు తరచుగా పేర్కొన్నారు. ఒక శ్రద్ధాపూర్వకమైన, క్రమశిక్షణతో కూడిన నిర్మాణం ఈ లేఖలో ఉండి, ఆనాటి సంఘ మనుగడలోని కొవ్ని ప్రత్యేకమైన పరిస్థితులను అది వెల్లడిపరచింది. రచయిత పా.ని., యూదా సంప్రదాయాలను లోతుగా ఎరిగినవాడుగా తెలుస్తున్నది. పా.ని. రూపాలను, రాతలను నాటి సంఘాన్ని ఆక్రమించుకున్న అబద్ధ బోధకులకు చక్కగా వర్తింపజేశాడు (వ.8,12,16).
మిథ్యారచనలు లేక కాల్పనిక రచనలు సూత్రబద్ధమైన గ్రంథాలు కావు, వాటిని రాశారని చెప్పబడిన రచయితలు నిజమైన వారు కారు. అలాంటి మిథ్యారచనల్లో ఒకటైన ‘1వ హనోకు’ గ్రంథాన్ని (1:9) యూదా వ.14-15 లోను, అలాగే ‘మోషే అభిమతం’ (Assumption of Moses) అనే మరొక మిథ్యారచనలోని ఒక సంఘటనను కూడా అతడు వ.9 లో ప్రస్తావించాడు. అలాగని ఈ అశాస్త్రీయమైన లేక సూత్రబద్ధం కాని గ్రంథాలను యూదా అధికారిక లేఖనాలుగా పరిగణించాడు అని కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణలో అతడు కేవలం వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”