ఇది వేదనను వర్ణించే గ్రంథం అయినా దేవుని యందలి నిరీక్షణతో నిండి ఉంది. దీని గ్రంథకర్త చరిత్రలో వేరే రచయిత ఎవరూ వర్ణించలేని విధంగా తీవ్రమైన మానవుని వేదనను విస్పష్టమైన రీతిలో వర్ణించాడు. ఈ కారణం చేత మనం అనుభవించే వేదనాభరితమైన సమయాల్లో ఎదురయ్యే కఠినమైన ప్రశ్నలను వ్యక్తపరిచే వాక్యపరమైన మూలగ్రంథంగా విలాపవాక్యములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిలో చర్చించిన బాధాకరమైన సంఘటన యూదుల చరిత్రలో అత్యంత అంధకార సమయాల్లో ఒకటి. అదే క్రీ.పూ. 586 లో జరిగిన యెరూషలేము విధ్వంసం. హెబ్రీ సాహిత్యంలో తరచుగా ఒక గ్రంథం ప్రారంభంలో ఉన్న మొదటి పదం ఆ గ్రంథానికి శీర్షికగా పరిగణించబడుతుంది. ఈ గ్రంథం విషయంలో 1:1, 2:1, 4:1 లు ప్రత్యేకమైన హెబ్రీ ఆశ్చర్యార్థక శ్రమ వచనాలతో (హెబ్రీ. ఎఖా, ‘‘ఆహ్’’, ‘‘అయ్యో’’ ‘‘ఎట్లు’’) ప్రారంభమయ్యాయి. ఆ విధంగా చూస్తే ఈ గ్రంథానికి ‘‘అయ్యో’’ అనే పేరు పెట్టాలి. అయితే ఆ తరువాత రబ్బీలు ఈ గ్రంథాన్ని దాని అంశాలను అనుసరించి పిలవసాగారు – కినోత్. అంటే ‘‘విలాపాలు.’’ ఈ విధంగా ఈ గ్రంథానికి టాల్ముడ్ లోను ఆ తరవాత దీని గ్రీకు అనువాదం (సెప్టువజింట్) లోను ఇదే పేరు ఖాయం అయ్యింది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: అనాదినుండీ యిర్మీయా పేరు ఈ గ్రంథంతో అనుసంధానమై ఉంది. బైబిలు గ్రీకు అనువాదమైన సెప్టువజింట్, అలెగ్జాండ్రియా ప్రతులలో ఈ గ్రంథానికి ప్రారంభంలో 1:1 కి ముందు ‘‘ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళి యెరూషలేము నిర్మానుష్యమై పోయిన తరువాత యిర్మీయా ఏడుస్తూ కూర్చుని యెరూషలేము గురించి ఈ కింది విలాపాలు పలికాడు’’ అని రాసి ఉంది. లాటిన్ వల్గేట్లో అయితే ఈ మాటలకు ‘‘వేదనకరమైన హృదయంతో, గొప్ప మూల్గులతో, నిట్టూర్పులతో అతడు ఇలా అన్నాడు’’ అని కలిపారు. టాల్ముడ్లో అయితే, ‘‘యిర్మీయా తన స్వంత గ్రంథాన్ని, రాజులు గ్రంథాన్ని, విలాపవాక్యాల గ్రంథాన్ని రాశాడు’’ అని ఉంది. విలాపవాక్యములు గ్రంథాన్ని యిర్మీయా గ్రంథంతో జత చేసే ఈ గొప్ప సంప్రదాయం ప్రకారం యిర్మీయాయే ఈ గ్రంథ రచయిత అని తీర్మానించడం సబబుగా ఉంటుంది.
నేపథ్యం: క్రీ.పూ.587 లో బబులోను సైన్యం యెరూషలేమును ధ్వంసం చేసి దేవాలయాన్ని తగలబెట్టిన సంఘటన ఈ గ్రంథంలోని ఐదు విలాప గీతాలకు విషాద నేపథ్యంగా ఉంది. ఈ గ్రంథంలో కేవలం ఒకే ఒక నామధేయం (ఎదోము, 4:21-22) ప్రస్తావించబడినా దీనిలోని సూచనలు, 2రాజులు 25 అధ్యా.లో; 2దిన 36:11-20లో; ఇంకా యిర్మీయా గ్రంథంలో బహు నాటకీయంగా వర్ణించబడిన వివిధ సంఘటనలతో చారిత్రిక సంబంధాలు కచ్చితంగా గ్రంథస్థం చేయబడ్డాయి. విలాపవాక్యాలు గ్రంథంలో పేర్కొనబడిన కొన్ని కీలకమైన సంఘటనల జాబితా దీనిని రూఢపిరుస్తున్నది.
విలాపవాక్యములు గ్రంథంలోని సంఘటనలు
1. యెరూషలేము ముట్టడి 2:20-22; 3:5,7
2. నగరంలో కరువు 1:11,19; 2:11-12,19-20; 4:4-5, 9-10; 5:9-10
3. యూదా సైన్యం నిలువలేక పారిపోవడం 1:3,6; 2:2; 4:19-20
4. దేవాలయం అగ్నికి ఆహుతి కావడం మొ॥ 2:3-5; 4:11; 5:17-18
5. నగర ప్రాకారాల కూల్చివేత 2:7-9
6. ప్రజలు చెరలోకి తరలి వెళ్ళడం 1:1,4-5,18; 2:9,14; 3:2,19; 4:22; 5:2
7. దేవాలయాన్ని దోచుకోవడం 1:10; 2:6-7
8. నాయకులను వధించడం 1:15; 2:2,20
9. యూదుల దాసత్వం 1:1; 5:8-9
10. ఇతర దేశాల సహాయం వ్యర్థమైపోయింది 4:17; 5:6
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ గ్రంథంలో కనిపించే బాధలకు, శ్రమలకు సంపూర్ణమైన లేక అంగీకరించదగిన వివరణను విలాపవాక్యములు గ్రంథం మనకు అందించడం లేదు. కాని ఈ శ్రమలు, బాధలు క్రీ.పూ.586 లో జరిగిన వాస్తవిక సంఘటనలతో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అణచిపెట్టబడిన ఈ వేదన భావనలు చరిత్రలో ఫలానా సమయంలో జరిగిన సంఘటనతో సంబంధం కలిగి ఉన్నాయని ఒక నిరూపణ మనం చూపించకపోతే దీని వలన కలిగే వేదన విశ్వవ్యాప్తంగా ఆవరించే ప్రమాదం ఉంది. అందుకే చరిత్రను తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం. దుఃఖాన్ని చరిత్రనుండి వేరు చేసినప్పుడు ఒక దృక్పథం అనేది లేని స్థితిలో శ్రమ చేయిదాటి పోయి ఆ శ్రమనొందే వ్యక్తి వాస్తవానికి దూరమైపోయేలా చేస్తుంది.
దుఃఖించాల్సిన విషయాలు కావలసినన్ని ఉన్నాయి. ప్రజల సామూహిక విలాపం దేవునితో వారి నిబంధనా చరిత్రకు సంబంధించి ఉంది. ఇది వారి దుఃఖానికి లంగరు వేసింది కానీ, అదే సమయంలో వారు మరీ నిస్పృహలో కూరుకుపోయి పూర్తిగా నిరీక్షణ కోల్పోకుండా వారి దుఃఖానికి నిశ్చితమైన అడ్డుకట్టలు కూడా వేసింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
మతం, మానవతా సంప్రదాయాలు శ్రమలపట్ల స్పందన విషయంలో విభేదించినంతగా ఏ విషయంలోనూ విభేదించవు. శ్రమను ఒక మానవతావాది అంతిమంగా ఒక అర్థం, ఉద్దేశం లేని అచ్చమైన, నిరాపేక్ష సమస్యగా దృష్టిస్తాడు. విశ్వాసులకైతే శ్రమ అనేది వ్యక్తిగతమైన సమస్య. ఎందుకంటే వారు ఈ చరిత్రలో జరిగే ప్రతి సంఘటనా ఒక వ్యక్తిగతమైన దేవుని చేతికార్యం ద్వారా జరుగుతాయి అని నమ్ముతారు. ఒకవేళ అదే నిజమైతే దేవుని ప్రేమను, న్యాయనిరతిని మన బాధతో ఏ విధంగా సమర్ధించుకోగలం?
ఈ ప్రశ్నకు విలాపవాక్యములు గ్రంథం అంత తేలికైన జవాబునివ్వడం లేదు గాని అది మన బాధల మధ్యలో మనం దేవుణ్ణి కలుసుకోడానికి సహాయం చేసి, ప్రార్థనా భాషను మనకు నేర్పిస్తుంది. బాధను, దుఃఖాన్నీ ఎదుర్కోడానికి ఏవో కొన్ని కిటుకులు, తేలికైన జవాబులు, లేక మనల్ని ఉత్తేజపరచే నినాదాలకు బదులుగా విలాపవాక్యములు మనకు (1) ఒక నిర్దేశాన్ని (2) దుఃఖం గుండా ఆద్యంతమూ పయనించడానికి ఉపకరించే ఒక స్వరాన్నీ (3) ఏ విధంగా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనే విషయంలో సూచనలనూ (4) దేవుని నమ్మకత్వం గురించిన ఏకదృష్టినీ ఆయన ఒక్కడే మన స్వాస్థ్య భాగమనే నిర్ధారణనూ అందిస్తుంది.
గ్రంథ నిర్మాణం
విలాపవాక్యములు గ్రంథం ఒక గొప్ప కళాత్మకమైన నిర్మాణం కలిగి ఉంది. దానిలోని ఐదు అధ్యాయాలు (ఐదు గీతాలు) ఒక్కొక్కటీ నిర్మాణాత్మకమైన ఏకీకృత వివరణ. దీనిలోని పద్యాలు బేసి సంఖ్యలో ఉన్న వాస్తవం దృష్టిలో చూస్తే వాటి మధ్యభాగంలోని గీతం (3వ అధ్యాయం) ఈ గ్రంథానికి మధ్యస్థమైన అంశంగా చేస్తుంది. ఆ విధంగా ఈ గ్రంథం మొత్తానికీ ఒక పతాక స్థాయికి చేరేదాకా అది ఆరోహణ పద్ధతిలో కొనసాగుతూ మూడవ అధ్యాయాన్ని దాని రూపంలోనూ, అది అందించే సందేశంలోనూ ఒక కేంద్రబిందువుగా చేసింది. తదనుగుణంగా మొదటి రెండు అధ్యాయాలు 3:22-24 లోని పతాక సన్నివేశానికి నడిపించే మెట్లుగా ఉన్నాయి. అక్కడినుండి 4, 5 అధ్యాయాల్లో అవరోహణ క్రమం కనిపిస్తుంది.
ఈ గ్రంథంలోని గేయాలు లేక గీతాల పంక్తులు ఒక తరహా చిత్రబంధన క్రమంలో (ముందు వెనుకలుగా మార్చి, ఉదా. ఎ-బి, బి-ఎ) కూర్చబడి ఉన్నాయి. ఆ విధంగా చూస్తే 1, 5 అధ్యాయాలు దీనిలో వర్ణించిన విపత్తు గురించిన సమగ్ర సారాంశం కాగా, 2, 4 అధ్యాయాలు అక్కడ జరిగిన దాని వివరణాత్మకమైన వర్ణనగా ఉన్నాయి. వీటన్నిటికీ 3వ అధ్యాయం కేంద్ర స్థానంలో ఉంది.
విలాపవాక్యములు గ్రంథంలోని ప్రతి వచనం హెబ్రీ భాషలోని 22 అక్షరాలలో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమయ్యే విధానాన్ని అనుసరించింది. 5వ అధ్యాయంలోని 22 వచనాలు కేవలం ఒక్కొక్క పంక్తినే కలిగి ఉండగా, ఈ ఒక్క అధ్యాయంలో మాత్రం అక్షరాల వరుస క్రమాన్ని పాటించలేదు. మొత్తం ఐదు అధ్యాయాల్లో 3వ అధ్యాయం మంచి రూపకల్పన కలిగి ఉంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”