కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త ‘‘… యేసు క్రీస్తు వంశావళి’’ అనే మాటలతో ఆరంభం కావడం సమంజసంగానే ఉంది. ఈ సువార్త ఒక బలమైన యూదుల దృక్పథంతో యేసే పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సీయ అని చూపిస్తూ రాయబడిరది.
Read More
గ్రంథ రచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: సువార్తలో గ్రంథకర్త తనను తాను గుర్తించుకోలేదు. అయితే, అసలైన ప్రతులు అని చెప్పదగిన ఆరంభపు ప్రతులలో ఈ సువార్తను మత్తయికి ఆపాదించే శీర్షిక ఉంది. నాలుగు సువార్తలు ఒకే కూర్పుగా పంపిణీ చేయబడుతున్న సమయంలో ఒకదాని నుండి మరొకటి వేరుగా గుర్తించబడడానికి శీర్షికలు తప్పనిసరి. ఆది సంఘ పితరులలో అనేకులు (పాపియాస్, ఐరేనియస్, పెంటానస్, ఓరిగన్) మత్తయిని గ్రంథకర్తగా గుర్తించారు. మత్తయి ఈ సువార్తను మొదట హెబ్రీభాషలో రాశాడనీ, తరువాత ఇది గ్రీకుభాషలోనికి అనువదించబడిరదని కూడా పాపియాస్ వాదించాడు. ఈ సాంప్రదాయ వాదనలతో అనేక ఆధునిక పండితులు విభేదిస్తారు. ఉదాహరణకు, వీరు పాపియాస్కు వేరుగా, ఈ సువార్త గ్రీకు తర్జుమాగా కనిపించటం లేదనీ, కాబట్టి ఇది మొదట హెబ్రీ భాషలో రాసి ఉండకపోవచ్చనీ వాదిస్తారు. పాపియాస్ అభిప్రాయాన్ని అనుసరించి, రాయబడిన భాషను గురించి ఆదిసంఘం పొరబడి వుంటే, రచయితను గూర్చి కూడా వారు పొరబడి వుంటారని కూడా వారు వాదిస్తారు. అయితే, మత్తయిలోని శ్రేష్టమైన గ్రీకు భాష అసలైన హెబ్రీ లేఖనంనుండి నిపుణుడైన అనువాదకుడు అనువదించినదై ఉండవచ్చు. అంతేకాక ఈ సువార్తలో హెబ్రీ భాషా ప్రభావం గురించిన సూచనలు అనేకం ఉన్నాయి (1:17; 1:21; 2:22-23 నోట్సు చూడండి). చివరిగా, సంఘం అన్యజనులున్న ప్రాంతాలలో విస్తరించడం బట్టి హెబ్రీ భాష ఆది క్రైస్తవులకు బాగా తెలిసిన భాష కాకుండా పోయింది. కాబట్టి సువార్త గ్రీకు అనువాదంలోనే వ్యాపించాల్సిన అవసరం ఉండడం వలన, మత్తయికి సంబంధించిన ప్రాచీన హెబ్రీ ప్రతులు లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించదు. మత్తయి సువార్త రాసిన అసలు భాష గురించి పాపియాస్ పొరబడి వున్నప్పటికీ, అతడు గాని, ఆది సంఘ నాయకులు గాని, ఈ సువార్తను మత్తయి రాశాడనే విషయంలో విభేదించలేదు. నిజానికి మత్తయి సువార్తను రచించింది అపొస్తలుడైన మత్తయి అని ఆది సంఘమంతా ఏకకంఠంతో నిర్థారించింది. ఈ ఆరంభ ఏకాభిప్రాయాన్ని తిరగ్గొట్టాలంటే ప్రభావవంతమైన ఆధారాలు అవసరం కావచ్చు. సువార్తలోని అనేక విషయాలు, వాటిని మత్తయి రాశాడని సమర్థిస్తున్నాయి. మొదటిగా, మార్కు 2:14; లూకా 5:27,28 లు, తన శిష్యునిగా ఉండడానికి యేసు పిలిచిన సుంకరి పేరును ‘‘లేవి’’గా గుర్తిస్తున్నాయి. అయితే ఈ సువార్త, ఆ లేవిని ‘‘మత్తయి’’గా గుర్తిస్తుంది. మత్తయి, ‘‘దేవుని బహుమానం’’ అని అర్థమిచ్చే హెబ్రీ నామం కాగా, అతడు తనను అనుసరించడానికి క్రీస్తు పిలుపు పొందినప్పుడు ఆయన లేవీకి ఈ పేరుపెట్టినట్లు కనిపిస్తుంది. తన విశ్వాసాన్ని ఒప్పుకున్న తర్వాత యేసు సీమోనుకు ‘‘పేతురు’’ అని పేరుపెట్టినట్లే (16:18) లేవీని కూడా మత్తయి అని పిలిచాడు. ఈ సువార్తలో ‘‘మత్తయి’’ అని వాడడం, గ్రంథకర్తను గూర్చిన సూచన ఇవ్వడానికి తనను తాను పేర్కొంటున్న మత్తయి వ్యక్తిగత ప్రయత్నం కావచ్చు.
నేపథ్యం: మత్తయి సువార్త కూర్చబడిన కాలాన్ని గుర్తించడం, సువార్తలలో ఒకదానితో ఒకదానికి ఉన్న సంబంధం మీద ఎక్కువగా ఆధారపడి వుంది. మత్తయి తన సువార్తను రాయడానికి మార్కు సువార్తను ఆధారం చేసుకున్నాడని అధికశాతం పండితులు నమ్ముతారు. ఇది సరిjైుతే, మత్తయి సువార్త మార్కు సువార్త తరవాతి కాలానికి చెందినదై ఉండాలి. అయితే, మార్కు సువార్త రాయబడిన కాలం కూడా చాలావరకు మర్మంగానే వుంది. పేతురు మరణించిన 60ల మధ్యకాలం తర్వాత మార్కు తన సువార్త రాశాడని ఐరేనియస్ (సుమారు క్రీ.శ.180) రాశాడు. అయితే పేతురు బతికివుండగానే మార్కు తన సువార్తను రాశాడని ఐరేనియస్కు 20 సంవత్సరాల తరువాత రాసిన అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంటు వాదించాడు. చారిత్రక ఆధారాలలో ఉన్న అస్పష్టతవల్ల దీనిపై నిర్ణయానికి ఇతర విషయాలను ఆధారం చేసుకోవాలి.
మార్కు సువార్త కూర్చబడిన కాలం, లూకా, అపొ.కా. గ్రంథాల కాలంనుండి లెక్కించడం మేలు. రోమాలో పౌలును ఇంటిలో బంధించబడినవానిగా చూపిస్తూ, హఠాత్తుగా ముగిసిన అపొ.కా. గ్రంథం, పౌలు విడుదల కావడానికి ముందే అది రాయబడిరదని సూచిస్తుంది. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యపు చట్టబద్ధత అనేది అపొ.కా. గ్రంథపు ముఖ్య అంశాలలో ఒకటయినందువల్ల, ఒకవేళ అప్పటికే పౌలు విడుదల చేయబడితే, లూకా దాన్ని కూడా పేర్కొని ఉండేవాడు. దీనిప్రకారం అపొ.కా. గ్రంథం 6వ దశకం ఆరంభ సంవత్సరాల్లో రాసివుంటారని తెలుస్తుంది. లూకా సువార్త, అపొ.కా. గ్రంథం ఒకే పుస్తకంలోని రెండు భాగాలు. ఎందుకంటే ఈ పుస్తకాలకు రాసిన ఉపోద్ఘాతాలు ఒకేలా ఉంటాయి. అపొ.కా. గ్రంథానికి ముందే లూకా సువార్త రాయబడిరది. అది రాయడానికి లూకా చేసిన పరిశోధన, కళ్ళారా చూసిన సాక్షులతో మాట్లాడడానికి చేసిన ప్రయాణాల కాలమంతా లెక్కిస్తే, అది రాయబడిరది 50 లలోని చివరి సంవత్సరాలలో అనడం సబబుగా ఉంటుంది. ఒకవేళ తన సువార్త రాయడంలో లూకా, మార్కు సువార్తను ఉపయోగించి వుంటే (ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి), మార్కు తన సువార్తను దానికంటే ముందుగా అంటే 50ల ఆరంభ సంవత్సరాలలో రాసివుంటాడు. అంటే మత్తయి తన సువార్త రాయడానికి మార్కుమీద ఆధారపడినా, మార్కు పూర్తిచేసిన తర్వాత కాలంలో, అంటే క్రీ.శ.55 తరువాతి ఏ కాలంలోనైనా రాసివుండాలి. ఆరంభ చారిత్రక ఆధారాలు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తాయి. పేతురు, పౌలు భక్తులు రోమాలో ప్రసంగిస్తుండగా (క్రీ.శ.60-64) మత్తయి తన సువార్త రాశాడని ఐరేనియస్ అంటాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యేసు పరిచర్యను నేరుగా చూసిన వారి సాక్ష్యాలను సంరక్షించే ఉద్దేశంతో మత్తయి తన సువార్త రాసివుంటాడు. మత్తయి సువార్త కొన్ని వేదాంతిక సత్యాలను నొక్కి చెబుతుంది. మొదటిది, దేవుని ప్రజలు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రాజైన మెస్సీయ యేసే. రెండవది, యేసు తనను వెంబడిరచడానికి ఎంచుకునే ప్రజలందరూ కలిసి స్థాపించబోతున్న నూతన ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు నూతన అబ్రాహాము. ఈ కొత్త ఇశ్రాయేలులో యూదులు, అన్యజనులు కూడా ఉన్నారు. మూడవది, కొత్త మోషే, దేవుని ప్రజల విమోచకుడు, బోధకుడు యేసే. నాలుగవది, యేసు, పా.ని. వాగ్దానాలను నెరవేర్చబోయే కన్యక కుమారునిగా జన్మించిన దేవుని కుమారుడైన ఇమ్మానుయేలు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
కొ.ని.లో మొదటి పుస్తకంగా, పా.ని., కొ.ని. ల మధ్య వారధిగా మత్తయి సువార్త ఉంటుంది. కొ.ని. పుస్తకాలలో, ముఖ్యంగా నాలుగు సువార్తలలో, మత్తయి సువార్తకు పా.ని.తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుని పూర్తి ప్రణాళికను మత్తయి సువార్త ఇస్తుంది. మత్తయి, వెనక్కిచూస్తూ, సుమారు 60 సార్లు హెబ్రీ ప్రవచనాలను పేర్కొన్నాడు (‘‘నెరవేరియున్నవి’’, ‘‘చెప్పబడినది నెరవేర్చబడునట్లుగా…’’). అతడు మెస్సీయ రాక, ఆయన పరిచర్యను గూర్చి మాత్రమే కాక, ఇంకా ముందుకు చూచి, ఆయన సంఘం, రాజ్యాలను గురించిన భవిష్యత్ ప్రణాళికను కూడా దర్శించాడు.
గ్రంథ నిర్మాణం
మత్తయి తన సువార్తను మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. ఒక్కొక్క కొత్త భాగాన్ని పరిచయం చేస్తూ, ‘‘అప్పటినుండి యేసు… మొదలుపెట్టెను’’ (4:17; 16:21) అనే మాటలతో ఆరంభించాడు. ఈ సంధి వ్యాఖ్యలు సువార్తను పరిచయం (1:1-4:16), ముఖ్యభాగం (4:17-16:20), ముగింపు (16:21-28:20) గా విభజిస్తాయి. మత్తయి తన సువార్తను ఐదు ముఖ్యమైన బోధలుగా కూడా విభజించాడు. ఈ ఐదూ ఒక ముగింపు వ్యాఖ్యతో ముగుస్తాయి (8:1; 11:1; 13:53; 19:1; 26:1). ఈ ఐదు ప్రసంగాలు, మోషే ఐదు పుస్తకాలను సూచించాలనీ, అవి యేసును కొత్త మోషేగా గుర్తించాలనీ అయివుంటుందని కొందరు పండితులు నమ్ముతారు.