పునరుత్థానుడు, మహిమపరచబడిన మనుష్యకుమారుడు (యేసు క్రీస్తు), ‘‘పత్మాసు ద్వీపమున పరవాసి’’గా బంధింపబడిన అపొస్తలుడైన యోహానుకు తనను తాను కనుపరచుకున్నాడు (1:9). క్రీస్తు రెండు ఉద్దేశాలు ఏమిటంటే: (1) చిన్నాసియాలో యోహానుకు సుపరిచితమైన ఏడు సంఘాల ఆధ్యాత్మిక ఆరోగ్య స్థితిని వెల్లడిరచడం (అధ్యా.2-3); (2) అంత్యకాలానికి సంబంధించిన సంఘటనలు, వాటి కారకాలను గూర్చిన వరుస దర్శనాలను యోహానుకు బయల్పరచడం (అధ్యా.4-22).
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: సాంప్రదాయ దృక్కోణంలో నాలుగవ సువార్త, మూడు పత్రికలు రాసిన అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడని విశ్వసిస్తారు. దీనికి ఆధారాలు: (1) రచయిత తనను తాను ‘‘యోహాను’’గా పరిచయం చేసుకున్నాడు (1:4,9; 22:8); (2) చిన్నాసియాలో ఉన్న ఏడు సంఘాలతో అతనికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి (1:4,11; అధ్యా.2-3); (3) రాస్తున్నపుడు అతడున్న పరిస్థితులు (1:9) అపొస్తలుడైన యోహాను పరిస్థితులతో సరిపోలుతున్నాయి (యోహాను సుమారు క్రీ.శ. 70 నుండి 100 వరకు చిన్నాసియాలో ఉన్నాడని క్రీ.శ. రెండవ శతాబ్దం నుండి నమ్మదగిన చారిత్రక ఆధారాలున్నాయి); (4) పా.ని. దృశ్యాలతో నిండిన ఈ గ్రంథాన్ని అత్యధికంగా అన్యజనులు నివసిస్తున్న చిన్నాసియాలో పనిచేస్తున్న యోహాను వంటి యూదు రచయితే రాసివుంటాడని రూఢగాి సూచిస్తుంది.
నేపథ్యం: ప్రకటన గ్రంథాన్ని మొదట పొందినవారు చిన్నాసియాకు నైరుతిగా ఉన్న ఏడు స్థానిక సంఘాల సమూహం (1:11; అధ్యా.2-3). ఈ సంఘాలలో కొన్ని బహుశా రోమా చక్రవర్తిjైున డొమిషియన్ (క్రీ.శ. 81-96) పాలనలో శ్రమలనుభవిస్తున్నాయి (2:9-10,13). ఇతర సంఘాలలో సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన సమస్యలున్నాయి (2:6,13-15,20-23). పైపై కనిపించే ఈ సమస్యలు మాత్రమే కాక దీని నేపథ్యంలో కంటికి కనిపించని, శక్తివంతమైన ఒక ఆధ్యాత్మిక యుద్ధం ఉంది (2:10,14,24; 3:9).
కొందరు పండితులు ఈ గ్రంథ రచనా కాలం విషయంలో ముందు వెనుకల కాలాన్ని సూచించినా సౌవార్తిక పండితుల మధ్య ఉన్న సాధారణ అభిప్రాయం ప్రకారం ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలోని తొంభైయవ దశకం మధ్యకాలంలో, అరవైయవ దశకం చివరికాలంలో జరిగింది. తొంభైల మధ్యకాలంలో జరిగిందనేవారి దృక్కోణం ఎక్కువ బలమైందిగా, అధికశాతం మంది అభిప్రాయంగా ఉంది. ఒక్కొక్క దృక్కోణం, సంఘాలకు రాసిన ఉత్తరాల్లో చెప్పిన శ్రమల వృత్తాంతానికి సంబంధించి ఒక్కొక్క రకంగా చెబుతుంది (2:9-10,13). కొన్ని సంఘాలు 60వ దశకం చివరిలో నీరో చేత తీవ్రంగా హింసించ బడ్డాయనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. కాని 17:10 లోని ఏడుగురు రాజుల (వీరిలో ఐదుగురు పడిపోయారు) ప్రస్తావనను బట్టి, ఇది డొమిషియన్ పాలనలోని 90ల మధ్య సంవత్సరాలను సమర్థిస్తుంది. నీరోకు సంబంధించిన అనుమానాలను బట్టి, 11:1-2లో యెరూషలేము దేవాలయమును గూర్చి చెప్పినట్లుగా (క్రీ.శ. 70లో రోమీయుల చేతిలో దేవాలయం అప్పటికి నాశనం చేయబడలేదు అని భావించినట్లయితే) 60ల చివరి కాలంలో జరిగిందన్న అవకాశాన్ని తోసిపుచ్చలేము. కాని మిగిలిన ఆధారాలన్నీ దీని రచనాకాలం సుమారు క్రీ.శ. 95 అనడానికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గమనించదగ్గ ఆధారం ఏమిటంటే, డొమిషియన్ చక్రవర్తి (క్రీ.శ.81-96 కాలంలో పరిపాలించాడు) కాలంలో క్రైస్తవులను స్థానికంగా తీవ్రంగా హింసించిన సమయంలో అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపానికి చెరగొని పోబడ్డాడనే సాంప్రదాయ వాదం.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ప్రకటన గ్రంథంలోని ఎక్కువభాగం బైబిల్లోని పుస్తకాలన్నింటికంటే ఎక్కువగా అంత్యకాలంలోని సంఘటనలపై దృష్టిపెట్టింది. అయితే విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, అంతములో సుదూర పరిణామాలను కలిగించే విషయాలపై తమ జీవితకాలంలో ఎంచుకోవాల్సిన ఆచరణాత్మకమైన ఎంపికలపై దృష్టిపెడుతుంది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ప్రకటన గ్రంథం దాదాపు సంపూర్ణమైన వేదాంత సమీక్షను మనకందిస్తుంది. ఇందులో క్రీస్తును గూర్చి, మానవాళి, పాపం, దేవుని ప్రజలు (సంఘం, ఇశ్రాయేలు ఇద్దరూ), పరిశుద్ధ దేవదూతలు, సాతాను, దయ్యములను గూర్చి విస్తారమైన చర్చ ఉంది. దేవుని శక్తి, త్రిత్వ ఐక్యం (అంటే త్రిత్వం), పరిశుద్ధాత్మ పనిచేసే అంశాలు, లేఖనాల స్వభావం గురించి ముఖ్యమైన సమాచారం ఉంది.
గ్రంథ నిర్మాణం
ప్రకటన గ్రంథం దాని వరుసక్రమ నిర్మాణాన్ని 1:19లో ముందుగా చెబుతుంది: ‘‘కాగా నీవు చూచినవాటిని, ఉన్న వాటిని, వీటివెంట కలుగబోవువాటిని’’ వ్రాయుము. అపొస్తలుడైన యోహాను తన దృష్టికోణం నుండి ‘‘వ్రాయమని’’ ఆజ్ఞాపించబడినపుడు, అతడు అప్పటికే హెచ్చించబడిన మనుష్యకుమారుని గూర్చిన దర్శనాన్ని పొందివున్నాడు (అధ్యా.1). తరువాత, ఏడు సంఘాలకు, వాటివాటి ఆధ్యాత్మిక ఆరోగ్యస్థితిని తెలియపరుస్తూ పత్రికలు ‘‘వ్రాయమని’’ అతడు ఆజ్ఞ పొందాడు (అధ్యా.2-3). చివరిగా గ్రంథపు ముఖ్యభాగం వస్తుంది (4:1-22:5). ఇందులో ‘‘వీటివెంట కలుగబోవు’’ సంఘటనలన్నీ ఉన్నాయి.