‘‘పరమగీతము’’ గ్రంథం సొలొమోనుకు, అతని వధువు అయిన షూలమ్మీతికి (6:3) మధ్య ఉన్న ప్రేమను వేడుక చేస్తుంది. ప్రణయ జీవితపు ఉత్తేజం, వివాహపు రాత్రి సౌందర్యం, తొలి రాత్రి, ఆ తదుపరి రాత్రుళ్ళ కలయిక సమయాలు, సున్నితమైన స్నేహబంధం – ఈ అంశాలన్ని కలిసి ఈ గ్రంథాన్ని దేవుని ఉద్దేశాల కనుగుణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దాంపత్య ప్రణయాన్ని వేడుక చేసుకొనే గ్రంథంగా మలిచాయి.
Read More
గ్రంథ రచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: ‘‘సొలొమోను రచించిన పరమగీతము’’ అనే పీఠిక ద్వారా ఈ గీతరచయిత సొలొమోను అని కావ్యం ప్రారంభంలోనే తెలుస్తోంది. సొలొమోనును ఈ గీత రచయితగా క్రైస్తవ సంఘం యథాతథంగా అంగీకరించినప్పటికీ, ఆధునిక విమర్శకులు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు.
ప్రారంభంలో ‘‘పరమగీతము’’లో ఈ శీర్షిక లేదని, అనంతర కాలంలో ఎవరో ఒకరు ఈ కావ్యాన్ని ప్రముఖ వ్యక్తిjైున సొలొమోనుకు ఆపాదిస్తూ అతని పేరును చేర్చి ఉండవచ్చని విమర్శకుల మొదటి వాదన. అయితే, ఈ వాదనకు బలం చేకూర్చే ఆధారాలేవీ లేవు. పైగా, ఈ శీర్షిక గ్రంథ కూర్పులో అంతర్భాగమనీ, ఆ ప్రకారంగా ఇది ఆది నుండి ఉన్నదేనని గ్రంథ నిర్మాణమే తెలియజేస్తున్నది. బైబిల్లోని ఇతర గ్రంథకర్తల్లాగానే ఈ గీతరచయిత కూడా కథాంశానికి సంఖ్యాపరమైన ప్రాముఖ్యతను జోడిరచాడు – మూడు, ఏడు, పది – ఇవి కావ్యంలో తరచుగా కనిపించే సంఖ్యలు. ఉదాహరణకు, ‘‘పరమగీతము’’ను గ్రంథకర్త ఏడు విభాగాలుగా రూపొందించడం జరిగింది (దిగువన చూడండి), ఏడువిధాల ప్రశంస (4:1-5), రెండు సార్లు పది విధాల ప్రశంస (5:10-16; 7:1-5), భావసూచకంగా ‘‘ప్రేమ’’ను తెలియజేసే పదం పది సార్లు ఉండడం (2:4-5,7; 3:5; 5:8; 7:6; 8:4,6-7). శీర్షికతో సహా, సొలొమోను పేరు గీతంలో అంతర్లీనంగా ఏడు చోట్ల కనబడుతుంది (1:1,5; 3:7,9,11; 8:11-12): మొదటి విభాగంలో రెండు సార్లు, చివరి విభాగంలో రెండు సార్లు, వీటి మధ్య భాగంలో మూడుసార్లు కనబడే సొలొమోను పేరు గ్రంథాన్ని సమన్వయపరుస్తూ సమతూకంలో ఈ కావ్యానికి సౌష్టవరూపాన్ని ఇస్తుంది.ఆ విధంగా శీర్షిక సైతం గ్రంథంలో అంతర్లీనంగా ఉండేలా చాకచక్యంగా పొందుపర్చబడిరది. సొలొమోను పేరు ఏడు సార్లు కనబడేలా సంపూర్ణం చేసింది. ఈ నిర్మాణం హెబ్రీలో ప్రాసనియమంలోను, ఛందోబద్ధంగాను ఉండి వినసొంపైన శ్రావ్య మాధుర్యాన్నిస్తున్నది. పైగా, పదిచోట్ల భావసూచకంగా కనబడే ‘‘ప్రేమ’’ అనే పదం ఏడు చోట్ల కనబడే ‘‘సొలొమోను’’ అనే పదంతో కలసి ‘‘పరమగీతము’’ కథాంశాన్ని, గీత రచయితను కనుపరుస్తుంది. ఈ ప్రకారంగా సొలొమోను అనే పేరు శీర్షికగా తరువాతి కాలంలో చేర్చింది కాక, ఆది నుండి గీతానికి ప్రారంభవచనంగా ఉంది.
సొలొమోనును ఈ గీతరచయితగా పేర్కొనడంలో విమర్శకుల మరొక అభ్యంతరం, అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులుండడం (1రాజులు 11:3). ఇటువంటి వ్యక్తి ఒక స్త్రీపట్ల ఆరాధనాపూర్వకమైన భావం కలిగిన గీతాన్నెలా వ్రాయగలడు? బహుశా, కృప అతని హృదయాన్ని తాకి ఉండవచ్చు. ఈ విషయంలో గీతరచయిత బైబిల్ లోని ఇతర గ్రంథకర్తలను పోలియున్నాడు, దేవుని కృప, ఆయన పిలుపు లేకుండా పరిశుద్ధ లేఖనాన్ని వ్రాయడానికి అర్హులై ఉండే వారు కాదు. ఉదాహరణకు, గొప్ప అపొస్తలుడైన పౌలు, దేవుని కృప గురించీ తన అయోగ్యత గురించీ విస్తరించి రాశాడు (ఉదా: 1తిమోతి 1:12-16). సొలొమోను అధికార వైభవంలో, సుఖభోగాల్లో మునిగి తేలినవాడైనప్పటికీ, నిజమైన ప్రేమను చూడడానికి దేవుడతని నేత్రాలు తెరిచాడు. ఈ సొలొమోను ‘‘సామెతలు’’ గ్రంథాన్ని కూడా రచించాడు. సామెతలు గ్రంథంలోని ఉపదేశాత్మక సూక్తుల్ని అతడు అన్ని కాలాల్లోను తన జీవితంలో పాటించకపోయినప్పటికీ వాటిని వ్రాయడం మట్టుకు వ్రాసాడు. అదే విధంగా ఆదర్శవంతమైన ప్రేమ, దాంపత్యాల విషయంలో అతడు విఫలమైనప్పటికీ, అతడే వాటిని రాసి ఉండవచ్చని చెప్పడం నిరాధారమైనదేమీ కాదు.
నేపథ్యం: ‘‘పరమగీతము’’ రచనాకాలాన్ని నిర్ధారించే బలమైన చారిత్రక కారణం సొలొమోను కాలంనాటి సమకాలీన సాహిత్యరీతులైన ఐగుప్తు ప్రేమకావ్యాలు. ఇవి సొలొమోను కాలానికి పూర్వమే ఉన్నాయనడం లేదా సొలొమోనుకు సమకాలీనమైనవి అనడం నిర్వివాదాంశం. ఐగుప్తు ప్రేమకావ్యాలకు ‘‘పరమగీతము’’ కు మధ్య సాహితీసామ్యం విషయంలో కూడా చర్చకు తావు లేదు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
పరమగీతము గ్రంథ ప్రధానాంశం భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమలోని సౌజన్యం, సౌందర్యం. పరమగీతము లోని ఆదర్శవంతమైన ప్రేమభావనలు వాటి వర్ణనల లాగానే ముగ్ధమనోహరంగా ఉన్నాయి: భావోద్వేగ పూరితమైన అన్యోన్యత, సున్నితమైన సంభాషణలు, ఆనందకరమైన దాంపత్య బంధం, ప్రగాఢమైన స్నేహం లేదా సాహచర్యం, ఉమ్మడి దృక్పథం, ఇష్టపూర్వకమైన క్షమాపణ, యథార్థత, భద్రత, కష్ట సమయాలలో సైతం తరిగిపోని ప్రేమ, అన్ని కాలాల్లో నూతనత్వాన్ని సంతరించుకునే ప్రేమ. ఈ గీతం పరిపూర్ణమైన ప్రేమను వర్ణిస్తుంది కాబట్టి గీత రచయిత దానిని దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న ప్రేమతో పోల్చడం సహజమైనదే. సొలొమోను ప్రేమ దేవునికి తన ప్రజల మీద ఉన్న ప్రేమను పోలి ఉంది, షూలమ్మీతి ప్రేమ దేవుని ప్రేమపట్ల ఆయన ప్రజల స్పందనను పోలి ఉంది. అనంతర కాలంలో కొత్త నిబంధన, పురుషుడికి తన భార్యపట్ల ఉన్న ప్రేమకు క్రీస్తుకు తన సంఘం (వధువు) పట్ల ఉన్న ప్రేమ ఆదర్శమని మనకు తెలియజేసేదైనట్లయితే (ఎఫెసీ 5:22-33), సొలొమోను రచించిన పరమగీతము కూడా వివాహం దైవప్రేమకు ప్రతిరూపమని తెలియజేస్తుంది. పరమగీతము దేవునికి ఇశ్రాయేలుపట్ల ఉన్న ప్రేమ ఆదర్శవంతమైన ప్రేమకు ప్రతిబింబం కాబట్టి అందులోని దాంపత్య ప్రణయం సైతం దేవుని ఉద్దేశాల కనుగుణంగా భార్యాభర్తల మధ్య ఉండే ఆదర్శవంతమైన ప్రేమలో ప్రతిబింబించాలి. ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యం నడుమ చిగిర్చిన ప్రేమలో పరదైసును (1:15-2:3; 2:8-14), వివాహపు రాత్రి నాటి దాంపత్యసుఖంలో పరదైసుకు భావాత్మక సూచనల్ని (4:12-5:1), వైవాహిక జీవితంలో పవిత్రమైన దాంపత్య కలయికను బట్టి కలిగే ఆనందాన్ని (4:1-5:1; 7:1-8:3) మనం చూస్తాం. పరమగీతములో ప్రేమగురించి ఉన్న చివరి ప్రశంస దీనంతటిని సమగ్రంగా చిత్రీకరిస్తుంది (8:5-7). ప్రేమజ్వాలలు ‘‘యెహోవా పుట్టించు జ్వాల’’. ఆదికాండములో దేవుడు అల్లకల్లోల స్థితిలో ఉన్న జలాల్ని నియంత్రించి భూమ్యాకాశములను సృష్టించాడు, ఆదాము హవ్వలు తమ వివాహబంధం ద్వారా దేవుని ప్రేమను ప్రతిబింబించాలని దేవుడు వారిని తన పోలికలో సృష్టించాడు. నిర్గమకాండము లో దేవుడు మరణకరమైన ఎఱ్ఱసముద్ర జలాలను నియంత్రించి తన ప్రజల్ని ఒక నూతన జాతిగా రూపొందించాడు. దేవుని ప్రేమ అగ్ని వంటిది కాబట్టి (ద్వితీ 4:24; 32:21-22), సొలొమోను షూలమ్మీతిల మధ్య ఉన్న ప్రేమ ఆదాము హవ్వలు పరదైసులో ఉన్నప్పటి నిష్కల్మష స్థితిని పునరుద్ధరించి, ఇశ్రాయేలుపట్ల దేవునికున్న ప్రేమను ప్రతిబింబింస్తుంది కాబట్టి పరమగీతము ప్రేమలోని భావత్రీవతను ఏ జలాలు లేదా ఏ నదులూ ఆర్పలేని దేవుని ప్రేమాగ్ని జ్వాలతో పోల్చుతున్నది.
బైబిల్ గ్రంథంలో దీని పాత్ర
దేవుని నిర్హేతుకమైన కృపలాగా ఈ అందమైన ప్రేమగీతం మనల్ని దైవప్రేమపట్ల ఉత్తేజితుల్ని చేస్తూ, దైవసంబంధ మైన సౌందర్యాన్ని చూడాలనే కాంక్షను మనలో కలిగిస్తుంది. ఉల్లాసాన్నిచ్చే ప్రేమగీతంలాగా, సొలొమోను రచించిన పరమగీతము దానిలో చిత్రించబడిన ప్రేమ నన్వేషించేలా ప్రేరేపిస్తుంది. ఈ ప్రేమానందం ఊహాశక్తితో అల్లిన ప్రాచీన కాలానికి చెందిన విచిత్రమైన కథ లేక ఆధునిక కాలం లోని కల్పిత వర్ణన కాదు గానీ, దేవుడు మన ఆంతర్యంలో రూపొందించాలని కోరుకుంటున్న పవిత్రమైన, విశ్వసనీయమైన పవిత్ర ప్రేమను ప్రతిబింబిస్తుంది. వివాహంలోని ప్రేమలో పరమానందం ఉందనీ, ఇది క్రీస్తు వధువుగా ప్రతి విశ్వాసి అనుభవించే మరింత గొప్ప ప్రేమను ప్రతిబింబిస్తున్నదనీ మనం గుర్తిస్తాం. ఈ కావ్యంలోని వర్ణన భావప్రధానమైన ప్రేమను మనకు తెలియజేస్తూ, క్రీస్తు రెండవ రాకడలో ఆయనకూ, ఆయన వధువు సంఘమైన మనకూ మధ్య ఉన్న సంబంధం పూర్ణసిద్ధి పొందుతుందనే నిరీక్షణ మనలో కలిగేలా తోడ్పడుతుంది.
గ్రంథ నిర్మాణం
పరమగీతము హెబ్రీలో అలంకార రూపంలో ఉన్న పద్యకావ్యం. హెబ్రీలోని ఈ పద్యం అలంకార చిత్రీకరణ:
ఎ
బి
సి
బి’
ఎ’
ఇందులో ఎ మరియు ఎ’ ఒకదాని కొకటి ప్రతిబింబాలు, మధ్య భాగమైన సి పద్యంలోని ప్రధానాంశాన్ని తెలియజేస్తుంది. ఈ కింద ఉన్న గ్రంథ విభజన పరమగీతము నిర్మాణాన్ని తెలియజేస్తుంది. నిర్మాణతలోని ప్రధానాంశాల్ని, అంటే వివాహపు రోజు పగటివేళను రాత్రివేళను (‘‘డి’’ భాగం) ప్రధానంగా తెలియజేయడం రచయిత ఉద్దేశం. దేవుడు సొలొమోనును ఈ గీతరచనకు ప్రేరేపించడం, వైవాహికస్థితిలోని ప్రేమకు ఆయన దైవిక ఆమోదాన్ని తెలియజేయడమే.
హెబ్రీ మూలప్రతి స్త్రీ పురుష వాచకాలలో, ఏక బహు వచనాలలో మార్పు చేయడం ద్వారా మాట్లాడే వేర్వేరు వ్యక్తులను గుర్తిస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”