Telugu Study Bible

Revelation

పునరుత్థానుడు, మహిమపరచబడిన మనుష్యకుమారుడు (యేసు క్రీస్తు), ‘‘పత్మాసు ద్వీపమున పరవాసి’’గా బంధింపబడిన అపొస్తలుడైన యోహానుకు తనను తాను కనుపరచుకున్నాడు (1:9). క్రీస్తు రెండు ఉద్దేశాలు ఏమిటంటే: (1) చిన్నాసియాలో యోహానుకు సుపరిచితమైన ఏడు సంఘాల ఆధ్యాత్మిక ఆరోగ్య స్థితిని వెల్లడిరచడం (అధ్యా.2-3); (2) అంత్యకాలానికి సంబంధించిన సంఘటనలు, వాటి కారకాలను గూర్చిన వరుస దర్శనాలను యోహానుకు బయల్పరచడం (అధ్యా.4-22).
Read More

TSB Video

Jude

సాధారణ పత్రికల్లో ఒకటైన యూదా పత్రిక అతి చిన్నది. కొద్దికాలం క్రితం వరకూ పండితులు కొత్త నిబంధనలోని ఇతర గ్రంథాలన్నిటికంటే దీనిని ఎక్కువగా నిర్లక్ష్యం చేశారు. విశ్వాసానికి ప్రమాదకరంగా మారిన తప్పుడు బోధలను బలంగా ఎదిరించి క్రైస్తవ సత్యాన్ని కాపాడడానికి యూదా ప్రయత్నించాడు. ఈ పత్రిక సందేశం ఏ కాలానికైనా వర్తిస్తుంది. ఎందుకంటే విశ్వాసులు తమ శక్తి అంతటితో సువార్తను కాపాడుకోవలసిన అవసరం ఉంది. పత్రిక సందేశానికి సంబంధించినంత వరకు దీనికీ 2పేతురు పత్రికకూ స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి. 2పేతురు పత్రిక కూడా సంఘంలోకి చొరబడుతున్న కపట బోధకుల విషయంలో కఠినంగా వ్యవహరించింది
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

3 John

కొత్త నిబంధనలోని అతి చిన్న పుస్తకమైన 3 యోహాను పత్రిక ఒక ఉత్తరంలాగా ఉన్నప్పటికీ అది ఒక వ్యాపార లావాదేవీ సంభాషణలాగా కనిపిస్తుంది. దీనిలోని ‘‘పెద్ద’’ బహూశ తన అజమాయిషీ కింద పనిచేసే గాయు అనే ఒక కాపరిని ప్రోత్సహించడానికి రాశాడు. నాయకత్వం కోసం వెంపర్లాడే దెయొత్రెఫె అనే వ్యక్తి గురించిన హెచ్చరిక తప్పిస్తే ఈ ఉత్తరంలో ఎక్కువగా సానుకూల సలహాలే కనిపిస్తాయి. దేవుని సత్యం, ప్రేమ, మంచితనం అనేవి దీనిలోని ప్రాముఖ్యమైన అంశాలు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

2 John

2యోహాను పత్రిక క్రైస్తవ ప్రేమలో తీవ్రత కలిగి ఉండమనీ (వ.5), వంచకుల విషయంలో మెలకువ కలిగి ఉండమనీ (వ.7-8) ‘‘ఏర్పరచబడిన అమ్మగారికి’’ (లేక ఒక సహవాసాన్నో, లేక ఆ సహవాసం సమావేశం అవుతున్న ఇంటి యజమాని అయిన ఒక స్త్రీనో ఉద్దేశించి) సలహా ఇస్తూ రాయబడిరది. రచయిత ఆ సంఘాన్ని త్వరలో దర్శించడానికి ప్రణాళిక వేసుకున్నాడు (వ.12).
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

1 John

స్థానిక సంఘంలోని కొందరు వ్యక్తులు సహవాసాన్ని విడిచిపోయిన (2:19) నేపథ్యాన్ని పురస్కరించుకొని 1యోహాను పత్రిక రాయబడిరది. బహుశా సంఘ సిద్ధాంతం, నైతిక నియమాలు, భక్తి, మొదలైన విషయాల్లో వారి అభిప్రాయాలు విభేధించడం వల్ల ఈ విధంగా జరిగి ఉండవచ్చు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి యోహాను ఈ పత్రిక రాశాడని కొంతవరకు చెప్పవచ్చు. కొన్ని కీలకమైన వేదాంతపరమైన సత్యాలను, మరి ముఖ్యంగా క్రీస్తు సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించి, వాటిని మరింత సవిస్తరంగా వివరించాడు. ప్రేమ ప్రాశస్త్యాన్ని వివరించి, మన నమ్మకం, క్రియలు ఒకదానితో ఒకటి సరితూగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం క్రైస్తవ జీవితానికి పునాది అనీ, దీనిలోనుండే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ప్రారంభమవుతుందనీ చెప్పాడు. నిజమైన విశ్వాసం, ఆదర్శవంతమైన నీతి, దేవుని పట్లా, ప్రజలపట్లా లోతైన ప్రేమల గురించి రచయిత తన పాఠకులకు బోధిస్తూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండగా, పత్రికలోని అధిక భాగం ఈ మూడిరటిలో ఒకటి లేక ఎక్కువ అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. 
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

2 Peter

సాధారణ పత్రికలలో ఒకటైన 2పేతురు ఆచరణీయమైన క్రైస్తవ జీవితం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. అందుకోసం అబద్ధ బోధకులకూ, వారి బోధలు నైతిక జీవితంపై చూపే ప్రభావానికీ వ్యతిరేకంగా హెచ్చరించడానికి పేతురు ఈ పత్రికను రాశాడు. అబద్ధ బోధలను ఎదుర్కొంటూనే దేవుని నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని నొక్కి చెబుతూ ఈ దుర్నీతితో నిండిన లోకంలో క్రైస్తవ సుగుణాలను కలిగి జీవించాలని పాఠకులను ఈ పత్రిక ప్రోత్సహిస్తుంది.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

1 Peter

1పేతురు సాధారణ పత్రికల్లో ఒకటిగా పరిగణించబడిరది. ఉత్తర ఆసియా మైనర్‌లో తీవ్రమైన హింసలు ఎదుర్కొంటున్న విశ్వాసులకు ఇది ప్రోత్సాహాన్ని అందించింది. అణచివేత కింద ఉన్నప్పటికీ నమ్మకత్వంగా కొనసాగాలని ఈ పత్రిక ప్రోత్సహించింది. మరి ముఖ్యంగా దేవుని పరిశుద్ధ జనాంగం ఒక పరాయి దేశంలో జీవిస్తున్న వారిలాగా ప్రత్యేకమైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఈ క్రైస్తవేతర లోకంలో జీవించి ఉండగా వారు క్రీస్తు కోసం శ్రమలు పొందుతారు గానీ వారి భవిష్యత్‌ స్వదేశం పరలోకమే అని వారు గుర్తుంచుకోవాలి.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

James

నాలుగు సువార్తల్లో గ్రంథస్తం చేసి ఉన్న యేసు బోధనలకు యాకోబు పత్రిక ఒక అద్భుతమైన జోడు లేక సహకారి అని చెప్పవచ్చు. యేసు తన శిష్యులకు అందించిన నైతిక బోధలతో సరిపోలే విధంగా యాకోబు పుస్తకం గంభీరమైన నైతిక నియమాలను నొక్కి వక్కాణించింది. మతసంబంధమైన వేషధారణకు వ్యతిరేకంగా యేసు పలికిన కఠినమైన తీర్పులను కూడా యాకోబు పత్రిక ప్రతిబింబించింది. యేసు బోధలకు లాగా ఈ పత్రిక కూడా పలు హెచ్చరికలకు, ఆదరణకు, దిద్దుబాటుకు, ప్రోత్సాహానికి గొప్ప ఆధారంగా ఉంది. చివరిగా యాకోబు పత్రిక బహు ఆచరణాత్మకమైంది, అయితే అదే సమయంలో కొ.నిలో కనిపించే గంభీరమైన వేదాంత సత్యాలు దీనిలో కనిపిస్తాయి.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Hebrews

హెబ్రీయులకు రాసిన పత్రిక సర్వశ్రేష్ఠుడైన దేవుని కుమారునికి ఒక గొప్ప ప్రశంస అని చెప్పుకోవచ్చు. ఇది ఈ పత్రిక రచయితకు సమకాలికులైన విశ్వాసుల్లో ఎవరైతే హింసలు అనుభవిస్తున్నారో వారికి ఒక ప్రోత్సాహకరమైన గ్రంథం. తన క్రైస్తవ పాఠకులు తమ కష్టాల్లో సహనం వహించడంలో అస్థిరులైయున్నారని ఈ గ్రంథ రచయిత భయపడ్డాడు. ఈ ఉత్తరం రాయడంలో రచయితకు రెండు రకాల ఉద్దేశాలున్నాయి. (1) యేసు క్రీస్తును ‘‘దేవుడు’’, ‘‘మనుష్య కుమారుడు’’ అని పిలవడం ద్వారా దేవునికి, మానవునికి మధ్యవర్తిగా నిలవదగిన ఏకైక వ్యక్తి అయిన యేసు క్రీస్తును హెచ్చించాడు. (2) ‘‘సంపూర్ణుల మగుటకు సాగిపోదము’’ ‘‘విశ్వాసమూలముగా’’ జీవిద్దాం అంటూ తన సాటి క్రైస్తవులను ప్రోత్సహించాడు.
Read More

TSB Video

Philemon

పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలో స్వభావరీత్యా వ్యక్తిగతమైనది ఫిలేమోను పత్రిక ఒక్కటే. అది ఫిలేమోను అనే తన యజమాని సొత్తును దోచుకొని కొలస్సీ నుండి రోమ్‌ నగరానికి పారిపోయిన ఒనేసిము అనే బానిస గురించి రాయబడిరది. ఈ ఒనేసిము రోమ్‌లో చెరసాలలో ఉన్న పౌలును కలుసుకున్నాడు. పౌలు ఒనేసిము గురించి ఫిలేమోనుకు రాసిన ఈ ఉత్తరంతో సహా ఒనేసిమును కూడా కొలస్సీ పట్టణానికి పంపించాడు. పౌలు రాసిన ఇతర పత్రికలతో పోలిస్తే ఫిలేమోను పత్రిక ఒక చిన్న పోస్టుకార్డు లాంటిది. అయినప్పటికీ ఇది ఒక అపొస్తలుడు అధికారపూర్వకంగా రాసినట్టు కాక సున్నితమైన హృదయం గల ఒక వ్యక్తి తన స్నేహితునికి రాసిన ఉత్తరంలాగా ఉంటుంది.