Ezekiel
ఇది యెహెజ్కేలు అనే పేరు గల ప్రవక్త దైవావేశప్రేరితుడై ప్రకటించిన ప్రవచనాలున్న గ్రంథం. ఆంతరంగిక జ్ఞాపకాల్లోకి వెళ్తున్నామనే స్పృహను పాఠకులకు కలిగిస్తాయి. ఈ గ్రంథంలోని దైవోక్తులు యెహెజ్కేలు స్వయంగా పలుకుతున్నట్లుగా ‘‘నేను’’, ‘‘నా’’ అనే పదాలలో కూడినవై అతని ప్రవచనాలు ప్రధానంగా బబులోను చెరలో ఉన్నవారినుద్దేశించి రాసినవైనా అంతే పాపాలకు వచ్చే శిక్షల గురించి, నిరీక్షణ, పునరుద్ధరణల వాగ్దానాల గురించి సమానంగా కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ప్రవక్త యెహెజ్కేలు బబులోనులో ఈ గ్రంథాన్ని రచించాడని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయి. గ్రంథంలో కనిపించే సమరూపకత, సాహిత్యపరమైన సంగతత్వం సంపాదకీయంతో సహా గ్రంథాన్నంతా ఒకే వ్యక్తి సంకలనం చేశాడనీ, ఆ వ్యక్తి ప్రవక్తే అనీ నిరూపణాత్మకంగా తెలియజేస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో పలు ప్రవచనాల ప్రారంభంలో చారిత్రక కాల సూచనలుండడం గ్రంథంలో ఏకీకృతను సూచించే మరొక ముఖ్యాంశం. బైబిల్లో సంవత్సరం, నెల వంటి కాలాల్ని సూచించే ముఖ్యమైన పుస్తకాల్లో యెహెజ్కేలు ఒకటి, వాక్యభాగాల ప్రారంభంలో కాలాన్ని తెలియజేసిన సందర్భాలు గ్రంథంలో పదమూడు ఉన్నాయి. యూదా రాజైన యెహోయాకీను చెరలోకి వెళ్లిన సంవత్సరాన్ని (క్రీ.పూ.598/597) ఆధారం చేసుకొని యెహెజ్కేలు గ్రంథంలో కాలాన్ని లెక్కించడం జరిగింది. గ్రంథం యావత్తూ దర్శనాలుండడం (1; 8-11; 40-48 అధ్యా.) గ్రంథానికి ఏకత్వాన్ని నిచ్చిన మరొక ముఖ్యమైన విషయం. చివరగా, గ్రంథంలోని శైలీపరమైన అక్షణాలు సాహిత్యశైలులు సైతం గ్రంథ ఏకత్వ వాదనను బలోపేతం చేస్తున్నాయి.
నేపథ్యం: క్రీ.పూ.598/597లో రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడిచేసి బబులోనుకు చెరగా తీసుకొని వెళ్లిన సుమారు పదివేల మంది యూదావారిలో బూజీ కుమారుడైన యెహెజ్కేలు ఉన్నాడు (2రాజులు 24:10-17). రాజైన యెయోయాకీను చెరలోనికి వెళ్ళిన అయిదు సంవత్సరాల తర్వాత, అంటే రెండవసారి క్రీ.పూ.593లో యెహెజ్కేలుకు ప్రవక్తగా పిలుపు వచ్చింది. యాజకునిగా తన సేవను ప్రారంబించాలని ముప్పయి సంవత్సరాల వయసులో (సంఖ్యా 4:3) యెహెజ్కేలు ప్రవచన పిలుపు పొందాడు. పరిచర్య ప్రారంభమైంది (1:1-3) ఈ గ్రంథంలోని చివరి ప్రవచనం యూదా రాజైన యెహోయాకీను చెరలోనికి వెళ్ళిన ఇరవై యేడవ సంవత్సరం (29:17)లో చేయబడి, ప్రవక్తగా యెహెజ్కేలు పరిచర్య ఇరవై రెండు లేదా ఇరవై మూడు సంవత్సరాలు కొనసాగిందని లేఖనము తెలియజేస్తుంది. ఇశ్రాయేలు చరిత్రలో యెరూషలేము ముట్టడి, దేవాలయం నాశనమవడం మాత్రమే కాక యూదాలోని ప్రముఖులు చెరలోకి వెళ్లడం వంటి సంఘటనలు జరిగి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న కాలంలో ప్రవక్త జీవించాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
గ్రంథ సందేశం ఇశ్రాయేలు చరిత్రలో క్రీ.పూ.586లో యెరూషలేము పతనం అనే కీలకమైన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యెరూషలేము పతనమవుతుందనే ప్రకటనకు పూర్వం, తీర్పు గురించి యెహెజ్కేలు గ్రంథ సందేశం తెలియజేస్తుంది. యెహెజ్కేలు తీవ్ర పదజాలంతో ఇశ్రాయేలు చరిత్రను సింహావలోకనం చేస్తూ జాతి నైతిక పతనాన్ని ఆధ్యాత్మిక లేమిని బహిర్గతం చేశాడు (2:1-8; 8:7-18; 13:1-23; 17:1-21; 20:1-32). యెరూషలేము విధ్వంసం చేయబడి, యూదా ప్రజలు చెరలోకి వెళ్లిన తర్వాత, యెహెజ్కేలు సందేశం మారింది. ప్రకటించడం ప్రారంభించాడు, ప్రజలకు కావలసిన నిరీక్షణను సందేశాన్ని యెహెజ్కేలు ప్రజలు దేవునిపట్ల నమ్మకమైన భవిష్యత్తు తీర్పును విశ్వాసంతో ఆయనకు విధేయులయ్యేలా, వారు శిక్షను తప్పించుకొనేలా ఆయన వారికి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇవ్వనున్నాడు (11:17-20; 36:26-28). ప్రజలు పునరుద్ధరించబడిన తర్వాత యెహోవా ఒక నూతన దేవాలయాన్ని (40-48 అధ్యా.), నూతన ఆరాధనా విధానాన్ని స్థాపించబోతున్నాడు. గ్రంథ అమరిక (ప్రారంభంలో తీర్పు గురించి ప్రకటన, ముగింపులో పునరుద్ధరణ గురించి ప్రకటన) యెహెజ్కేలు సందేశం అంతిమంగా నిరీక్షణను, ప్రోత్సాహాన్ని కలిగించేదని సూచిస్తుంది.
ఇశ్రాయేలు పక్షంగా గ్రంథంలో రూఢ పరచబడిన ఆరు ప్రధాన వేదాంత ప్రకటనలు:
(1) చెదరిపోయిన తన ప్రజల్ని దేవుడు మళ్లీ సమకూర్చుతాడు (11:16-17; 16:1-63; 20:41; 34:11-13; 36:24; 37:21). (2) యెహోవా ఇశ్రాయేలీయుల్ని వారి స్వదేశానికి తిరిగి చేర్చి, అపవిత్రతనుండి వారిని శుద్ధిచేస్తాడు (11:17-18; 20:42; 34:13-15; 36:24; 37:21). (3) తన ప్రజలు తన మార్గాల్లో నడిచేలా దేవుడు వారికి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇవ్వనున్నాడు (11:19-20; 16:62; 34:30-31; 36:25-28; 37:23-24). (4) దేవుడు దావీదు వంశాన్ని పునరుద్ధరించబోతున్నాడు (34:23-24; 37:22-25). (5) ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా యెహోవా ఇశ్రాయేలుకు వృద్ధిని, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు (34:25-29; 36:29-30; 37:26). (6) దేవుడు ఇశ్రాయేలు నడుమ తన శాశ్వతనివాసాన్ని స్థాపించబోతున్నాడు (37:26-28; 40:1-48:35). ఇశ్రాయేలీయులు తమ స్వదేశం చేరుకున్న తర్వాత, మెస్సీయ రాజ్య స్థాపన జరిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో చేసిన అన్ని నిబంధనలు నెరవేరబోతున్నాయి.
బైబిల్ గ్రంథంలో దీని పాత్ర
యెహెజ్కేలు గ్రంథంలోని కొన్ని భాగాలు కొత్త నిబంధనలో ఉదహరించబడ్డాయి. అయితే కొన్నిటి పరస్పర సంబంధం గమనార్హం. ఉదాహరణకు, దైవప్రత్యక్షత గల దర్శనాలతో మొదలైన యెహెజ్కేలు గ్రంథం, యేసు క్రీస్తు ప్రత్యక్షతతో ప్రారంభమయ్యే ప్రకటన గ్రంథం పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం ముగింపు, ప్రకటన గ్రంథం ముగింపు దేవుని సన్నిధినుండి జీవజలనది ప్రవహిస్తోందనే ఒకే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి (47:1-12; ప్రక 21:1-22:6). చివరగా, ప్రజలు చెరలోనుండి తిరిగి రావడాన్ని మృతుల పునురుత్థానంగా చూపించే వర్ణన కొత్త జన్మ గురించి పౌలు భావనతో స్వారూప్యత కలిగి ఉండి సమరూపంలో ఉన్నాయి (ఎఫెసీ 2:4-5).
గ్రంథ నిర్మాణం
యెహెజ్కేలు ప్రవక్త తన ప్రవచన గ్రంథమంతటా విలక్షణమైన శైలి నుపయోగించాడు. యెహెజ్కేలును సూచించే ‘‘నరపుత్రుడా’’ అనే పదం 93 చోట్ల కనబడుతుంది, ఇది ప్రవక్త మానవస్వభావాన్ని ప్రధానంగా సూచిస్తుంది. గ్రంథం లోని ప్రధాన విభాగాల్లో (1:2-3; 3:22; 33:22; 37:1) కనబడే ‘‘యెహోవా హస్తము నా మీదికి వచ్చెను’’ అనే పదజాలం బైబిల్లో ఇతర చోట్ల ఏలియాకు (1రాజులు 18:46), ఎలీషాకు (2రాజులు 3:15) సంబంధించి మాత్రమే కనబడుతుంది. ‘‘మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు’’ అనే గుర్తింపు సూత్రాన్ని తెలియజేసే నిర్గమం వృత్తాంతంలోని ఈ ప్రత్యేకమైన పదజాలం (నిర్గమ 6:6-8; 7:5; 10:1-2; 14:4,18), యెహెజ్కేలు గ్రంథంలో 60 చోట్ల కనబడుతుంది. ప్రవచనానికి ఉపోద్ఘాతంగా ఉన్న ‘‘యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను’’ అనే పదజాలం గ్రంథంలో 46 చోట్ల కనబడుతూ, గ్రంథంలో మరొక విభాగం ప్రారంభం కానుందని పాఠకులను అప్రమత్తం చేస్తాయి. ‘‘యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను’’ అనే పదజాలం కూడా యెహెజ్కేలు గ్రంథంలో తరచుగా కనబడుతుంది (5:16,17; 17:21,24; 22:14; 24:14; 26:14; 30:12; 36:36; 37:14).
యెహెజ్కేలు గ్రంథంలోని మరొక సుపరిచితమైన అంశం సంకేతాల ద్వారా ప్రవక్త తన సందేశాన్ని ప్రదర్శించడాన్ని భావవ్యక్తీకరణలో ఇటువంటి విధానం గ్రంథమంతటా కనబడుతుంది. యెహెజ్కేలు తన ప్రవచనాల్ని తెలియజేయడానికి సాహిత్యపరంగా అలంకారికవర్ణనను కూడా ఉపయోగించడం జరిగింది ఉదా: యెరూషలేమును ద్రాక్షచెట్టుతో పోల్చడం (అధ్యా. 15), పక్షిరాజుతో పోల్చడం (17:1-21), దావీదు వంశాన్ని ఆడుసింహంతో (19:1-9), ద్రాక్షతోటతో పోల్చడం (19:10-14), తీర్పుకు సూచనగా ఖడ్గం (21:1-17), నీతిబాహ్యమైన అక్కచెల్లెళు ్లగా ఒహొలా ఒహొలీబా లను సూచించడం (23:1-35).
గ్రంథంలోని చివరి ప్రత్యేకమైన లక్షణం యెహెజ్కేలు ప్రవచనాల్లో అంతకు పూర్వమే ఉన్న లేఖనాల్ని ఉదాహరించడం. 4-5 అధ్యాయాల్లో తీర్పును ప్రకటించే ప్రవచనాల్లో లేవీ అధ్యా. 26 లోని శాపాలెక్కువగా కనబడుతున్నాయి. ఇంకా, లేఖనాల్లోని ఇతర బాగాలైన, సంఖ్యా 18:1-7,22-23 వచనాల్ని 44:9-16 వచనాల్లో, జెఫన్యా 3:1-4 వచనాల్ని యెహె. 22:25-29 వచనాల్లో యెహెజ్కేలు ప్రస్తావించాడు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”