Telugu Study Bible

Ezekiel

ఇది యెహెజ్కేలు అనే పేరు గల ప్రవక్త దైవావేశప్రేరితుడై ప్రకటించిన ప్రవచనాలున్న గ్రంథం. ఆంతరంగిక జ్ఞాపకాల్లోకి వెళ్తున్నామనే స్పృహను పాఠకులకు కలిగిస్తాయి. ఈ గ్రంథంలోని దైవోక్తులు యెహెజ్కేలు స్వయంగా పలుకుతున్నట్లుగా ‘‘నేను’’, ‘‘నా’’ అనే పదాలలో కూడినవై అతని ప్రవచనాలు ప్రధానంగా బబులోను చెరలో ఉన్నవారినుద్దేశించి రాసినవైనా అంతే పాపాలకు వచ్చే శిక్షల గురించి, నిరీక్షణ, పునరుద్ధరణల వాగ్దానాల గురించి సమానంగా కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Lamentations

ఇది వేదనను వర్ణించే గ్రంథం అయినా దేవుని యందలి నిరీక్షణతో నిండి ఉంది. దీని గ్రంథకర్త చరిత్రలో వేరే రచయిత ఎవరూ వర్ణించలేని విధంగా తీవ్రమైన మానవుని వేదనను విస్పష్టమైన రీతిలో వర్ణించాడు. ఈ కారణం చేత మనం అనుభవించే వేదనాభరితమైన సమయాల్లో ఎదురయ్యే కఠినమైన ప్రశ్నలను వ్యక్తపరిచే వాక్యపరమైన మూలగ్రంథంగా విలాపవాక్యములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిలో చర్చించిన బాధాకరమైన సంఘటన యూదుల చరిత్రలో అత్యంత అంధకార సమయాల్లో ఒకటి. అదే క్రీ.పూ. 586 లో జరిగిన యెరూషలేము విధ్వంసం. హెబ్రీ సాహిత్యంలో తరచుగా ఒక గ్రంథం ప్రారంభంలో ఉన్న మొదటి పదం ఆ గ్రంథానికి శీర్షికగా పరిగణించబడుతుంది. ఈ గ్రంథం విషయంలో 1:1, 2:1, 4:1 లు ప్రత్యేకమైన హెబ్రీ ఆశ్చర్యార్థక శ్రమ వచనాలతో (హెబ్రీ. ఎఖా, ‘‘ఆహ్’’, ‘‘అయ్యో’’ ‘‘ఎట్లు’’) ప్రారంభమయ్యాయి. ఆ విధంగా చూస్తే ఈ గ్రంథానికి ‘‘అయ్యో’’ అనే పేరు పెట్టాలి. అయితే ఆ తరువాత రబ్బీలు ఈ గ్రంథాన్ని దాని అంశాలను అనుసరించి పిలవసాగారు – కినోత్‌. అంటే ‘‘విలాపాలు.’’ ఈ విధంగా ఈ గ్రంథానికి టాల్ముడ్‌ లోను ఆ తరవాత దీని గ్రీకు అనువాదం (సెప్టువజింట్‌) లోను ఇదే పేరు ఖాయం అయ్యింది.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Jeremiah

పాత నిబంధనలోని ప్రవక్తల్లోకెల్లా యిర్మీయా గ్రంథానికి, యిర్మీయా ప్రవక్తకు కనీసం రెండు గొప్ప విశిష్టతలున్నాయి: (1) బైబిల్‌ లోని ప్రవక్తల గ్రంథాల్లో ఇది సుదీర్ఘమైన గ్రంథం (1,364 వచనాలు), (2) గ్రంథంలో యిర్మీయా జీవిత వివరాలు పూర్తిగా వర్ణించబడ్డాయి. గ్రంథకర్తలుగా ఉన్న ఇతర 15 మంది ప్రవక్తల గురించి వారి గ్రంథాల్లో ఇన్ని వివరాలు లభ్యం కావు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం ద్వితీయార్థంలోను, ఆరవ శతాబ్దం మొదటి పాతిక సంవత్సరాల్లోను దేశం సంక్షోభంలో ఉన్న కాలంలో యిర్మీయా కఠిన హృదయులుగా ఉన్న యూదాప్రజల మధ్య దేవుని వాక్కును ప్రకటించాడు. గ్రంథంలోని విషయాలు ఇంచుమించు క్రీ.పూ. 640-580 మధ్య కాలంలోనివి.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Isaiah

యెషయా క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంనాటి ప్రవక్త. మన బైబిల్‌ లో యెషయా గ్రంథం ప్రవక్తల గ్రంథాల్లో మొదటిది, అయితే హెబ్రీ బైబిల్లో ఇది మలి ప్రవక్తల గ్రంథాల్లో మొదటిది. యెషయా గ్రంథంలోని కవితాత్మక వర్ణన శక్తిమంతమైనది, ప్రవచనాత్మక దర్శనం నిగూఢమైనది, గ్రంథనిర్మాణం జటిలమైనది. దేవుని స్వాభావిక లక్షణాల గురించి మనలో నూతనమైన అవగాహన ఉన్నప్పుడు, ఆయనతో మనకు సరైన సంబంధం ఉన్నప్పుడు మాత్రమే యెషయా గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలం. కొత్త నిబంధన గ్రంథకర్తలు యెషయా గ్రంథాన్ని క్రీస్తు మొదటి రాకడ నేపథ్యంలో పఠించారు, ప్రవక్త చాలా స్పష్టంగా మెస్సీయ ఆగమనాన్ని సూచించాడని వారు అర్థం చేసుకున్నారు. ఈ కారణంగానే యెషయా గ్రంథంనుండి ఉటంకించబడిన లేదా సూచించబడిన వాక్యభాగాలు కొత్త నిబంధనలో చాలా ఎక్కువగా కనబడతాయి, ఇంత ఎక్కువగా పాత నిబంధనలోని ఏ ఇతర ప్రవచనాలు కొత్త నిబంధనలో కనబడవు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Song of Solomon

‘‘పరమగీతము’’ గ్రంథం సొలొమోనుకు, అతని వధువు అయిన షూలమ్మీతికి (6:3) మధ్య ఉన్న ప్రేమను వేడుక చేస్తుంది. ప్రణయ జీవితపు ఉత్తేజం, వివాహపు రాత్రి సౌందర్యం, తొలి రాత్రి, ఆ తదుపరి రాత్రుళ్ళ కలయిక సమయాలు, సున్నితమైన స్నేహబంధం – ఈ అంశాలన్ని కలిసి ఈ గ్రంథాన్ని దేవుని ఉద్దేశాల కనుగుణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దాంపత్య ప్రణయాన్ని వేడుక చేసుకొనే గ్రంథంగా మలిచాయి.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Ecclesiastes

బాధాకరమైన నిజాలు లేక కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోడానికి బైబిలు ఎన్నడూ సంకోచించదు. ఈ లోకంలో సమస్తం వ్యర్ధం అనిపించేలా ఉన్న పరిస్థితిలో జీవితం యొక్క అర్థాన్ని ఏ విధంగా కనుక్కోగలం అనే ప్రశ్నను ప్రసంగి గ్రంథం చర్చించింది. ఆ ప్రశ్నకు ఏవో పైపై జవాబులతో సరిపెట్టుకోడానికి పాఠకుణ్ణి అది అనుమతించదు. శూన్య నినాదాలతో మనల్ని ఆదరించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నించదు. దానికి విరుద్ధంగా, ‘‘సమస్తము వ్యర్థం’’ అనేదే దాని ధర్మసూత్రం. అయితే ఈ గ్రంథం మనల్ని మానవ ఉనికిలోని వ్యర్థత్వమును ఎదుర్కొనేలా వత్తిడి చేసి శూన్య ఉద్దేశాలు, కపట తీర్పు లేని జీవితానికి నడిపిస్తుంది.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Proverbs

సామెత అంటే ఏమిటి? లౌకికంగా చూస్తే సామెత అనేది ఒక సాధారణ సత్యాన్ని (పరమ సత్యం కాకపోవచ్చు), అంటే ఉదాహరణకు, ‘‘ఒక బుద్ధిహీనుడు, అతని డబ్బు త్వరలోనే విడిపోతారు’’ లాంటి సత్యాన్ని వెల్లడిరచడానికి ప్రయత్నిస్తుంది. అది క్లుప్తమైన మాటల్లో ఉన్నప్పటికీ సారగర్భితంగా భావంలో ఉన్నతంగా ఉంటుంది. ఉదా. ‘‘కష్టపడకుండా ప్రతిఫలం రాదు’’ అనే సామెత ఆచరణాత్మకమైంది. అవి వాస్తవ లోకంలో నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దానిని మనం అన్వయించుకోవాలి. ఆ సామెత వెలుగులో పాఠకుడు తన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ‘‘దాతృత్వం ఇంటి దగ్గరే ప్రారంభం అవుతుంది.’’
Read More

TSB Video

Psalms

కీర్తనలు అనే పదానికి హెబ్రీలో సమాంతర పదం టెహిలిమ్‌. అంటే ‘‘స్తుతి’’ అని అర్థం. ఆంగ్లభాషలో ఈ పుస్తకానికి ఇవ్వబడిన పేరు (Psalms సామ్స్‌) గ్రీక్‌ పా.ని (LXX) లోని ‘‘సామోయ్‌’’ అనే పదం నుండి వ్యుత్పన్నమైంది. దీని అర్థం ‘‘స్తుతి కీర్తనలు’’. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి చెల్లించడంలో కీర్తనలు ప్రధానమైనవని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కొందరు కీర్తనలు గ్రంథాన్ని ఇశ్రాయేలు స్తుతిగీతాల పుస్తకంగా సూచించారు. ఇది పాక్షికంగా సత్యమేయైనా, ఈ పుస్తకంలోని అంశాలన్నిటినీ సమగ్రంగా చూస్తే ఆ పేరు ఈ పుస్తకానికి సరిపోదు. ఈ గ్రంథం లోని కీర్తనల్లో మూడవ భాగానికి పైగా ప్రార్థనల రూపంలో ఉన్నాయి. కాబట్టి, ఇశ్రాయేలు దైవారాధనలో కీర్తనలు గ్రంథాన్ని గీతాలాపనలోను, ప్రార్థనలలోను ఉపయోగించేవారని చెప్పవచ్చు.  
Read More

TSB Video

Job

ఈ గ్రంథంలో ప్రధాన పాత్రధారి, ప్రసంగికుడు అయిన వ్యక్తి పేరుతోనే యోబు గ్రంథం పేరు వచ్చింది. ఇది యోబు తన సమస్తాన్నీ కోల్పోయిన తరువాత తన శ్రమలకు కారణం ఏమిటి అనే విషయాల గురించిన చర్చల వృత్తాంతం. దీనిలో అంతిమంగా దేవుని మాటే నిలిచింది, యోబు కోల్పోయిన సమస్తాన్నీ దేవుడు రెండంతలు అధికముగా (42:10) అతనికి తిరిగి సమకూర్చాడు.
Read More

TSB Video

Esther

ఎస్తేరు ఒక ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్లో దేవుని గురించిన ప్రస్తావన లేని ఒకే ఒక్క గ్రంథం ఎస్తేరు. అయితే ఈ గ్రంథంలో మొర్దెకై దైవికమైన సహాయం గురించి చెప్పిన మాటల్లో సూచనప్రాయంగా కనిపించే దేవుని ప్రత్యక్షత నుండి చూడవచ్చు (4:14). ఒక్కోసారి ఇది కేవలం ఒక లౌకికమైన రచనలాగా కనిపిస్తుంది కాబట్టి చారిత్రాత్మికంగా  సమాజమందిరా(సునగోగు)ల్లో, క్రైస్తవ సంఘంలో దీని ప్రామాణికతను గురించి ప్రశ్నలు లేవనెత్తింది. ఎస్తేరు గ్రంథం కొన్ని ప్రత్యేకమైన చారిత్రాత్మిక సంభవాలతో గట్టిగా ముడిపడి ఉంది. అదే సమయంలో అది ఒక సాహితీ ఖండం, ఒక గొప్ప కథగా పిలవబడడానికి అవసరమైన అన్ని రకాల సాహితీ విలువలతో కూడిన వృత్తాంతం. ఈ గ్రంథం ఉద్దేశాలు, గమ్యం స్పష్టంగా దీనిలో చెప్పబడక పోయినప్పటికీ ఈ కథను మొత్తంగా చూసినప్పుడు వాటిని మనం గమనించవచ్చు.