Old testament

Zephaniah

చిన్న ప్రవక్తలలో ఒకడైన జెఫన్యా, దేవుని ముందు నీతిగా జీవించాల్సిన అవసరత గురించి బోధించాడు.. ప్రవక్తలందరిలో తీర్పును గూర్చి అత్యంత బలమైన వివరణ ఇచ్చినవాడు జెఫన్యా, అయితే పశ్చాత్తాపం చెంది, నీతివైపు తిరిగినవారు పునరుద్ధరించ బడతారనే విషయాన్ని కూడా అతడు ఎత్తి చూపించాడు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Zephaniah Read More »

Habakkuk

చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒకటైన హబక్కూకు తన శైలిలో విశిష్టమైంది. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాల్సిన హబక్కూకు, ప్రజల తరుపున దేవునితో మాట్లాడాడు. చరిత్రలో దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి హబక్కూకు తర్జనభర్జన పడ్డాడు. ముఖ్యంగా దేవుడు తన న్యాయాన్ని నెరవేర్చడానికి  ఒక నీతిలేని దేశాన్ని వాడుకొనే విషయంలో హబక్కూకు లేవనెత్తిన అభ్యంతరానికి దేవుడిచ్చిన  జవాబు, ‘‘నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు’’ (2:4) అని. 
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Habakkuk Read More »

Nahum

నహూము గ్రంథం బాధింపబడుతున్న తన ప్రజలను విడుదల చేయమని దేవుడు అష్షూరుపై వత్తిడి తేవడాన్ని నాటకీయంగా చూపిస్తుంది. ఇశ్రాయేలు శత్రువులకు ఇది ఒక కటువైన సందేశమే కాని యూదా ప్రజలకు మాత్రం ఇది ఒక నిరీక్షణా సందేశం.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Nahum Read More »

Micah

పుస్తకం ఆరంభంలో ‘‘యెహోవావంటి వాడెవడు?’’ (1:1; మీకాయా అనేదానికి పొట్టి పేరు. యిర్మీయా 26:18తో పోల్చండి) అని అర్థమిచ్చే మీకా పేరు, పుస్తకం చివరిలో మీకా అడిగిన ‘‘నీతో సముడైన దేవుడున్నాడా?’’ (మీకా 7:18) అనే ప్రశ్న, ఈ గ్రంథ పూర్తి సందేశాన్ని సంక్షిప్తంగా చెబుతాయి. మానవులు సాటిలేని ‘‘సర్వలోకనాధుని’’ (4:13) వ్యక్తిత్వాన్నీ, కార్యాలనూ, గుణలక్షణాలనూ తలపోయాలనేదే ఆ సందేశం. పరిశుద్ధతలో, శక్తిలో, ప్రేమలో ఆయన సాటిలేనివాడు. ఈ సార్వభౌముడైన దేవునికి, వారి ఆరాధన విషయంలో, వారి జీవితాల విషయంలో మానవులంతా జవాబు చెప్పాల్సి ఉంది. తిరుగుబాటు చేసేవారు, పాపులు ఆయన తీర్పును ఎదుర్కొంటారు (1:5). కాని ఆయన కోసం కనిపెట్టి, ఎదురు చూసేవారు తమ ప్రార్థనలకు జవాబు పొందుతారు (7:7).
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Micah Read More »

Jonah

చిన్న ప్రవక్తలలో ఐదవదైన యోనా గ్రంథం, దాని నిర్మాణంలో, సారాంశంలో చరిత్ర గ్రంథాల్లో కనిపించే ప్రవక్తల కథల్లాగానే ఉంటుంది. ఈ పుస్తకంలో ‘‘తప్పుదారి ప్రవక్త’’గా, దేవుని నుండి పారిపోయి ఒక చేప మింగిన యోనా జీవితాన్ని గూర్చిన క్లుప్త అవలోకనం కనిపిస్తుంది. మనుషులందరి పట్ల దేవుని కృప, ప్రేమలకు ఋజువులు మనం ఈ పుస్తకమంతటా చూస్తాం. 
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Jonah Read More »

Obadiah

చాలా ప్రవచన గ్రంథాల్లో అనేక రాజ్యాలకు విరోధంగా ప్రవచనాలు ఉన్నాయి, కాని ఓబద్యా గ్రంథం ఒక్క ఎదోము దేశం మీద మాత్రమే దృష్టి సారించింది. ఓబద్యా క్లుప్త సందేశం సమీపిస్తున్న యెహోవా దినం గూర్చి, ఇశ్రాయేలీయులు ఎదోము దేశాన్ని  స్వాధీనం చేసుకుంటారనే వాగ్దానం గురించీ కేంద్రీకృతం అయి ఉంది. 
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Obadiah Read More »

Amos

క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దంలోని నలుగురు ప్రవక్తలలో తనతోబాటు పరిచర్య చేసిన హోషేయ, యెషయా, మీకా లలో ఆమోసు మొదటివాడు. ఆమోసు యూదాకు చెందినవాడైనప్పటికీ, హోషేయతోపాటు ఇతడు కూడా ఇశ్రాయేలు రాజ్యంలోనే పరిచర్య చేశాడు. ఇతడు తనను తాను వృత్తిపరంగా ఒక ప్రవక్తగా పరిగణించని ఒక సాధారణ వ్యక్తి (7:14-15). తన కాలంలోని పైపై మెరుగులతో ఉన్న  మతవ్యవస్థలకు వ్యతిరేకంగా అతడు మాటలు, దర్శనాల ద్వారా మాట్లాడాడు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Amos Read More »

Joel

పాత నిబంధనలోని అతి చిన్నపుస్తకాల్లో యోవేలు ఒకటి. మొదటి భాగం (1:1-2:17) భయంకరమైన మిడతల తెగులును వర్ణించి, పాపాలు ఒప్పుకోమనే విన్నపంతో ముగుస్తుంది. రెండవ భాగం (2:18-3:21) పశ్చాత్తాపం పొందినవారికి నిరీక్షణతో పాటు, వారి శత్రువులపై వచ్చే తీర్పును ప్రకటిస్తుంది.
Read More

TSB Video

Joel Read More »

Hosea

హోషేయ ఇచ్చిన విశిష్ఠమైన సందేశంలో అతని స్వంత వివాహం, కుటుంబం కీలకమైన పాత్రను పోషించాయి. అందువలన ఈ పుస్తకం ప్రవక్తల పుస్తకాలన్నిటిలో ఎక్కువగా స్వీయకథాత్మకమైన గ్రంథం అని చెప్పవచ్చు. దేవుని కృపా వాక్యం, మారుమనస్సుకై ఆయన పిలుపు బహు నాటకీయంగా ప్రదర్శింపబడి, తిరస్కారం పొందినా మానక తన భార్య గోమెరు పట్ల హోషేయ చూపిన ప్రేమ, వారి ముగ్గురు పిల్లల పేర్లతో గుర్తించబడినట్లుగా కనిపిస్తుంది. తన స్వంత కుటుంబం గురించిన ఈ సమాచారానికి మించి, హోషేయను గూర్చి దాదాపుగా మనకు ఏమీ తెలియదు. విచ్చలవిడి లైంగిక జీవితంతో హోషేయకు ఎంతో మనోవేదన కలిగించిన గోమెరుతో దైవాజ్ఞవల్ల జరిగిన వివాహమే అతని సుదీర్ఘ పరిచర్యకు ఆరంభంగా కనిపిస్తుంది. తన వ్యక్తిగత దు:ఖాన్ని దిగమింగి సేవచేయడమే కాకుండా, ఈ సమస్యాత్మకమైన వివాహమే తన పరిచర్యకు పునాదిరాయి అని హోషేయ గ్రహించాడు.
Read More

TSB Video

Hosea Read More »

Daniel

దానియేలు అనే పేరుకు ‘‘దేవుని న్యాయాధిపతి’’ లేదా ‘‘దేవుడు న్యాయం తీరుస్తాడు’’ అని అర్థం. దానియేలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బబులోను చెరలో నివసించిన ప్రవక్త. యూదులు చెరలో ఉన్న కాలంలో అక్కడ జరిగిన ముఖ్య సంఘటనల గురించి దానియేలు ప్రవక్త వివరించడంతోబాటు, దేవుడతనికి చూపించిన దర్శనాల్ని కూడా తెలియజేస్తున్నాడు.
Read More

TSB Video

“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”

Daniel Read More »