Zephaniah
చిన్న ప్రవక్తలలో ఒకడైన జెఫన్యా, దేవుని ముందు నీతిగా జీవించాల్సిన అవసరత గురించి బోధించాడు.. ప్రవక్తలందరిలో తీర్పును గూర్చి అత్యంత బలమైన వివరణ ఇచ్చినవాడు జెఫన్యా, అయితే పశ్చాత్తాపం చెంది, నీతివైపు తిరిగినవారు పునరుద్ధరించ బడతారనే విషయాన్ని కూడా అతడు ఎత్తి చూపించాడు.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: సుదీర్ఘమైన జెఫన్యా వంశావళి (1:1, హిజ్కియా వరకు, నాలుగు తరాల వెనక్కి), అతడు రాజవంశీకుడని తెలియజేస్తుంది. చివరి పేరు ప్రాముఖ్యం కాకపోయి ఉంటే, నాలుగు తరాలు ఎందుకు రాశాడు అనే ప్రశ్న మిగిలిపోయి వుండేది (మిగిలిన ప్రవక్తలు, ఎక్కువలో ఎక్కువ రెండు తరాలను చెప్పారు. జెకర్యా 1:1 చూడండి). అతని తండ్రి పేరు ‘‘కూషీ’’ కావడం వలన, జెఫన్యా కూషీయుల రక్తసంబంధి అని ప్రజలు అనుమానించి, అతనిది మిశ్రితవంశం అనుకుంటారేమోనని అలా రాసి ఉంటాడు. నిజానికి తన క్లుప్త ప్రవచనంలో బహుశా తన కూషీయ మూలాలు చెప్పడానికన్నట్లు, జెఫన్యా రెండుసార్లు కూషీయుల/కూషు (‘‘ఐతియోపీయులు’’)ను పేర్కొన్నాడు (2:12; 3:10). అంతర్లీనంగా ఉన్న ఋజువులను బట్టి ఈ పుస్తకం క్రీ.పూ. 640-612 మధ్యకాలంలో రాసివుంటాడని తెలుస్తుంది. జెఫన్యా 1:1లో యోషియా రాజు (క్రీ.పూ.640-609) పాలన గూర్చిన ప్రస్తావన ఉంది. 2:13-15 లో నీనెవె పతనాన్నిగూర్చిన ప్రవచనం ఉంది. నీనెవె క్రీ.పూ. 612లో పతనమయ్యింది కాబట్టి, జెఫన్యా ప్రవచనం అంతకు ముందే చెప్పివుంటాడు. అంతేకాక, యూదయలో విగ్రహారాధన జరుగుతూ ఉండడం (1:4-6) చూస్తే, జెఫన్యా పరిచర్య సుమారు క్రీ.పూ. 621లో ఆరంభమైన యోషియా సంస్కరణకన్నా ముందే ఆరంభమై ఉంటుందని తెలుస్తుంది (2రాజులు 23)
నేపథ్యం: రాజైన యోషియా తండ్రి, ఆమోను (1:1), తన తండ్రి, రాజైన మనష్షేలాగా దుష్టుడు (2రాజులు 21:1-7,11,16,20-22). ఈ దుష్టవారసత్వం, యోషియా క్రీ.పూ. 640లో సింహాసనాన్ని ఎక్కేసరికి దేశంలో విగ్రహారాధన పెరగడానికి కారణమయ్యింది. యూదయలో విగ్రహారాధనను అణచివేయడానికి యోషియా చాలా కృషి చేశాడు (జెఫన్యా 1:4-9). అన్యులైన యాజకులతోపాటు, ‘‘సాంప్రదాయ యాజకులు’’ కూడా బయలు, మొలెకు, ఇంకా మిగిలిన దేవతలకు సాష్టాంగపడుతూనే, యెహోవా ఆరాధనను నడిపించేవారు (1:4-6). ధర్మశాస్త్రం ప్రజల ముందు చదవడం (క్రీ.పూ. 621), యోషియా సంస్కరణలు ప్రారంభించడానికీ, పశ్చాత్తాపం చెందిన ప్రజలు అసంఖ్యాకమైన బలిపీఠాలను పడదోయడానికి (యిర్మీయా 11:13తో పోల్చండి), బయలు, మొలెకు వంటి దేవతల విగ్రహారాధన సామగ్రిని కూలదోయడానికి సహాయపడిరది (2రాజులు 23:1-14తో జెఫన్యా 1:3-4). ఇందులో తప్పుడు యాజకులను తొలగించడం కూడా ఉంది (2రాజులు 23:5).
గ్రంథ సందేశం, ఉద్దేశం
రానున్న ‘‘యెహోవా దినం’’ నాడు జరగబోయే వినాశనాన్ని దృష్టిలోపెట్టుకుని (1:7-18; 2:2-3), అత్యవసరమైన ఆహ్వానం ఇవ్వడమే జెఫన్యా ప్రాథమిక ఉద్దేశం. యెహోవాను మాత్రమే నీతితో, దీనత్వంతో వెదకాలని అతడు యూదా ప్రజలను బతిమాలాడు (2:1-3). రానున్న దేవుని తీర్పును గూర్చి విగ్రహారాధికురాలైన యూదాను హెచ్చరించడమే దీని తక్షణ ఉద్దేశం (1:4-13). భూమిమీదకు రానున్న యెహోవా తీర్పును బట్టి ఆయనలో విశ్వాసముంచమని (1:2-3,17-18), సకల రాజ్యాలనుండి ‘‘శేషము’’ను పిలవడమే దీని అంతిమ ఉద్దేశం (యూదా, 2:7-9; ఇశ్రాయేలు 3:12-13; సమస్త జనులు, 3:9-10).
యెహోవా దినం: బైబిల్ కాలాలలో, ఒక పట్టణాన్ని ముట్టడివేసి పట్టుకొనే యుద్ధం, నెలలు లేక కొన్నిసార్లు సంవత్సరాలు పట్టేది; నిజంగా బలమైన యోధుడైన రాజు మాత్రమే (3:15,17 యెహోవా బిరుదులు చూడండి) ఒక్కరోజులో యుద్ధాన్ని గెలుస్తాను అని చెప్పగలడు. యెహోవా దినం అంటే ఆయన భూమిని ‘‘దర్శించిన’’ ఏ సమయమైనా, అది తన శత్రువులను శిక్షించడానికైనా (1:7-9,12), లేక తన ప్రజలను రక్షించడానికైనా (2:7తో 3:17 పోల్చండి). కొన్ని పరిస్థితులలో ఇది ఆయన ప్రజలను తక్షణ శ్రమలనుండి విడిపించి, వారి రక్షణగా పరిణమించవచ్చు (2:7,9). కాని యెహోవా దినం చివరిగా అంత్యకాలంలో వస్తుంది (3:11-20తో యోవేలు 3:14-21; జెకర్యా 14:1-14).
శేషము: జెఫన్యా నొక్కి చెప్పిన ‘‘ఏమియు విడవకుండ… సమస్తమును ఊడ్చివేసే’’ దేవుని తీర్పు (1:2-3,17-18 తో 3:6; ఆమోసు 9:1-4 పోల్చండి), కొద్దిమంది ప్రాణాలు (వీరినే ‘‘శేషము’’ లేక ‘‘శేషించినవారు’’ (జెఫన్యా 2:9 నోట్సు చూడండి) అని అన్నాడు) కాపాడతాను అనడం పరస్పరవిరుద్ధం ఏమీ కాదు. యూదయలోని దుష్టులను, వారి విదేశీ పొరుగువారిని (2:4-9) దేవుడు నాశనం చేసినా, యెహోవాను ఆరాధించుటకు శేషమును (ఇందులో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు) ఉంచుతానని ఆయన వాగ్దానం చేశాడు (3:9తో 2:11 పోల్చండి).
దేవుని బిరుదులు: యెహోవా ఇశ్రాయేలీయుల రాజు (2:9), సైన్యములకథిపతియగు ప్రభువు (అక్షరార్థంగా ‘‘యావే’’) కూడా (2:9-10), ఆయన భూమిమీద, పరలోకంలో ఉన్న సర్వసైన్యాలకు సార్వభౌముడైన అధికారి. ఇశ్రాయేలు రాజైన యెహోవా (3:15), ‘‘యుద్ధశూరుడు’’, అలాగే తన ప్రజలను రక్షించే ‘‘మీ దేవుడైన యెహోవా’’ (3:17తో నిర్గమ 15:2-3,13-18).
రెండవది, యెహోవా దినాన, ‘‘దేవుడైన యెహోవా’’ (హెబ్రీ ‘అడొనాయ్ యావే’) విశ్వాధిపతి, తన ఉగ్రతను (పొంగిపొర్లుతున్న కోపాన్ని) (జెఫన్యా 1:7,14-18), విగ్రహారాధికులపై, స్వీయ సంతృప్తి పొందిన ఆరాధికులందరి మీదా (1:4-13) కుమ్మరిస్తున్నాడు. ‘‘సైన్యములకధిపతియగు యెహోవా’’, తన ప్రజలను బాధించిన దేశాలను శిక్షించడంపై దృష్టిపెట్టాడు (2:8-10), వారి దేవతలను ఆయన నిర్మూలం చేస్తాడు (2:11). అలా యెహోవా రోషాగ్ని యూదాకు విరోధంగానే కాక (జెఫన్యా 2:2-3), భూమిమీదనున్న రాజ్యాలన్నిటిపై (3:8) విడుదలైంది (1:18తో ద్వితీ 4:23-27 పోల్చండి). న్యాయం చేసే నీతిగల దేవుడైన యెహోవా (3:5), అహంకారులైన తిరుగుబాటుదారులను తుడిచివేయడం ద్వారా (3:11), తన న్యాయాన్ని తిరుగుబాటు చేసిన యూదయ మధ్యలో (3:5) నెరవేర్చాడు. అయినప్పటికీ, తన ప్రేమనుబట్టి (3:17), యుద్ధశూరుడైన ఈ రాజు (3:15,17), హింసించే శత్రువులను అడ్డుకుని, శిక్షకు పాత్రులైన తన శేషమును కీడునుండి రక్షిస్తాడు (3:15-17,19).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
శేషము కొరకైన వాగ్దానం, దేవుని రోషాగ్నిని, దుష్టులపై ఆయన రగులుతున్న కోపంతో, దేవుని ఆశ్చర్యకరమైన కృప సమతుల్యం చేయడాన్ని వర్ణిస్తుంది (నహూము 1:2-8). ఆయన గర్విష్టి జనాలకు తీర్పు తీరుస్తాడు (జెఫన్యా 2:8-11,13-15), తన ప్రజలలో ఉన్న అహంకారులైన అతిశయపరుల్ని తొలగించి (3:11) దీనులను సంరక్షిస్తాడు. యెహోవాను దీనంగా వెంబడిరచే ప్రతివారు విడుదలకై ఆయనను వెదకాలని జెఫన్యా ఆహ్వానించాడు (2:2-3). క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా, మనమందరం రక్షణ పొందవచ్చనే అద్భుతమైన సత్యాన్ని కొ.ని. ఎత్తి చూపుతుంది. యూదులలో శేషము అనే ఆలోచనను పౌలు నొక్కి చెప్పి, ‘‘కృపద్వారానే’’ శేషము ఎన్నికయ్యింది గాని క్రియలచేత కాదు అని జ్ఞాపకం చేశాడు (రోమా 11:5-6).
గ్రంథ నిర్మాణం
‘‘యెహోవా వాక్కు’’ (1:1; 3:20) అనే మాటల మధ్య జెఫన్యా గ్రంథమంతా ఉండి, కీలకమైన అభినందన సందేశాలను నొక్కి చెబుతోంది: ఆసన్నమైన, విశ్వతీర్పు (1:1-3:8), కాని చివరకు శేషముకు రానున్న ఆశీర్వాదాలు (3:9-20). గందరగోళంగా ఉన్న మొదటి భాగం, ‘‘ఇదే యెహోవా వాక్కు’’ అనే పల్లవితో పటిష్టంగా అల్లినట్లుండి (1:2-3,10; 2:9; 3:8తో 2:5, ‘‘యెహోవా సెలవిచ్చునదేమనగా’’ పోల్చండి), అన్నీ కలిసి ఉన్న తీర్పును ఎత్తి చూపుతుంది. జెఫన్యా 3:8, వెనక్కు (‘‘కాబట్టి’’), ముందుకు (‘‘అప్పుడు’’ అనే మాటతో మొదలైంది. తీర్పును పూర్తిచేసి, శేషమునకు రక్షణ ఫలంగా ఇచ్చే దేవునికోసం ఓపికతో ఎదురుచూడు.. వ.9-13) చూస్తున్న పరివర్తనా హెచ్చరిక.3:8-13లో తీర్పు సమయంలో నిరీక్షణను ఇవ్వజూపడం రెండు హెచ్చరికలను సమీకరిస్తుంది: 1:7 (దుష్టులను ‘‘నిర్మూలం’’ చేసే యెహోవా దినం కోసం యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి); 2:1-3 (రక్షణ వచ్చే అవకాశం ఉన్నందున ఆయనను వెదకమని కీలకమైన ఆహ్వానం).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”